For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటికి సరిపోయే మంచి ఫర్నీచర్ ను ఎంపిక చేసుకోవడం ఎలా

By Super
|

మంచి సైజ్ వున్న ఫర్నిచర్ ఎంచుకోండి. ఓ కుర్చీలో సరిపడా చోటు వుందో లేదో తెలియాలంటే అందులో కూర్చుని చూడండి.
మీకు నచ్చిన కుర్చీ పైకి తీసి ఎలాంటి అనుభూతి కలుగుతోందో చూడండి. మంచి నాణ్యత గల బల్ల, సోఫా లేదా కుర్చీల్లో లాంటి వాటిలో స్ప్రింగులు, ఫ్రేము, కుషన్ లాంటివి ఉండడం వల్ల సాధారణ నాణ్యత వున్న వాటి కంటే బరువుగా వుంటాయి.

ఫినిషింగ్ ఎలా వుందో చూడండి

ఆ వస్తువుకు ఘనమైన, లోతైన ఫినిష్ వుండాలి, లోపాలు సరిదిద్దడం కోసం వేసిన పెయింట్ వుండకూడదు. లోపలివి కనపడకుండా ఉండేలాంటి ఫినిష్ అయితే చెక్కలో చేవ తెలుస్తుంది. అపారదర్శకమైన ఫినిష్ వల్ల పెయింట్ సమంగా పరుచుకుని బుడగలు, బ్రష్ స్ట్రోక్ ల లాంటివి కనపడవు. పేము కుర్చీల లాంటివి అయితే వాటికి చీలికల్లాంటివి వుండవు, పైగా కుర్చీ అల్లకం అంతా సమానంగా వుంటుంది.

కుషన్లు కూడా పట్టించుకోండి

మంచి కుషన్ చక్కగా, చదరంగా ఉండేవి అయితే మొనలు కోన దేరి వుంటాయి, గుండ్రంగా వుండే వాటికి వంపులు బాగుంటాయి, బటన్స్ తో వస్తాయి, వాటి మీద వివరాలు చక్కగా దృడంగా వుంటాయి, పైగా అటుకులు కనపడవు. లావాటి వంపులు కూడా నాణ్యత గల కుషన్ లలో ఒక కీలకమైన విషయం. వత్తుకు పోయినట్లు వుండే కుషన్ లలో తగినంత స్టఫ్ఫింగ్ లేనట్లు గుర్తు. ఈకలు, దూది ఊడిపోయే కుషన్ సరిగ్గా కుట్ట లేదని గుర్తు.

How to choose the best furniture

ఆ పీస్ ని అటూ ఇటూ తిప్పి చూడండి

ఫర్నిచర్ ని పైకి లేపండి లేదా దాని క్రింద చూసి దాని తయారీలో నాణ్యత ఎంతో తెలుసుకోండి. సరిగ్గా కుట్టని పాడింగ్ లేదా వదులుగా వుండే స్క్రూలు, అసమంగా వుండే సప్పోర్ట్, రక్షణ లేని స్ప్రింగ్ లు వున్నాయేమో చూడ౦డి. కేవలం దుకాణంలో ఒక వస్తువు చూడగానే దాని నాణ్యత అంతా మీకు తెలిసిపోతుందని కాదు, కానీ అలా చేస్తే ఆ వస్తువు ఎంత జాగ్రత్తగా తయారు చేసారో తెలుస్తుంది.

వివరాలను పరీక్షగా చూడండి.

మంచి శా౦డింగ్, ఫినిషింగ్, చక్కటి వెల్డింగ్, బారుగా తీసిన మడతలు ఒక నాణ్యమైన ఫర్నిచర్ కు గీటురాళ్ళు, ఇవే లోపాలను కూడా కప్పిపుచ్చుతాయి. నట్లు, స్క్రూలు, బోల్ట్ లు ఫర్నిచర్ కి మాచ్ అయ్యే రంగులో పెయింట్ చేయబడి వుండాలి.

స్థలాన్ని బట్టి ప్లాన్ చేయండి.

మంచి నాణ్యత గల ఫర్నిచర్ వెతగ్గానే సరిపోదు. మీరు దాన్ని ఇంట్లో ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, దాని చుట్టూ ఏమి వుంటాయి లాంటివి ఆలోచించండి. మీరు కుర్చీని ఒక కిటికీ ముందు వేస్తారనుకోండి, దాని మీద వున్న ఫాబ్రిక్ కాలక్రమంలో ఎండ ధాటికి వెలిసిపోవచ్చు. అందువల్ల సరళమైన ప్రింట్ వుండి కొద్దిగా రంగులు వుండేది ఎంచుకోండి. మీ అల్లరి పిల్లలు చదవడం, పజిల్స్ చేధించే౦దుకు బల్ల కొంటుంటే గట్టిగా తయారైంది ఎంచుకోండి.

English summary

How to choose the best furniture

Look for furniture that is ample in size. To see if the seating space in a chair is roomy, park yourself in it. Try to lift the chair you like and see how it feels. A good quality chair, table, sofa, or chaise will have more raw materials including springs, frame, and cushion; such pieces are usually heavier than average quality models.
Desktop Bottom Promotion