For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటి అలంకరణలో మీ ఫోటో కూడా అదణపు ఆకర్షణే...!

|
ఇంటి అలంకరణలో ఎన్నో కళాకతులు ఉన్నాయి. ఒక్క ఫర్నీచర్, ఫ్లవర్ వాజుల, కర్టెన్లు, కుషన్లే, మొక్కలు, లైట్స్, ఫిష్ టాంక్, టీవీవే కాదు. అలంకరణలో ఫోటోలు కూడా ప్రాధాన్యతను కలిగిఉంటాయి. ఫ్లో డెకరేషన్ లో తీసుకొన్నంత శ్రద్ద కొంచెం వాల్ డెకరషన్ పై చూపినట్లైతే..ఆ గది మరింత ఆకర్షనీయంగా.. అందంగా ఇతరులను ఆకట్టుకొనే విధంగా ఉంటాయి. ఇంటి డెకరేషన్ అంటే దీపాలు, పెయింటింగ్ కే పరిమితం కాకుండా ఫోటోల అలంకరణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఫోటోలు కూడా కుటుంబ సభ్యులవై ఉండాలి. ఫోటోలను వివిధ యాంగిల్స్ లో చిత్రీకరించి గోడకు తగిలించినట్లైతే ఇంటి గోడల అలంకరణను చూసి ఆ ఇంట్లోని మనుషుల అభిరుచుల్ని అంచనా వేస్తారు.

గది అందం మనం తగిలించే ఫోటోలు, పటాల మీదే ఆధారపడి ఉంటుంది. కళాభిరుచి ఉన్న వాళ్ళు గదుల్ని ప్రత్యేక శ్రద్దతో అలంకరిస్తారు. తెలీక కొందరు, తెలిసినా బద్దకంతో పట్టించుకోని వారు కొందరు ఉంటారు. అలాకాక తీరిక సమయాన్ని వినియోగించుకుని ఏ మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా మన ఇల్లు మనకే నిత్య నూతనంగా కనిపిస్తుంది. అందుకు కొన్ని ఐడియాస్ మీకోసం...గది నిడివిని బట్టి చిత్రాల్ని ఎన్నుకుంటే మంచిది. చిన్నగదిలో పెద్ద ఫోటోలు, పెద్ద గదిలో చిన్న ఫోటోలు వేలాడ దీస్తే బావుండదు. గది గోడల రంగుకి దగ్గరగా సరిపోయే చిత్రాలను అలంకరించాలి గానీ, దేని దారి దానిదిగా ఉండకూడదు. అన్ని గడుదులూ ఒకేలా ఉండవు. గదికి మనం కేటాయించిన ప్రత్యేకతను బట్టి చిత్ర పటాలులను అలంకరిస్తే బాగుంటుంది.

కుటుంబ సభ్యుల ఫోటోలు: లివింగ్ రూమ్ లో గోడను అలంకరించుకోవడానికి ఇది ఒక గొప్ప ఆలోచన. కుటుంబ సభ్యుల ఫోటోలను తగించినట్లైతే వాటిని చూడగాని మనస్పు రిఫ్రెష్ అవ్వడంమే కాకుండా, తీపి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకొనేలా చేస్తాయి. ఈ ఫోటోలను ఫోటోలకు తగిన విధంగా డిఫరెంట్ ఫ్రేమ్స్, డిఫరెంట్ డిజైన్లలో తయారు చేయించి ను సెట్ చేసుకొన్నట్లైతే ఆ గదితికి మరింత అందం వస్తుంది. పాత ఫోటోలను కూడా చక్కటి ఫ్రేమ్ అమర్చి గోడలకు తగిలించినట్లైతే ఆ తీపి గుర్తులు ఎప్పుడూ కళ్ళ ముందు కనబడేటట్లు చేస్తూ మనస్సును ఆనందపరుస్తాయి.

ఫోటో షూట్: మీరు స్వయంగా ఫోటో షూట్ లో నిష్ణాతులైతే, ఫోటో షూట్ కూ మీరు చక్కగా కుదిరేట్లు ఉంటే మీ ఫోటోలనే ఫోటో షూట్ చేసి గోడకు అందంగా అలంకరించుకోవచ్చు. ఫోటో షూట్ అలంకరించిన ప్రదేశంలో లైట్స్ అమర్చుకొన్నట్లైతే ఫోటో మరింత హైలైట్ గా కనిపిస్తాయి. చూడటానికి మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. ఇలాంటి ఫోటోటను సోఫా వెనుక గోడకూ లేదా హాల్లో అమర్చుకోవచ్చు. ఇలా ఫోటో షూట్ పెట్టేప్రదేశంలో ఎక్కువ ఇతా వాల్ పోస్టులు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ ఫోటో షూట్ కి మరింత అందంగా వస్తుంది.

ఎక్స్ ప్లోర్: సహజంగా పిల్లలకు జంతువులూ, పక్షలు, కార్టూన్స్ లాంటివి అంటే చాలా ఇష్టం. అందుకే పిల్లల అభిరుచికి తగినట్లుగా వాటిని వారి గదులను అలంకరిస్తే చిన్నారి ఊహాల చక్కని రూపకల్పన ఇచ్సినట్టవుతుంది. ఫోటోలు గాని కాలెండర్లు గానీ ఏవైనా గది పై కప్పుకి తగిలేలా పెట్టకుండా సముచిత స్థానంలో ఉంచాలి. మీ ఫోటో చిత్రాలను గోడపై పూర్తిగా కనబడేవిధంగా అమర్చుకోవాలి. అందులో ముఖ్యంగా వన్యమృగ, ప్రకృతి, థీమ్ లేదా భావన తదితర ఛాయాచిత్రాలను హాల్లో అలంకరించుకోవచ్చు. ఇలాంటి చిత్రాలు మీ హాల్ ను చాలా ప్రత్యేకంగా కనబరుస్తాయి.

English summary

Wall Decoration With Photos..! | మీ అభిరుచిని తెలిపే ఫోటో అలంకరణ...!

There are many ideas to decorate your living room. You can fill the space with furniture, carpets, plants, tables, lamps, fish tank, television and chandeliers. When it comes to wall decorations, you start thinking if paintings with spot lights will look good or family photos will be better! To decorate your living room walls with photos, here are simple ideas. Take a look.
Story first published: Wednesday, May 16, 2012, 13:27 [IST]