For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైనింగ్ టేబుల్ ను అందంగా సర్దేద్దాం ఇలా..!

|

మీ ఇంటికి వచ్చే అతిథుల్ని ఆకర్షించేలా డైనింగ్‌ టేబుల్‌ని సర్దడం మీ చేతుల్లోనే ఉంది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా డైనింగ్‌ టేబుల్‌ని డిజైన్‌ చేసుకుంటే మీ వంటిల్లు ఎంతో బాగుంటుంది. మీ అభిరుచికి అద్దం పడుతుంది. ఇల్లు చిన్నదైనా డైనింగ్‌ టేబుల్‌ని అమర్చుకునే విధానం, దాని శుభ్రత కిచెన్‌ని అందంగా మార్చేస్తుంది.

మీ డైనింగ్‌ టేబుల్‌ శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు:
1. మీ డైనింగ్‌ టేబుల్‌ డిజైన్‌కి తగ్గ క్లాత్‌ని సెలెక్ట్‌ చేసి దానిమీద వేస్తే డైనింగ్‌టేబుల్‌ అందంగా కన్పిస్తుంది. కాబట్టి మంచి డిజైన్‌ ఉన్న క్లాత్‌ని ఎంపిక చేసుకోవాలి.
2. డైనింగ్‌ టేబుల్‌ పై అన్ని వస్తువులు తీసేసి సబ్బునీళ్లలో తడిపిన బట్టతో లేదా స్పాంజ్‌తో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడిబట్టతో తుడవాలి.
3. ఉదయం టిఫిన్‌ ఐటెమ్స్‌ చట్నీ, హాట్‌బాక్స్‌లో ఇడ్లీలు, వేరేవి ఏవైనా ఉంటే వాటిని నీట్‌గా టేబుల్‌పైన సర్దాలి.
4. కుటుంబ సభ్యులు తినే టైంలోనే ప్లేట్లు, నీళ్లగ్లాసులు ఉంచాలి. తిన్నవెంటనే ఆ సామాన్లు తోమేందుకు వేసేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ తినేసిన కంచాలు, ప్లేట్లను టేబుల్‌పైన ఉంచకూడదు.
5. వంటింట్లో వండిన పదార్థాలు టేబుల్‌పైన పెట్టే ముందు చిన్న స్టీల్‌స్టాండ్‌ను టేబుల్‌పైన ఉంచి వాటిపైన ఆ పదార్థాల పాత్రల్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల టేబుల్‌పైన ఎలాంటి గీతలు పండేందుకు అవకాశం ఉండదు.

Tips For Setting A Dining Table

6. వండినపదార్థాలు, తినే పదార్థాలు మినహా ఇతర ఏ వస్తువులూ టేబుల్‌పైన పెట్టకూడదు.
7. అరటిపండ్లు ఇంటికి తెచ్చిన వెంటనే మెష్‌ ఉన్న నెట్‌లోనే ఉంచాలి. సాధ్యమైనంత త్వరగా వాటిని తినేయాలి. లేదంటే పండి మాగిపోతాయి.
8. మామిడిపండ్లు లేదా సీజనల్‌ పండ్లను టేబుల్‌ అంతా పరవకుండా, పెద్ద ప్లాస్టిక్‌ లేదా స్టీలు గిన్నెలో ఉంచాలి.
9. ద్రాక్ష పండ్లు తీసుకురాగానే శుభ్రంగా కడిగి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత తినడానికి కనీసం అరగంట ముందే ఫ్రిజ్‌లోంచి తీసి టేబుల్‌పైన ప్లేట్‌లో సర్ది మూత పెట్టాలి.
10. చాలామంది మిగిలిపోయిన పులుసు, చారు వంటివి టేబుల్‌పైన పెట్టి అలాగే ఉంచేస్తారు. సాధ్యమైనంత మేరకు ఏరోజు వండిన పదార్థాల్ని ఆ రోజే ఖాళీ చేసేయాలి. స్వీట్స్‌ ఎప్పుడూ తినే గంట ముందు మాత్రమే ఫ్రిజ్‌ నుంచి బయటికి తీయాలి. ఏమైనా మిగిలితే వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి.
11. తినబోయే పదార్థాలు మినహా మిగిలినవి ఏవీ అంటే బొమ్మలు, పచారీ సామాన్లు వంటివి ఏవీ టేబుల్‌పైన పెట్టకూడదు.
12. అందరి భోజనాలు పూర్తయిన వెంటనే డైనింగ్‌ టేబుల్‌ని తడిబట్టతో శుభ్రంగా తుడిచేయాలి. అవసరమైతే డెట్టాల్‌ వేసి తుడిచేయాలి. అలా చేయడం వల్ల బ్యాకీరియా టేబుల్‌పైన చేరకుండా ఉంటుంది.
13. సాల్ట్‌, పెప్పర్‌ వంటివి చిన్నచిన్న ప్లాస్టిక్‌ డబ్బాల్లో పోసి టేబుల్‌పైన ఉంచాలి. పెరుగు, నెయ్యి, నూనె వంటివి టేబుల్‌పైన ఉంచకూడదు.
14. ఈ రోజుల్లో డైనింగ్‌ టేబుల్‌ మీద మనీప్లాంట్‌గానీ, చిన్నగ్లాస్‌లో నీరు పోసి పెంచే మొక్కల్ని డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకుంటున్నారు. మీకు అలాంటి టేస్ట్‌ ఉంటే అందంగా అలంకరించుకోండి. అయితే ఒక్క సంగతి మాత్రం మరువకండి. ప్లాంట్‌లో పోసిన నీటిని రోజు విడిచి రోజు మార్చాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల మీ డైనింగ్‌ టేబుల్‌ ఎంతో అందంగా కన్పిస్తుంది. అంతేకాదు మీ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.

Story first published: Monday, August 18, 2014, 16:22 [IST]
Desktop Bottom Promotion