For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిరుమిట్లు గొలిపే ఇంటి కోసం జెల్ క్యాండిల్స్...?

|

ఒక్కో రుతువుకు తగ్గట్టు ఇంటిని అలంకరించుకోవచ్చు. ఇంట్లో క్యాండిల్స్ డెకరేషన్ చేస్తే చూడటానికి ఓ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. క్యాండిల్స్ మరికొంత అలంకరణ జోడించి వేలిగించి అక్కడక్కడా అమర్చినట్లైతే ఆ ఆనందంమే వేరు...మార్కెట్లో వివిధ రకాల కొవ్వొత్తులు లభ్యమ వుతున్నాయి. మీ సాయంత్రాలకు భోజనాల సమయానికి శోభనిచ్చే పరిమళభరితమైన రంగురంగుల కొవ్వొత్తులు వెలిగించండి. ఒక ప్రత్యేకమైన అలంకరణగా కనిపించేట్లు అద్దాల ముందు, మొక్కల గుంపుల వద్దనో వెలిగించండి. బాత్రూ ములకు కూడా ప్రాణముట్టిపడే విధమైన అలంకరణలను చేయండి. మైనపు కొవ్వత్తులను ఎక్కువ సేపు వెలిగేలా చేస్తాయి. మామూలు మైనపు కొవ్వొత్తులకంటే జెల్లీ కొవ్వొత్తులు రకరకాల రంగుల్లో ఎక్కువ ఆకర్షితులను చేస్తాయి. ఈ జెల్లీ క్యాండిల్స్ మినిరల్ ఆయిల్(ఖనిజంతో తయారైనటువుంటి నూనెలు) మరియు ప్లాస్టిక్స్ పాలిమర్స్ తో తయారు చేయబడి ఉంటాయి. ఈ జెల్లి క్యాండిల్స్ ఎక్కువ సేపు వెలుగే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి వివిధ రంగులు, ఎక్కువ సేపు వేలుగేటటువంటి, మనస్సుకు ప్రశాంతత కలిగించేటటువంటి జెల్లీ క్యాండిల్స్(కలర్ ఫుల్) ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంటి వద్దే జెల్లీ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో సులభమైన చిట్కాలతో మీకోసం....


జెల్ క్యాండిల్స్ కు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:
గ్లాస్ లేదా ఏదైన వేడికి కరిగనటువంటి కంటైనర్(డబ్బా)
జెల్ వాక్స్(మైనపు జెల్)
జింక్ విక్స్
గ్లూ(జిగురు)
ఫ్రాగ్రెన్స్ ఆయిల్(సువాసనలిచ్చేనూనెలు)
జెల్ కు అనుకూలమైటువంటి రంగురంగుల లిక్విడ్
ఎంబెడ్స్(త్వరగా కరిగనివి)

ఇవన్నీ దొరకనట్లైతే మార్కెట్లో కొవ్వొత్తులకు తయారీకి సంబంధిచిన ఉత్పత్తులు దొరుకుతాయి. వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా జెల్ క్యాండిల్ కిట్ కొనుగోలు చేసుకోవచ్చు.
తయారు చేసే పద్దతి
1. జెల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్టైన్ లెస్ స్టీల్ కంటైనర్ లో వేసి తక్కువ మంటమీద వేడి చేయాలి.
2. జెల్ బాగే కరిగి సున్నితంగా తయారయ్యేంత వరకూ రెండొంద డిగ్రీ ఫారెహీట్ లో పెట్టి బాగా వేడి చేయాలి.
3. ఇప్పుడు హాట్ జెల్ వాక్స్ కి లిక్విడ్ కలర్, 1/4చెంచా ఆరోమా(సువాసనలిచ్చే ఆయిల్ )కలపాలి.
4. ఈ జెల్ ను గాజు కంటైనర్ లో విక్ టాబ్ ను వేడి చేసి అడుగు బాగాన అతికించాలి.
5. జెల్ కంటైనర్ లో పోయడానికి ముందే ఎంబెడ్ ను, జెల్లో పూర్తిగా ముంచి, అదే గాజు కంటైనర్ లో అడుగుబాగాన అమర్చుకోవచ్చు.
6. గాజు కంటైనర్ లో జెల్ పోయడంతో అందులో బుడగలు కనిపిస్తుంటాయి. వాటిని పోగొట్టడానికి మరికొంత సేపు 150-160ఫారెన్ హీట్ లో ఆ కంటైనర్ ను అలాగే వేడి చేయాలి.
7. ఇప్పుడు విక్(ఒకలాంటి మైనంతో తయారు చేసి త్వరగా కరిగిపోనటువంటి దారం లాంటిది)పైకి లాగి గ్లాస్ మద్యన నిలుచుండేటట్లు చేయాలి. ఈ జెల్ 5-8గంటల పాటు బాగా చల్లారనివ్వాలి. తర్వాత విక్ ను మనకు కావలసినంత కట్ చేసుకోవాలి. అంతే కలర్ ఫుల్ జెల్ క్యాండిల్ రెడీ...

జాగ్రత్తలు:
జెల్ వాక్స్ తయారు చేయడానికి 230డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత దాటకుండా చూసుకోవాలి. జెల్ వ్యాక్స్ కాలిపోయే ప్రమాదం ఉంది. జెల్ హీట్ అయ్యే సమయంలో థర్మామీటర్ సహాయంతో టెపరేచర్ ను గమనించవచ్చు.
2. కొద్దిగా లిక్విడ్ కలర్ ఉపయోగించడం వల్ల మరింత ఆకర్షణగా తయారవుతుంది.
3. జెల్ తయారైన వెంటనే, వేడిగా ఉన్నప్పుడే గాజు కంటైనర్ లో నింపుకోవాలి. అప్పుడు అదే కరెక్ట్ ఆకారం కలిగి ఉంటుంది.

ఈ కలర్ ఫుల్ జెల్ క్యాండిల్ ను ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. డైనింగ్ టేబుల్, సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్, హాల్లో, డ్రాయింగ్ రూమ్ లో అమర్చుకోచ్చు. ఇటువంటివి ఎక్కువ ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోలు చేయడం కంటే ఇంట్లో తయారు చేసుకొని, ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.

English summary

How To Make Gel Candles? | ఇంటి అలంకరణలో ఆకర్షించే జెల్ క్యాండిల్స్..

Decorating home with candles is an excellent idea to add some extra zing to your home decor. They burn longer than the wax candles. The composition of jelly candles is of mineral oil and plastic polymer. This makes it a long lasting candle. You can easily make colourful gel candles (jelly candles) at home. Here are a few easy steps to help you make gel candles at home.
Story first published: Monday, May 21, 2012, 12:24 [IST]
Desktop Bottom Promotion