For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగది ఎలా అలంకరిస్తే సంతోషం.. ప్రశాంతత ఏర్పడుతుంది...!?

|

మనిషి తన నిత్య జీవితంలో ఇంటిలో గడుపు కొన్ని గంటలలో ఎక్కువ సమయం పడక గదిలో గడుపుతాడు. అందుకని పడకగదిని సుందరంగా, విశాలంగా, వాస్తు పరంగా సరైన స్థానంలో ఏర్పర చుకున్న మంచి విశ్రాంతి లభించి సముచిత నిర్ణయాలు తీసుకొని ఇంటి పెద్దగా కుటుంబాన్ని సరైన పంథాలో నడపుటయేగాక, ఆరోగ్యవంతునిగా జీవించగలడు. అందుచేత పడక గదులు సరయిన స్థానంలో ఏర్పరచుకొనవలెను. వాస్తును ఎక్కువగా నమ్మే వారుంటే కనుక పడక గది అలంకరణలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. పడక గదిలో కొన్ని రకలైనటువంటి డెకరేటింగ్ వస్తువులను వాస్తు ప్రకారం డెకరోట్ చేయడం వల్ల మీ పార్టనర్స్ మధ్య సంబంధబాంధవ్యాలు దృడంగా ఉంటాయి.

మీర కనుక వాస్తున్న నమ్మే వారైతే బెడ్ డెకరేషన్ ఎలా చేయాలి. దాంతో సంతోషంగా ఎలా గడుపుతారనే.. ఈ చిట్కాలు పాటించి చూడండి.

1. వాస్తు శాస్త్రం ప్రకారం, పడక గది చతురస్రాకారం లేదా ధీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. ఇలా ఉండటం వల్ల దాంపత్య జీవితంలో అధికంగా సంతోషం, ప్రశాంతత ఏర్పడుతుంది.
2. పడకగది తలుపులు 90డిగ్రీ యాంగిల్ లో తెరచి ఉండేలా ఉంచాలి. వాస్తు ప్రకారం పడక గది తలుపులు పూర్తిగా తెరచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మంచి జరిగే బదులు చెడు జరుగుతుంది. కాబట్టి బెడ్ రూమ్ డోర్స్ ఎప్పుడు కానీ పూర్తిగా తెరచి ఉంచకూడదు.
3. పడకగదిలోని ప్రవేశించగానే ప్రశాంతతను నెలకొల్పే విధంగా ఉండాలి. అందుకు మీకు ఇష్టమైన ఫోటోను లేదా మీ దంపతులిద్దరూ కలిసున్న ఫోటో ఫ్రేమ్ లను, లేదా మంచి పెయింటింగ్ లేదా ఫ్లవర్ వాజ్ లను ఉంచడం వల్ల ఆహ్లాదాన్ని ఇస్తుంది. మూడ్ ను మార్చి సంతోషంగా ఉండేలా చేస్తుంది.
4. పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిష్ అక్వేరియం, లేదా మొక్కలు, లేదా దేవుని విగ్రహాలు ఉంచరాదు.
5. పడకగదికి సున్నితమైన లేత బ్లూ, లేత గ్రీన్, మరియు హాఫ్ వైట్ కలర్స్ బాగా సూట్ అవుతాయి. వీటితో గోడలకు పెయింట్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. సాఫ్ట్ లైట్ కలర్స్, లైట్ పింక్, బ్లూ,రోజ్, గ్రీన్ మరియు ఎల్లో లేదా వైట్ కలర్ వంటి కలర్స్ కూడా మీ పడక గదికి అందాన్ని మాత్రమే కాదు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వాస్తుప్రకారం ఇది చాలా మంచిది.
6. పడకగదిలో ఉపయోగించి డిమ్ లైట్స్ మీకు నచ్చేవిధంగా ఎంపిక చేసుకోవాలి. అవి ముఖ్యంగా అడ్జెస్ట్ చేసుకొనే విధంగా ఉంటే మీకు కావలసినంత వెలుగును నింపుతాయి.
7. వాస్తును పాటించే వారు చాలా మంది పడక గదిలో అద్దం ఉండకూడదంటుంటారు. పడకగదిలో అద్దం ఉండటం వల్ల వ్యక్తుల మధ్య మనస్పర్థాలు, గొడవలకు దారితీస్తుందని అంటారు.
8. ఒక వేళ తప్పనిసరిగా పడకగదిలో అద్దం పెట్టుకోవాలనుకొన్నప్పడు ఖచ్చితంగా వాస్తును పాటించడం మంచిది. మీరు పడుకొనే బెడ్ కు ఎదురుగా కాకుండా ఓ ప్రక్కగా అమర్చుకోవాలి. రాత్రి సమయంలో పడుకొనే ముందు తప్పకుండా ఆ అద్దంను ఓ వస్త్రంతో కప్పి ఉంచాలి.
9. పడకగదిలో టీవి లేకుండా చూసుకోవాలి. దాంతో టైమ్ కు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. మంచి నిద్రను పొందుతారు. అయితే వాస్తు ప్రకారం, ఏవైనా ఎలక్ట్రిక్ పరికరాలు పెట్టుకోవాలనుకొన్నప్పుడు, పడకగది ఆగ్నేయంలో ఉంచుకోవచ్చు.
10. మరొక ముఖ్యమైన వాస్తు చిట్కాల ఏంటంటే పడకగది డెకొరేషన్ లో వుడ్ తో తయారు చేసి బెడ్ ను అమర్చుకొంటే మంచిది. బెడ్ ను నైరుతిలో దక్షిణం మరియు పశ్చిమ దిశలో ఉండేలా చూసుకోవాలి. ఉడ్ తో తయారు చేసినటువంటి మంచాలలోపలి భాగంలో వేరే ఇతర సామాగ్రిని నింపకుండా చూసుకోవాలి. ఒక వేళ బాక్స్ బెడ్స్ ఉన్నట్లైతే ఖచ్చితంగా అవి చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా, క్లీన్ గా ఉండేవిధంగా చూసుకోవాలి.

English summary

Vastu tips for decorating the Bedroom.. | వాస్తు ప్రకారం పడకగది అలంకరణ.....!

Vastu Shastra is an Indian science that brings harmony, success, love and peace in the life of a person. Vastu believers always do everything in the shastric way. Be it home decor ideas or placement of showpieces or decor items, every big to minute details of the house is done according to vastu tips. It is believed that vastu also helps build a better relationship with your partner.