For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల అందం మెరుగుపడాలంటే...!

By B N Sharma
|
Tips While Choosing A Dressing Table
ఇంటి అలంకరణ, వంటి అలంకరణ రెండూ కూడా డ్రసింగ్ టేబుల్ లేకుంటే పూర్తి కానట్లే. మహిళలు తమ అలంకరణ తర్వాత అద్దంలో చూసుకొని అరగంట తృప్తి పడితే గానీ అలంకరణ పూర్తయినట్లు భావించరు. ఇంత ప్రాధాన్యతగల డ్రసింగ్ టేబుల్ ఎంపిక చేసుకోడానికి కొన్ని జాగ్రత్తలు చూడండి.

1. డ్రెసింగ్ టేబుల్ తో పాటు ఛైర్ వుండాలా?... డ్రసింగ్ చేసుకునేటపుడు అద్దంలో సౌకర్యవంతంగా కూర్చుని చేసుకోవాలంటే ఒక స్టూల్ వుండాల్సిందే. వీటికి కుషన్లు కూడా వుంటే మరింత సౌకర్యం. మేకప్ చేసుకునే సమయంలో మహిళలు మరింతసేపు మెత్తగా కూర్చోవచ్చు.
2. డ్రసింగ్ టేబుల్ కు లైటింగ్ ఏర్పాటు వుంటే బాగుంటుంది. అద్దం మూలలలో చిన్న సైజు లైట్లు వుంటే డ్రసింగ్ చేసుకోవడం తేలికగా వుంటుంది.
3. డ్రసింగ్ టేబుల్ తయారీ ఎలా వుండాలి - గ్లాస్, మార్బుల్, వుడ్ మొదలైనవాటితో తయారీ వుంటుంది. గ్లాస్, మార్బుల్ వ్యయం ఎక్కువ కనుక వుడ్ డ్రసింగ్ టేబుల్ సరైనది. మన్నిక కూడా వుంటుంది. డ్రసింగ్ టేబుల్ కు వర్టికల్ మిర్రర్ వుంటే మీ ఆకారం పూర్తిగా కనపడుతుంది.
4. డ్రసింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలి? - ఇంటిలో డ్రసింగ్ టేబుల్ కు సరైన స్ధలం అంటే, విండోల దగ్గర. పగటిపూట విండో వద్ద కావలసినంత లైటింగ్ పడి డ్రసింగ్ చేసుకోడానికి సౌకర్యంగా వుంటుంది.

సాధారణంగా డ్రసింగ్ టేబుల్ ను ప్రతి ఇంటిలోనూ బెడ్ రూమ్ లో వుంచుకుంటారు. అయితే, డ్రసింగ్ టేబుల్ లివింగ్ రూమ్ పెద్దదిగా వుంటే, ఒక మూల పెట్టినా సౌకర్యంగానే వుంటుంది.

English summary

Tips While Choosing A Dressing Table | డ్రసింగ్ టేబుల్ ఎంపిక ఎలా?

Choosing Dressing Tables With Lighting Options – Lighting is very important for decking up. The small lights at the corners of the mirror highlight face and help men and women to dress up best. If the table consists side view mirrors, the lighting can be reduced because a single light reflects on side mirrors making 1 worth 3.
Story first published:Wednesday, November 30, 2011, 10:47 [IST]
Desktop Bottom Promotion