For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రశాంతమైన వాతావరణంతో లివింగ్ రూం...

|
Home Decor for Attractive Living Room
ఇంట్లో వారికోసమే కాదు..ఇంటికి వచ్చే అతిథుల కోసం కూడా లివింగ్ రూం ఆకర్షనీయంగా కనబడేలా అలంకరించుకోవాలి. ఇంటి అలంకరణ చూసి అతిథులు మనస్సును ఇట్టే ఆక్షర్షించే విధంగా అలంకరించుకోవాలి. కాబట్టి మనస్థాయికి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు, చేర్పులతో మన తగిన ఫర్నీచర్ తో అలంకరించుకోవాలి. స్థిరంగా ఒకచోట ఉండకుండా ఇల్లు మారుతూ ఉండే వారు లివింగ్ రూంలో అమర్చుకునే కుర్చీలు, సోఫాలు ఏ ఫ్లోర్‌కైనా నప్పే విధంగా సహజమైన రంగులను ఎంపిక చేసుకోవాలి. సోఫాలు, కుర్చీలు, దివాన్ బెడ్‌ లు వంటివి గోడవారగా ఉంటే బాగుంటుంది. పైగా అవి స్థలం ఎక్కువగా ఆక్రమించినట్టుగా కనిపించదు. గది మధ్యలో వేస్తే నడవటానికి ఇబ్బందే కాకుండా గది కూడా విశాలంగా అగుపించదు.

గదిలో వెలుతురు ఎక్కువగా ఉండి, గది విశాలంగా ఉన్నప్పుడు దివాన్ కవరు, కుషన్ కవర్స్ ముదురు రంగులయితేనే అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. అలాగే కర్టెన్లు కూడా కుర్చీలకు, సోఫాలకు, దివాన్ సెట్స్ కు వాల్ హాంగింగ్స్ కు మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. లివింగ్ రూంలో ఎటాచ్డ్ టాయ్‌ లెట్స్ ఉన్నప్పుడు అక్కడ కర్టెన్లు వేయడమో లేదా తలుపునకు పోస్టర్ అమర్చడమో చేయాలి. ఇంకా అందంగా కనిపించాలంటే కర్టెన్లకు బదులుగా కర్టెన్ హాంగింగ్స్ వాడుకోవచ్చు. కర్టెన్లు కుట్టించేటప్పుడు లోపలికి మడతలు ఎక్కువగా ఉంచుకున్నట్లయితే కిటికీలు పెద్దవైనా, చిన్నవైనా అమర్చుకోవడానికి వీలుగా ఉంటాయి. ప్రతిసారీ కొత్త కర్టెన్లు కొనే అవసరం రాకుండా తరచూ బదిలీలపై వెళ్లేవారు ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం.

సాధారణంగా మనం తయారు చేసుకొన్న ల్యామినేషన్సే కాక సహజమైన సామగ్రి వాడితే మరింతగా విశ్రాంతినిచ్చే, తక్కువ మానసిక ఒత్తిడిని కలిగించే పరిసరాలు ఇంట్లో రూపొందుతాయి. ఎండ,గాలి వంటి సహజ వనరులను అత్యధికస్థాయిలో వాడడం, రంగులు ఫర్నిషింగ్‌ ఉపకరణాలు, లైటింగ్‌ పద్ధతులు. యాంత్రిక , ఎలెక్ట్రానిక్‌ పరికరాలను నియమానుసారం ఉపయో గించ డం- ఆరోగ్యకరమైన ఇంటిని రూపొందిస్తాయి.

తాజా గాలి కోసం: రసాయనిక ఏర్‌ ఫ్రెషనర్లను వాడకపోవడమే మంచిది. వాటికి బదులు బేకింగ్‌ సోడా లేక ఏ ఇతర సహజమైన ఫ్రెషెనర్లను వాడండి. లేక కిటికీలను కాసేపు తెరిచి వుంచడండి. ఇంట్లో విరివిగా మొక్కలు పెంచుకుంటే విషకాలుష్యాన్ని అరికట్ట వచ్చు. తలు పులు బార్ల తెరిచివుంచి ఇంట్లో వేడిని సహ జంగానే బయటికి పోయేలా జాగ్రత్త తీసుకోండి.

కలర్స్: కలర్స్అన్నిటికీ వేవ్‌లెంగ్త్‌ ,శక్తి ఉంటాయి. ఇంట్లో అలంకరణ కోసం సమతూకంతో కూడుకున్న రంగు ల్ని ఎంపిక చేసుకోండి. తేలికైన తెల్లటి లేత పసుపు రంగులు గోడలకు వేస్తే గదిలో ప్రశాంతమై వాతావరణం నెలకొంటుంది.

English summary

Home Decor for Attractive Living Room... | మనస్సును ఇట్టే ఆకర్షించే లివింగ్ రూం...

Living room is the Place the Guests stay and partake in Your hospitality and festive celebration. So decorating the living room Gorgeously..Traditionally....
Story first published:Thursday, March 22, 2012, 11:45 [IST]
Desktop Bottom Promotion