For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చూస్తే చాలు... రొమాన్స్ మొదలు....!

By B N Sharma
|

Give your bedroom a romantic touch!
బెడ్ రూమ్ అలంకరణలో రొమాంటిక్ టచ్ కనపడాలి. ఇంట్లో వున్నామంటే, చాలా సమయం బెడ్ రూమ్ లోనే గడిపేస్తాం. అందుకే బెడ్ రూమ్ అనేది సౌకర్యంగాను, మనసుకు హాయినిచ్చేదిగాను వుండాలి. అందుకేంచేయాలి?

గొప్పగా కనపడేలా చేయండి - ముందుగా అందులో సరైన లైటింగ్ ప్రసరించేలా వుండాలి. రాత్రులైతే, డిమ్ లైట్ల వెలుగులు ప్రధానం. బెడ్ రూమ్ లో కేండిల్స్ వెలిగిస్తే ప్రత్యేకంగా వుంటుంది. బాగా వెలుగులు వుండి కంటికి శ్రమనిచ్చే బల్బులు బెడ్ రూమ్ కు వాడవద్దు. వీధి దీపాల వెలుగులు పడకుండా, మందపాటి కర్టెన్లు విండోలకు అమర్చండి.

బెడ్ రూమ్ కు డబుల్ కాట్ తప్పక వుండాలి. కర్టెన్లకు లైట్ రంగులు వాడండి. బెడ్ షీట్లు, పిల్లో కవర్లవంటివి మెత్తగా వుండి మీ కంటికి నచ్చే రంగులు కలిగి వుండాలి. శాటిన్, సిల్క్, గాలి బాగా చొరబడే గుడ్డలు బాగుంటాయి. రెడ్, ఆరెంజ్ వంటి గాఢమైన రంగులు కూడా వాడితే సెక్సీగా వుంటుంది. మెత్తటి తలగడలు వివిధ సైజులవి బెడ్స్ పై వుండాలి. వీటికి రంగురంగుల కవర్లు వేస్తే బాగుంటుంది. రెండు పెద్ద తలగడలు, నాలుగు మీడియం దీర్ఘచతురస్ర తలగడలు వుండాలి. బెడ్ రూమ్ కు రొమాంటిక్ టచ్ ఇచ్చేవి కర్టెన్లు. లైట్ రంగులు కలవి వేయండి. కొన్ని చోట్ల ప్రయివసీ కొరకు మందపాటివి కూడా అవసరపడతాయి.

English summary

Give your bedroom a romantic touch! | బెడ్ రూమ్ అలంకరణ!

Curtains spell romance - pretty, flimsy, sheer curtains that sway with the breeze, light ones in lovely pastel shades that leave you feeling calm and relaxed. Of course, you should also have those heavy drapes to guard your privacy. Romance is about titillating the senses and the sense of smell is important.
Story first published:Monday, January 9, 2012, 11:47 [IST]
Desktop Bottom Promotion