For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు కళకళలాడించే ప్రమిదలు పలురకాలు... దీపావళి స్పెషల్

|

దీపాళీ పండుగ అంటేనే దీపాలంకరణతో ప్రతి ఇల్లు కళకళలాడాల్సిందే. అదే ఈ పండుగ స్పెషల్. చీకటికి వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. హిందువులే కాకుండా అన్ని మతాలవారు అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రథమ స్థానం ఉంది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

గులాబీ రేకుల్లాంటి దీపం: ఈ దీపాలు మట్టితో తయారు చేసినవి. చూడటానికి రేకులు విచ్చుకొన్న గులాబి పువ్వులా అందంగా కనబడుతోంది.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

మట్టితో చేసిన ఈ దీపం చూడటానికి చాలా సింపుల్ గా, అందంగా కనబడుతోంది. అంతే కాదు ఇది వాలెంటైన్ గిఫ్ట్ లా కూడా కనిపిస్తోంది. అయితే మధ్యలో స్వస్తిక్ సింబల్ ఉండటంతో సాంప్రదాయ దీపాఅలంకరణకు బాగా నప్పుతుంది.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

మట్టితో తయారు చేసినటువంటి, శంకు ఆకారంలో ఉన్న ఈ నత్త చిప్ప ఆకారంలో చాలా అందంగా తీర్చి దిద్దబడింది.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

మట్టితో తయారు చేసిన ఈ జంట దీపాలు ఒక కొమ్మలో అరిన విధానం అద్భుతంగా ఉంది. ఆలివ్ కొమ్మ కాడకు, చిన్న చిన్న ఆకులు ఒక ప్రక్క అందంగా, ఆకర్షణీయంగా తీర్చి దిద్దబడినది.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

ఈ దీపావళి రోజున గణేషునికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవితో పాటు, గణేషున్ని కూడా పూజిస్తారు. కాబట్టి గణేషుని ఆకారంలో చూడముచ్చటగా ఉన్న ఈ దీపం మరింత ఆకర్షనీయం.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

మట్టితో చేసి ఈ దీపాలను ఇంటి ఆవరణంలో, ఇంటి బయటగా వెలిగిస్తారు. దీపాలకు గాలి వీయకుండా అడ్డుగా ఒక పక్షి గూడు ఆకారంలో అద్భుత ఆకారంలో పింగానీ కోటింగ్ తో తయారు చేసినారు.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

ఈ దీపానికి ప్రత్యేకత అంటూ ఏమి లేదు. అయితే వివిధ రంగులతో ఇంద్రదనస్సులా ఆకర్షణీయంగా అద్భుంగా ఒక కన్ను ఆకారాన్ని తలపిస్తోంది.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

ఈ దీపావళికీ లక్షీ దేవికి, గణేషునికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఈ దీపాలను చూస్తే అర్థం అవుతుంది. మట్టితో అద్భుతగా దేవుళ్ళు ఆకారాలతో దీపాలను తీర్చిదిద్దడం ఈ దీపావళికే ఓ ప్రత్యేకత.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

వికసించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న దీపం అద్భుతం.

ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

స్టార్ దీపం. ఐదు వత్తులు వేసి వేలిగించుకోవచ్చు. నక్షత్ర ఆకరంలో ఐదుఒత్తులతో చాలా ఆకర్షనీయంగా కనబడుతుంది.

ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. దీపావళి పండుగనాడు ప్రతి ఇల్లు దీపాల వరుసలతో కళకళలాడుతుంటుంది. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో... ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెపుతోంది. ఈ దీపాలను వెలిగించేందుకు ఉపయోగించే ప్రమిదల ఎంపిక వారం రోజుల ముందు నుంచే జరుగుతుంటుంది. ముఖ్యంగా మట్టి ప్రమిదలకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

ఈ ప్రమిదలకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈసారి వ్యాపారులు విభిన్న రకాలైన ఆకారాలలో ప్రమిదలను తయారు చేసి వినియోగదారులను బాగా ఆకర్షిస్తున్నారు. పువ్వుల ఆకారాలు, శివపార్వతుల స్వరూపాలు, వివిధ దేవతల ఆకృతులు, లక్ష్మీ దేవి ఆకృతులలో ప్రమిదలను తయారు చేశారు. మొత్తం 25 రూపాలలో ఈ ప్రమిదలను వ్యాపారులు తయారు చేశారు. వీటి విలువ కూడా ఐదు రూపాయలతో మొదలైన వంద, రెండొందల వరకూ అమ్ముడుఅవుతున్నాయి. ప్రతి ఒక్క వెరైటీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సంప్రదాయాలకు అనుగుణంగా ఏ వస్తువుకైనా కొత్తదనాన్ని జోడిస్తే ప్రజలను తప్పకుండా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. మొత్తమ్మీద ఈసారి ఈ ప్రమిదలను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు మహిళలు. మరి మీరు ఎలాంటి దీపాలను ఎంపిక చేసుకొంటారో చూడండి....!

English summary

10 Diya Designs To Dazzle You This Diwali | ప్రమిదల పొందు.... కళ్ళకు విందు...!

The tradition is continued till today. Families light up their homes with diyas on Diwali to ward off evil spirits and welcome the Goddess of wealth, Lakshmi to their house. But over the years, the art of diya making has evolved. Now a days, you get diyas with the most intricate work on them. These oil lamps are mostly handmade and thus the delicacy of the work can sometimes take you by surprise.
Desktop Bottom Promotion