Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మంచి సువాసనలతో పడక గది స్వర్గ దామం....

అందుకే చాలా మంది తమ ఇండ్లలో గదులను అందంగా తీర్చిదిద్దుంతుంటారు. అలాగే బెడ్ రూంకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అది మీ స్వర్గధామం. దానిని ఎల్లప్పుడు సువాసనలతో వెదజల్లేలా చేయాలంటే నిమ్మ నూనెలో రెండు చుక్కల వేపనూనె కలిపి రాత్రిపూట దీపం వెలిగించండి. దీంతో మీ బెడ్ రూం సువానలతో నిండి పోతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేస్తే ఇంట్లో దోమలు కూడా దరిచేరవు.
బెడ్ రూంలో వేసే లైట్స్ పైన రూం ఫ్రెషనర్ లేదా ఏదేని వంటికి ఉపయోగించే స్రేలను బల్బ్ మీద స్ప్రే చేసి లైట్ ఆన్ చేసినట్లైతే ఇల్లు సువాసనలతో నిండిపోతుంది. సాంత్రంలో దేవుడి దగ్గర దీపం అగరబత్తులు వెలిగిస్తాం. అలాగే బెడ్ రూంలో కూడా ఒకే రకం కాకుండా రెండు మూడు రకాల అగరవత్తు వెలిగిస్తే పడుకొనే సమయాన్నికి రూం అంతా ఆహ్లాదంగా సుగంద పరిమళాలతో మనస్సుకు స్వాంతన లభిస్తుంది
పడకగది అలంకరణలో ఇష్టాయిష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటంకంటే మానసిక ఉపశమనానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలి. వేసవిలో పడకగది విశాలంగా ఉండేటట్టు చూసుకోవాలి. మంచం కొద్దిగా పెద్దగా ఉండాలి. వేసవిలో మల్లె పువ్వులు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి...ఫ్రెష్ పువ్వులను అక్కడక్కడ ప్లోటింగ్ ఫ్లవర్స్ లా అలంకరించుకోవచ్చు.
పడకగదిలో విద్యుత్ పరికరాలను వీలైనంత దూరంలో పెట్టాలి. ఎందుకంటే వాటి నుంచి విడుదలయ్యే విద్యుత్ తరంగాలు ప్రభావం పడుతుంది. అలాగే పడకగదిలో భార్యాభర్తల ఫోటోతోపాటు బాతుల జంట బొమ్మలను కలిపి పెట్టుకుంటే మంచిది. పడకగదిలో ఆక్వేరియం వంటి అధిక నీటి నిలువ వస్తువులు ఉండకూడదు. పడకగదిలోని వస్తువులను శుభ్రంగా సర్దుకోవాలి. పడక గదిలో గోడల రంగులు, తలుపులకు వేసే కర్టెన్లు, కిటికీలకు వేసే కర్టెన్లు లాంటివి కంటికి భారంగా కనిపించకుండా.. గదిలోకి వెళ్లగానే మనసుకు ఉపశమనం కలిగించేలా అమర్చుకోవాలి.



Click it and Unblock the Notifications