For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగది విశాలంగా..కాంతివంతంగా కనిపించాలంటే 5సింపుల్ టిప్స్

|

బాహ్య ప్రపంచంతో విడిపోయిన, పూర్తిగా తనదైన లోకమే పడకగది. మనసు సేదతీరడానికి, వినోదభరితంగా ఉండడానికి పడక గదిని మించిన చోటు మరొకటి లేదు. ప్రత్యేకించి వ్యక్తిగతమైన ఆశలన్నీ నెరవేరే ఒక అందమైన ప్రదేశం. అలాంటి ప్రదేశం అందంగా విశాలంగా లేకపోతే , ఆ కలలన్నీ కల్లగానే మిగిలిపోతాయంటారు కొందరు. పడకగది మరీ చిన్నదిగా ఉంటే, అసౌకర్యంగా ఉంటుంది. పడకగది యొక్క ఫర్నీచర్ మరియు డిజైన్ కొంచెం కష్టం అవుతుంది. అటువంటప్పుడు చిన్న పడకగదిలో ఫర్నీచర్ ను అమర్చడం కొంచెం కష్టం అవుతుంది. అలా చిన్నగా ఉండే పడకగది విశాలంగా మరియు సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి బోల్డ్ స్కై కొన్ని ఉపాయాలను అందిస్తోంది.

పడకగది చిన్నదైనా అక్కడ వస్తువులను, దుస్తులను, పుస్తకాలు, న్యూస్ పేపర్లు వంటి వస్తువులతో పడగదిని నింపేస్తుంటారు. అలాకాకుండా చిన్నగా ఉండే పడకగదిలో ఇలాంటి వాటికి చోటువ్వకుండా ఉండాలి. మరీ ముఖ్కంగా చిన్నగదిలో ఫర్నీచర్ ను అమర్చుకోవాలనుకున్నప్పుడు, సిట్టింగ్ ఫర్నీచర్ ను పూర్తిగా గోడ దగ్గరకు ఆనించి పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల మీరు నడవడానికి అవసరమైనంత స్థలం మీకు అందుబాటులో ఉంటుంది.

ఇలాంటి చిన్న పడకగదికోసం కొన్ని డెకొరేషన్ ఐడియాస్ మీకోసం ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాం. చిన్నగా ఉండే పడగది యొక్క గోడలు లైట్ షుడ్స్ కలిగి పేయింట్స్ ను ఎంపిక చేసుకోవాలి. దాని ివల్ల పడకగది విశాలంగా కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. చిన్నగా ఉండే పడకగది కోసం కొన్ని సదుపాయలను అమర్చుకోవడం వల్ల చిన్న గదైనా విశాలంగా, కాంతివంతంగా కనబడుటకు సహాయపడుతుంది. మరి పడగది డెకొరేషన్ కొరకు కొన్ని డిజైనింగ్ ఐడియాస్ ఈ క్రింది విధంగా...

5 Simple Ideas To Design Small Bedroom

వాల్ పెయింట్స్ : మీరు ఎంపిక చేసుకొనే పెయింట్ షేడ్స్ రాత్రుల్లో మీకు ప్రశాంతతను మరియు రిఫ్రెషెనెస్ ను చేకూర్చాలి. పడగదికి తెలుపు, క్రీమ్ కలర్స్ చాలా ఉత్తమంగా ఉంటాయి. పడగదికి ఎప్పుడు కానీ డార్క్ కలర్స్ వేయించుకోకూడదు. అవి ఆ గదిని మరింత దగ్గరగా డార్క్ గా చూపెడుతాయి.

లైటింగ్ : మీ బెడ్ కు దగ్గరగా లైట్ ను అమర్చుకోవాలి. అలాగే పడకగదిలో లైటింగ్ ఇతర వస్తువుల మీద పడి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా అమర్చుకోకండి. ఫ్లోర్ ల్యాంప్ లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపిక చేసుకోకండి ఎందుకంటే ఇవి, ఎక్కువ స్థలంను ఆక్రమించేస్తాయి. వీటికి బదులుగా వాల్ ల్యాంప్స్ ను ఎంపిక చేసుకోవాలి. పడగది ఉపాయాల్లో ఇది ఒక ఉత్తమ ఉపాయం.

బెడ్: బెడ్ రూమ్ సైజ్ కు కరెక్ట్ గా ఫిట్ గా అమరేలా బెడ్ ను ఎంపిక చేసుకోవాలి. అలాగే మల్టిపుల్ బెడ్స్ వల్ల స్టోరేజ్ స్పేస్ మిగులుతుంది. అందువల్ల మీ పడకగదిలో ఎక్కువ స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది. ఇంకా మీరు ఫ్లోడ్ అయ్యేలా ఉండే బెడ్స్ ను కూడా ఎంపిక చేసుకోవాలి. చిన్నగా ఉండే పడకగదులకు ఇది ఒక ఉత్తమ ఉపాయం.

క్యాబినెట్ : పడగదిలోనే వస్తువులను అమర్చుకోవడానికి హైలెవల్ క్యాబినెట్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ క్యాబినెట్ లో దుస్తులు మరియు ఇతర వస్తువులను సర్ధుకొనేందుకు అవసరం అయ్యేంత స్థలం ఉంటుంది. స్మాల్ బెడ్ రూమ్ పర్నీచర్ కు ఇది ఒక సింపుల్ ట్రిక్ .

వాల్స్: పడకగది చిన్నగాఉన్నప్పుడు, రీసెస్డ్ సెల్ఫ్స్ ను గోడలోనే అమర్చుకోవడం వల్ల డెకరేటివ్ ఐటమ్స్ ను క్లీన్ గా జోడించుకోవచ్చు. అందువల్ల మీరు అదనపు స్థలంను సేవ్ చేయవచ్చు. స్మాల్ బెడ్ రూమ్ డిజైన్ కు ఇది ఒక ముఖ్యమైన ఉపాయం.

English summary

5 Simple Ideas To Design Small Bedroom

Bedroom is the coziest place in a house regardless of its size. Designing and furnishing a small bedroom can be a challenge. So, it becomes important to put a bit of thinking while placing furniture in a small bedroom. Boldsky presents some small bedroom ideas that will help you make it look spacious and comfortable.
Story first published: Monday, December 15, 2014, 17:27 [IST]
Desktop Bottom Promotion