For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇల్లు పాతబడినట్టు కనిపిస్తోందా...?

|

Home Decor
సాధారణంగా ప్రతి ఒక స్త్రీ తమ ఇల్లు అందంగా అలంకరించుకోవాలని, తమ ఇల్లు అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. ముఖ్యంగా హాలు, పడక గది, వంటగది, స్నానాల గది వరకూ అన్ని కొత్తగా అలంకరించుకోవాలని పడరాని పాట్లు పడుతుంటారు. అటువంటప్పుడు ఇంట్లో ఉన్న పాతవస్తుసామాగ్రిని స్థాన మార్పిడి చేసినట్లైతే ఆ ఇంటికి సరికొత్త అందాలను తీసుకురావచ్చు.

ఇంట్లోని హాల్‌లోగల దివాను, సోఫాల స్థలం మార్చితే అక్కడ ఓ కొత్త మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సోఫా, కుర్చీలను కొంచెం దూరంగా జరిపి వాటిని మనకు నచ్చినట్లు వేసి, మధ్యలో అందమయిన కార్పెట్‌ వేస్తే ఆ అందమే వేరు. ముఖ్యంగా ఎర్ర కార్పెట్‌ అయితే వచ్చే అతిధులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో కూర్చునే దిశ కూడా అప్పుడప్పుడూ మార్చుతూ ఉంటే ఇల్లు ఎప్పుడూ కొత్తదనంతో కళకళలాడుతుంది.

కర్టెన్లు, టేబుల్‌ క్లాత్‌లు వంటి వాటిపై రంగు, రంగులతో చేసే అలంకరణ కూడా మనసుకు హత్తుకొని కొత్త అందాలకు దారి తీస్తుంది. దీనికై తళుకు బెళుకులు గల రంగులను ఉపయోగిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు రంగుల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అయితే భార్యా భర్తలకు మాత్రం పరిమితమయ్యే బెడ్‌ రూం రంగు మాత్రం లైట్‌ కలర్‌ లో ఉంటేనే బాగుంటుంది. సంవత్సరానికొక సారి ఈ రంగులు మార్చుకుంటే బాగుంటుంది.

ఒక గదిలోని తెరను వేరే గదికి, మరొక గది తెరను వేరొక గదికి మార్చడం ద్వారా కొత్త దనాన్ని ఆస్వాదించవచ్చు. ఇంటి లోపలి గుమ్మాలు, కిటికీలకు ఉన్న తెరలను మార్చుతూ ఉండాలి. దీనికోసం ప్రతిసారి క్రొత్తవి కొనవలసిన అవసరం లేదు. ఇక గోడల మీద వున్న చిత్రాలు, వాల్‌ హేంగింగ్స్‌ వంటి వాటి స్థానాలను కూడా అప్పుడప్పుడూ మార్చుకోవడం ద్వారా ఎప్పుడూ కొత్తదనాన్ని ఆస్వాదించవచ్చు.

English summary

How to keep your home clean and tidy for good look | మీ ఇల్లు పాతబడినట్టు కనిపిస్తోందా...?

A home is the biggest investment we’re likely to make, so what’s wrong with taking good care of it? Not a thing, according to Anthea Turner who hosts BBC’s Perfect Housewife.
Story first published:Wednesday, January 11, 2012, 17:49 [IST]
Desktop Bottom Promotion