For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాంప్రదాయానికి అద్దం పట్టే అలంకరణ.....

|

Cultural art decoration in home
ఎంతో డబ్బు ఖర్చుపెట్టి కట్టుకొన్న సొంతఇంట్లో అలంకరణ వస్తువులు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు కనిపిస్తుంది. ఇంట్లో అలంకరణ కోసం వినియోగించే మార్బుల్‌ రాతిపలకలు మార్కెట్లో అందుబాటులోకొచ్చాయి. వివిధ కళరూపాలు ఆకట్టుకుంటున్నాయి. మార్బుల్‌ రాయిపై అద్భుతాలు దర్శనమిస్తున్నాయి. ఇంటి అలంకరణకు వినియోగించే వివిధ వస్తువులను మార్కెట్‌లోకి తెచ్చారు. దేవత విగ్రహాలతో పాటు ఆలయాలు, పూలతొట్టెలు, పెన్‌బాక్సులు, గోడ గడియారాలు, జంతువులు, అలంకరణ వస్తువులు, స్టాండ్‌లు, కవ్వం, పండ్లు, కూరగాయలు, గృహ నిర్మాణ ప్లానింగ్‌లు, వాహనాలు వివిధ రకాలుగా దొరికే ఇంటీరియర్ అలంకరణ వస్తువులను తెచ్చి ఇంట్లో అమర్చుకొన్నట్లైతే కొత్త ఇంటికి కొత్త కళ వస్తుంది.

అనేక హంగులు నేడు గృహా లంకరణలో నిత్యమైపోయాయి. ఈ క్రమంలో దివాన్‌ కాట్‌లు, రకరకాల సోఫాలు ఇంటికి కొత్తవన్నెలు తెచ్చే లా కొనుగోలు చేయటమూ కాకుండా వాటిని అందంగా అలంకరించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నా రిప్పుడు గృహిణులు. ఇంటి అలంకరణ ఓ కళ అనే చెప్పక తప్పదు, టీపాయ్‌ మొదలు, టివి స్టాండ్‌ వరకు, కర్టెన్‌ మొదలు సోఫా కవర్‌ వరకు అన్నీ ఆహ్లాదం పరిచేలా ఉండాల్సిందే.. ఇందు కు ఖర్చుకు వెనక్కి తగ్గకుండా.. తమ శక్తి కొలది కొనుగోలు చేస్తూ... ఇంటిని అలంకరించు కుంటున్నారు అంతా. మామూలుగా ఇంటి అలకంరణ కంటే కొంచెం విభిన్నంగా ఇంటి అలకరించుకోవాలంటే ..సాంప్రదాయ వస్తువులతో అలంకరించుకొటే ఇంట్లో వారు సాంప్రదాయానికి ఎంత విలువిస్తున్నారో తెలుస్తుంది.

తులసి మొక్క: ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ప్రతి ఇంటో ఉండాల్సింది తులసి మొక్క గతంలో పూజలకు ప్రధానమైన ఈ మొక్క పెరటిలో వుండేది. నేటి రోజులలో పెరడు వుండటం లేదు గనుక మీ బాల్కనీ లేదా ఇంటి ముందు భాగంలో ఆకర్షణీయమైన కుండీలో తులసి మొక్కను మెయిన్ టెయిన్ చేసుకోవచ్చు. దాని ముందు నూనెతో వెలిగించిన దీపాన్ని పెడితే చూడటానికి అందంగానూ వుంటుంది. ఇంటిలోని చెడు శక్తులను కూడా తరిమేస్తుంది.

నటరాజ విగ్రహం/కృష్ణుడి విగ్రహం: గతంలో ఒక్క నాట్యకళను ప్రదర్శించే ఇల్లల్లో మాత్రమే చూసేవాళ్ళం. ఇది ఎప్పటికి నూతనత్వాన్ని ఇచ్చేదే. కళా నైపుణ్యతగల లేపాక్షి చేతి పనులతో కూడిన ఇత్తడి నటరాజ విగ్రహాన్ని ఇంటికి వచ్చిన వారికి బాగా కనపడేలా అమర్చండి. లేదా ఆకర్షణీయమైన రంగులతో కూడిన కృష్ణుడి విగ్రహం కూడా ఏ ఇంటికైనా సరే చక్కటి అందాన్నిస్తుంది.

గణేష విగ్రహం: ముఖ్యంగా ప్రతి ఇంట్లో గణేష విగ్రహం, లేదా పటం కొలువుదీరాల్సిందే..చక్కటి అభయాన్నిచ్చే గణేష విగ్రహం ఇంట్లో లేకుంటే ఇంటి అలంకరణ ఎంత చేసినా చేయనట్లే. వీలైనంత వరకు గణేశ విగ్రహాన్ని ఇంటి పూజా గది లో వుంచండి. లేదంటే లివింగ్ రూమ్ లో శుభ సూచకంగా ఒక వైపుగా కూడా బాగానే వుంటుంది. ఇపుడు విగ్రహాలు వివిధ రకాల మెటీరియల్స్ తో తయారు చేస్తున్నారు. మీకు అనుకూలమైంది గది సైజును బట్టి ఎంచుకోవచ్చు.

మేట్రెస్/నేలమీద కూర్చొనే సౌకర్యం: సాధారణంగా మన ఇండ్లలో సోఫాల కంటే కూడా నేలపై కూర్చోటానికి ఇష్టపడతారు. లివింగ్ రూమ్ కు ఒక మూలన ఆకర్షణీయమైన మేట్రెస్ వేసి దానిపై వివిధ రంగులు శాంతినికేతన్ వంటి అరుదైన డిజైన్లు కల కవర్లతో కుషన్లు వేసి వచ్చిన అతిధులకు కూర్చునేటందుకు సౌకర్యం కల్పిస్తే అద్భుతంగా వుంటుంది.

English summary

Cultural art decoration in home | సాంప్రదాయ కళతో ఇల్లు కళకళ....

These decorative paintings are drew and designed by farmers which show a strong country flavor and culture atmosphere. An excellent folk art work for home decorations.
Story first published:Sunday, April 8, 2012, 10:37 [IST]
Desktop Bottom Promotion