For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేలాడే పూల కుండీల అలంకరణ!

By B N Sharma
|

hanging
ఎంతో శ్రమపడి కట్టుకున్న ఇంట్లో పువ్వులను రకరకాల కుండీలలో అమర్చి వేలాడదీయటంవల్ల ఇంటికి ఓ సరికొత్త అందం, ఆకర్షణ వస్తుంది. మొక్కల కుండీలను పైన వేలాడదీసి అందులో రకరకాల పువ్వులను ఉంచితే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.

పొడవైన పువ్వులను ఎత్తుగా అలంకరించేందుకు వెడల్పుగా, ఎత్తు తక్కువగా ఉండే బాటిల్ లేదా కుదురులాంటి కుండీలను ఎంపిక చేసుకోవాలి. బాటిల్ లేదా కుదురులో పావు వంతు నీటిని పోసి, అందులో రంగురాళ్లు, గాజుగోలీలను ఉంచి తరువాత పువ్వులను అమర్చాలి. బాటిల్ అడుగున పేర్చే రంగురాళ్లు,గాజు గోలీలు పరిసరాల రంగుతో మ్యాచ్ అయ్యేలా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలాంటి బాటిల్ లేదా కుదురులాంటి కుండీలను టీపాయ్ మీద పెట్టేటట్లయితే సోఫాసెట్ రంగు లేదా గోడల రంగును దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే రిఫ్రిజిరేటర్ , పుస్తకాల అల్మైరా, వాల్ హ్యాంగింగ్స్ పైన కూడా వీటిని పెట్టవచ్చు.

ఇక పువ్వులతో డెకరేట్ చేసేందుకు ప్రత్యేకమైన పూలను సేకరించాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే అన్నిరకాల క్రోటన్ ఆకులు, పువ్వులు, చేమంతులు, కనకాంబరం, మల్లె, జాజి, మందార, ఉమ్మెత్త... ఇలా అందుబాటులో ఉన్న పువ్వులన్నింటినీ వాడవచ్చు. అయితే వీటిని ప్రత్యేకంగా అమర్చినట్లయితే అందంగా ఉంటాయన్న సంగతిని మర్చిపోకూడదు.

English summary

Decorating Hanging Flower Pots! | వేలాడే పూల కుండీల అలంకరణ!

One need not collect the flowers separately from other sources. You can pick them up from your home garden and keep them in the hanging pots inside the house.
Story first published:Tuesday, November 1, 2011, 16:53 [IST]
Desktop Bottom Promotion