For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెడ్‌ రూమ్‌ లో తెలుపు బెడ్‌ షీట్‌లను వాడకూడదా!

|

Bedroom Decoration
బెడ్ రూం అలంకరణలో ఇష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటం కంటే మానసిక ఉపశమనానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిజైనర్లు చెబుతున్నారు. గోడల రంగులు డోర్ కర్టెన్లు విండో కర్టెన్లు వంటివి కంటికి భారంలా అనిపించకుండా రూం లోకి వెళ్లగానే మనసుకు ఉపశమనం కలిగించేలా అమర్చుకోవాలని వీరు సలహా చెబుతున్నారు. అవేమిటో చూద్దాం..

మీ బెడ్‌రూం మీ ఇష్టం.. దీనిని ఎవరూ కాదనరు కానీ.. అలసిపోయిన మీ ఒంటికి మనసుకు కంటి నిండా కాస్త నిద్ర పట్టేలా మీ బెడ్ రూం అలంకరణ ఉంటే చాలా మంచిది. నిద్ర సుఖమెరుగదు అలాగే ఖరీదైన అలంకరణలను కూడా కోరుకోదు. పని ఒత్తిడితో అలసిపోయి ఇంటికి వచ్చాక పడుకోగానే నిద్రపట్టేలా బెడ్ రూమ్ ఉంటే చాలు. నిద్ర సరిగా పట్టాలంటే బెడ్‌ రూంలో ప్రకాశవంతమైన లేదా ముదురు రంగులు ఉండరాదు. ఉదాహరణకు ఆరెంజ్ వంటి ముదురు రంగులు వాడకుంటే మంచిది. గదిలోకి అడుగు పెట్టగానే ఒకలాంటి ఉపశమనాన్ని కలిగించేలా గోడల రంగులు ఉండాలి.

అలాగే గోడల రంగులకు సరిపోయేలా డోర్ కర్టెన్లు, విండో కర్టెన్లు అమర్చుకోవాలి. అయితే అన్ని కర్టెన్లు కూడా ఒకే రంగులో ఉంటే చూసేందుకు బాగుండదు. కొన్ని రంగులకయితే వాటికి సరిపోయే రకం కర్టెన్లనే ఉపయోగించాలి.

కొత్తగా పెళ్లైన దంపతుల కోసం బెడ్‌ రూమ్‌ లో ఆనందకర మైన వాతావరణం నెలకొనాలని భావిస్తుంటారు. అలాంటి వారు కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్‌ రూమ్‌ ని ఎరుపురంగులతో అలంకరించండని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎరుపు డైనమిజానికి చిహ్నం. అలాగే పెళ్లైన కొత్త దంప తులు వాడే బెడ్‌ రూమ్‌లో తెల్లని బెడ్‌ షీట్‌ లకు వాడకూడదు. బెడ్‌ రూమ్‌ లో ఎప్పుడూ మొక్కలను, పువ్వులను ఉంచకూడదు. అలాగే మీ పడకగదిలో ఎప్పుడూ నీళ్లకి సంబంధించిన వాటిని తొలగించడం మంచిది.

ఉదాహరణకు అక్వేరియం, ఫౌంటెన్‌ లాంటివి అక్కడ నుంచి తీసెయ్యాలి. ఎందుకంటే అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి రాతలకు దారితీస్తాయి. ఇంకా మీ బెడ్‌ రూమ్‌ లో పెళ్లైన దంపతులున్న పెయింటింగ్‌ లను తగిలిస్తే దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లుతుందని ఫెంగ్‌ షుయ్‌ నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Ideas for Bedroom Decoration..!|దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లాలంటే..|

Lime green is a very modern color for decorating right now, and it can be used in almost any style of decor. This is another example of using lime as an accent color in an otherwise neutral room.
Story first published:Saturday, December 24, 2011, 16:29 [IST]
Desktop Bottom Promotion