For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ హాట్ సమ్మర్ లోనూ ఇల్లంతా కూల్..కూల్..

|

Seasonal Decorating Ideas for Summer House...
ఏ సీజన్ లో మనం ఎలా ఉన్నా సరిపోతుంది. వేసవిలో పిల్లలు..కొందరు పెద్దలూ ఇంట్లోనే ఉంటారు. పైగా బంధువులు, స్నేహితులు అప్పుడే మన ఇళ్లకు వస్తుంటారు. అప్పటికే మన ఇల్లు చిందరవందరగా తయారై ఉంటుంది. ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండవు. అలా అని వచ్చిన వారిన కూర్చోబెట్టి అప్పటికప్పుడు సర్థుకోవడానికి టైమ్ సరిపోదు. అలాంటి సమయంలో కొద్దిపాటి చిన్న చిన్న మార్పులతో ఇంటిని సర్వాంగ సుందరంగా మార్చేయవచ్చు..

సాధారణంగా అన్ని గదుల్లో మనకు కర్టెన్లు ఉంటాయి. ఒక వేళ లేకున్నా కర్టెన్లను ఏర్పాటు చేసుకోవాలి. అంతే ముందు గదిలో ఏర్పాటు చేసిన కర్టెన్లపై ఆడవాళ్లు అప్పుడప్పుడు వాడే బెనారస్ చీరలు, మెరిసే చున్నీలను కర్టెన్లపై వేస్తే రెడీమేడ్ డెకరేషన్ వాటికి అదనపు అలంకరణ ఇస్తుంది..అలాగే గది గోడలపై ఉన్న ఫొటోలను అన్నీ తీసేసి వాటి స్థానంలో అందమైన దృశ్యాలతో ఉన్న సీనరీలను హ్యాంగ్ చేసి చూడండి. గోడలకు పగుళ్లు, పెచ్చులు ఊడినచోట మంచి వాల్ పోస్టర్లను అతికిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. పైగా చూసేవారికి అందంగా కూడా కనిపిస్తుంది. అందరూ కూర్చునే ముందు గదిలో సాధ్యమైనంత వరకూ ఎక్కువ వస్తువులను లేకుండా చూడాలి. గది ఉన్నంతలో విశాలంగా కనిపిస్తుంది. అంతేగాక హాల్లోనే మంచాలు, సోఫాలు, కుర్చీలు వేస్తే ఎక్కువ మంది అతిధులు వస్తే వాళ్లు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తుంది.

వచ్చిన అతిథులు కూర్చోవడానికి తగినన్ని కుర్చీలు లేవని బాధపడకండి. మొత్తం కుర్చీలన్నీ తీసేసి వేరే గదిలో పెట్టేసి ముందు గదిలో పరుపు వేసి దాపిపై దుప్పటి వేస్తే వచ్చిన వారంతా కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. చూడటానికి కూడా ఇల్లు సువిశాలంగా కనిపిస్తుంది. ఒక వేళ పరుపు లేకున్నా చాపగానీ, కార్పెట్‌ గానీ వేసి దాపిపై డబుల్‌ షీట్‌ క్లాత్‌ ను నీట్‌గా వేసి అతిధులను దానిపై కూర్చోబెట్టి మాట్లాడవచ్చు.

తర్వాత వచ్చిన అతిథులకు బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆల్ బమ్ ను ఒకే చోట ఉండేలా చూసుకోవాలి. వచ్చిన అతిధులకు మీ ఫ్యామిలీ ఆల్బమ్స్‌ను కట్టలు కట్టలుగా పడేసి చూపించకండి. అన్నీ ఒకే ఆల్బమ్‌ లో ఉండేలా పెద్ద ఆల్బమ్‌ లో ఉంచినట్లయితే వచ్చిన వారు ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకరు చూస్తారు. ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలని చిన్నప్పటి నుంచే వారికి తెలియజెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్‌ లో మీ ఇల్లు చూసేందుకు బాగుండమే కాక ఆ ఇంటి ఇల్లాలికి వచ్చిన అతిధులు కితాబు కూడా ఇచ్చి మరీ వెళతారు.

English summary

Seasonal Decorating Ideas for Summer House... | వేసవి వచ్చేసింది..చుట్టాలొస్తున్నారు జాగ్రత్త...

The holidays are about celebrating family, friends and tradition, not breaking the bank on decorations that will only last a week or two. From charming reuse ideas to inexpensive modern looks, find the best budget holiday and seasonal decorating idea.
Story first published:Wednesday, February 29, 2012, 13:15 [IST]
Desktop Bottom Promotion