For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదికి ఆధునిక హంగులతో కూడిన ఫర్నీచర్...

|

Bedroom Decoration to relax and recharge
ప్రస్తుతం ఇంటి అలంకరణలో ఎన్నో మార్పులు సంతరించుకొంటున్నాయి. మనిషికి సంబంధించిన ఏకైక ఏకాంత ప్రదేశం పడకగది. బెడ్‌ రూమును కూడా సరిగా పెట్టుకుంటేనే దానికి అందం, పొందిక ఏర్పడతాయి. బెడ్‌ రూమ్‌ అనేది నానా వస్తువులను కలిపి ఉంచే స్టోర్‌ రూమ్‌ కాదని గుర్తు పెట్టుకుంటే దాన్ని ఎలా ఉంచాలో అర్థమవుతుంది. ముఖ్యంగా పడకగదిలోని మంచానికి ఆధునిక హంగులు చేరుతున్నాయి.

ప్రస్తుత కాలంలో పడకగది కేవలం నిద్రించడానికే పరిమితం కాక, నిద్రవచ్చేంతవరకు ఏదైనా పుస్తకాలను చదవడం లేదా రచనలు సాగేందుకు ఆవాసాలుగా రూపాంతరం చెందుతున్నాయి. వ్యక్తుల అభిరుచులకు అనుగుణంగా మంచాల రూపకర్తలు తలగడవైపు ప్రత్యేక అమరికలను చేస్తున్నారు. తమ అమరికలలో మంచం యొక్క తలగడవైపు ఆనుకుని చదువుకోవడం లేదా రచన సాగించేందుకు వీలుగా వినియోగదారుని ఎత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఆనుకూలనే అమర్పును మంచానికి చేరుస్తున్నారు.

ఈ అమార్పు యొక్క రంగు పడక గది నిర్మాణంలో వినియోగించిన రంగుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకు కూడా ఉపయోగపడేలా తక్కువ ఎత్తులో ఉండే అమార్పులను కూడా మంచానికి చేరుస్తున్నారు. వినియోగదారుల అభిరుచిని అనుసరించి తోలు, ఇనుము లేదా చెక్కను ఈ అమరిక తయారీలో వినియోగిస్తున్నారు. అంతేకాదు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కలిగించేందుకు గాను ఈ అమరికకు లైట్లు కూడా అమరుస్తున్నారు. అలాగని మరీ తక్కువ కాంతి నిచ్చే బల్బులను వినియోగిస్తే కంటి చూపుపై ప్రమాదం పడే అవకాశం సైతం ఉంది కాబట్టీ మధ్యస్తంగా వెలుతురునిచ్చే బల్బులను వాడటం ఉత్తమం. మంచంపై పరుండి చదువుకునే నిమిత్తం రెండు లేదా అంతకుమించి తలగడలను ఉపయోగించి మెడనొప్పి తెచ్చుకోవడం కన్నా అన్ని విధాలుగా శ్రేయోదాయకమైన ప్రత్యేకమైన అమరికలు వున్న వాటిని ఎన్నుకోవడం మంచిది.

బెడ్ రూంలో వాడే పరుపుమీద గెంతడం, దిండ్లు, దుప్పట్లు చిందరవందరగా వేయకుండా ఒక క్రమ పద్దతిలో అమర్చుకోవాలి. పరుపులు, తలగడలకు చక్కటి లేతరంగుల కవర్లు వాడటం మంచిది. పడకగదిలో తప్పకుండా అలాచ్డ్ బాత్ రూం ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. పడకగదిలో ఎప్పుడూ ఫ్రెష్ గా కనబడాలంటే నిద్రపోతున్నప్పుడు మాత్రం తలుపులు వేసుకోవాలి. మిగిలిన టైంలో తలుపులు, కిటికీల విండోలను తెరిచి ఉంచినట్లైతే ఫ్రెష్ గా గాలి ప్రసరించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుగ జేస్తుంది.

English summary

Bedroom Decoration to relax and recharge | పడకగదిలో ఆధునిక హంగులు

A great bedroom is a place to relax and recharge, a stylish and peaceful retreat that’s as versatile as it is welcoming. Contemporary bedroom designs depend on simple, clean-cut lines and straightforward design. Here are a few basic principals and ideas when it comes to contemporary yet modern bedroom design.
Story first published:Saturday, April 7, 2012, 14:19 [IST]
Desktop Bottom Promotion