Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
ఇంటి అలంకరణలో గులకరాళ్లు...వాటర్ బబుల్స్

అలాకాకుండా కొంచెం ట్రెండ్ కు తగ్గ అలంకరణలో మార్పులు చేసుకుంటే ఇంట్లో పాతపడిన పొడవాటి గాజు సీసాలు, జ్యూస్ గ్లాసులు, శీతల పానీయాల బాటిళ్ళ వంటివి ఉంటాయి కదా. వాటిని ఎంచక్కా రంగు రంగుల గులకరాళ్ళతో కొత్తగా తీర్చిదిద్దుకోవచ్చు..సాధారణంగా మట్టి ఇసుకలో దొరికే రంగురాళ్ళు ఆల్చిప్పలు, గవ్వలంటే అతివలకు ఆసక్తి, సేకరించి దాచుకునే వారి సంఖ్యా తక్కువేం కాదు. మీ అభిరుచికి తగినట్టే వాటితోనే ఇంటి అలంకరణ చేసుకోవాలి.
మిరుమిట్లు గొలిపే వివిధ రంగుల్లో గులకరాళ్లు, పూరేకులు, నీటిలో వేయగానే పెద్దవయ్యే స్నేక్, వాటర్ బబుల్స్ వంటి వాటిని ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ధర తక్కువ, ఆకర్షణ ఎక్కువ, మీరు కొన్ని రూపాలను, రంగులను ఎంచుకొని గులక రాళ్లను కొనుగోలు చేసి, వాటిని పారదర్శక ప్లాస్టిక్, గాజు సీసాల్లో వాటిని ఉంచితే ఆ ఇంటికి కొత్తకళతో ఇంటి అందమే మారిపోతుంది. పొందికైన ఆకృతిలో...నీళ్ళలో వివిధ రంగుల్లో మెరుస్తూ గులకరాళ్ళు...బల్లమీద పెట్టినా. టీవీమీద ఉంచినా చూసీ చూడగానే చటుక్కున ఆకట్టుకుంటాయి. వాటిల్లో అందం, సహజమైన హంగుకోసం కృత్తిమ మొక్కలను ఉంచొచ్చు. ప్రకృతి సిద్ధమైన మొక్కలనూ పెంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications
