For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో ఫోటో ఫ్రేములు అందంగా డెకరేట్ చేసుకోవడం ఎలా

|

సాధారణంగా ఇల్లు చిన్నగా ఉంటే సమస్య ఉండదు కానీ, ఇల్లు పెద్దతైనే సమస్య. ఎందుకంటారా? పెద్దఇంట్లో గోడలు విశాలంగా కట్టి ఉంటారు. విశాలంగా ఉన్న గోడలు కాళీగా ఉంటే బోసిపోయినట్లు కనిపిస్తుంటాయి. అలా వారిలో మీరూ ఒకరా? ఇంట్లో గోడలన్నీ ఖాళీగా ఉన్నాయా? అలాగని గోడలకు ఏది పడితే అది తగిలించేస్తున్నారా? అయితే వాటి అందాన్ని మీ చేజేతులా మీరు చెడగొడుతున్నారన్న మాట! ఇళ్లల్లో గోడలు ఖాళీగా కనిపిస్తే చాలు..చాలా మంది పాత క్యాలెండర్లు, ఎప్పటివో ఫోటోలు...తగిలించేస్తుంటారు. దీనివల్ల మీరు గోడలకు ఎంత మంచి పెయింట్ వేసినా అందవిహీనంగానే కనిపిస్తుంటుంది. మరి ఏం చేయమంటారు...అంటారా? చాలా సింపులండీ...ఫోటో ఫ్రేములను తగిలిస్తే సరి. ఇవి గోడలను అందంగా, ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. మరి వీటి అలంకరణలోనూ కొన్ని కిటుకులున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

ఒకే రంగులో :
గోడలపైన అమర్చే ఫోటో ఫ్రేములు ఒక రంగులో ఉండేవి ఎంచుకోవడం మంచిది. కొంతమంది మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో రంగురంగుల ఫోటో ఫ్రేముల్ని ఒకే గోడపై అమర్చుుతుంటారు. దాంతో అన్ని రంగులు గోడ రంగులకు సరిపోక వాటి అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే చూసేటప్పుడు ఆ రంగుల ప్రభావం కంటిపై కూడా పడవచ్చు. ఇవే కాకుండా ఫోటోలను రంగురంగుల ఫ్రేముల్లో అమర్చడం వల్ల ఆ ఫోటోల మధ్య వైవిధ్యం కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే, ఒకే రంగులో ఉండే ఫ్రేముల్నే ఎంపిక చేసుకోవడం మంచిది. ఫలితంగా గోడ, ఫోటో ఫ్రేములు..రెండూ అందంగా కనిపిస్తాయి.

కనుచూపు మేరలో:
కొంత మంది ఫోటో ఫ్రేములను గోడలపై మరీ ఎత్తుగా అమర్చుతుంటారు. దీని వల్ల చూసేవారికి ఫోటోలు సరిగ్గా కనిపించవు.. అలాగే మీరు ఎంత మంచి ఫోటో ఫ్రేముల్ని అమర్చినా అంత ఎత్తులో తగిలించడం వల్ల వాటి అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసేవారికి కనుచూపు మేరలో అంటే సులభంగా ఫోటో కనిపించేలా గోడపై తక్కువ ఎత్తులో ఫ్రేముల్ని అమర్చాలి. దీంతో గోడ ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ఫోటోలూ నీట్ గా అందంగా కనిపిస్తాయి. అలాగే ఫ్రేముల్లోని ఫోటోలను సులభంగా మార్చడానికి కూడా వీలుగా ఉంటుంది.

Decorating Walls With Different Types Of Photo Frames!

సమానమైన పరిమాణంలో:
గోడలపై అమర్చడానికి సమాన పరిమాణంలో ఉండే ఫోటో ఫ్రేములను ఎంపిక చేసుకోవడం మంచిది. ఒక వేళ ఫోటో సైజు ఫ్రేమ్ పరిమాణం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉన్నట్లైతే దాన్ని ఫ్రేమ్ పరిమాణానికి తగినట్లుగా రీసైజ్ చేయించుకోవాలి. ఇలా అన్నీ సమాన పరిమాణంలో ఉండే ఫ్రేములను అమర్చడం వల్ల గోడ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లేదంటే ఇలా కూడా చేయవచ్చు. ఒకే సైజులో కాస్త పెద్దగా ఉండే ఫ్రేములన్నీ పై భాగంలో, కొంచెం చిన్న సైజులో ఉండేవి తర్వాత వరుసలో అమర్చాలి. ఇలా సైజును బట్టి కూడా అమర్చుకోవచ్చు. లేదంటీ మరీ పెద్దగా, పొడవుగా ఉండే ఫోటో ఫ్రేములైతే వేరే గోడపై ప్రత్యేకంగా తగిలించుకున్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

డల్ గా కనపడకూడదు:
మీరు ఫోటో ఫ్రేముల్ని అమర్చే గోడపైన సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్రేములపై ఎండ నేరుగా పడడం వల్ల ఫేడ్ అయిపోయి డల్ గా కనిపిస్తాయి. కాబట్టి, మీరు ఫోటో ఫ్రేముల్ని అమర్చే గోడకు ఎదురుగా ఉండే గోడకు కిటికీలు లేకుండా జాగ్రత్తపడడం మంచిది. తర్వాత ఫ్రేములు ఎక్కువ కాలం మన్నడంతో పాటు కొత్తగా కనిపిస్తాయి.

మరికొన్ని జాగ్రత్తలు:
1. ఇంట్లో గోడలకు ముందు భాగంలో సోపాసెట్, ఫర్నిచర్ అమర్చుతుంటాం. అయితే అదే గోడకు ఫోటో ఫ్రేములు కూడా తగిలిస్తే ఫోటో ఫ్రేములు హైలైట్ కాకపోవచ్చు. కాబట్టి సోఫా సెట్ కు ఎదురుగా ఉండే గోడకు అమర్చడం మంచిది. దీని వల్ల అందంగా కనిపించడంతో పాటు గోడలు ఖాళీగా కనిపించకుండా కూడా ఉంటాయి.
2. కొంత మంది ఫోటో ఫ్రేములన్నీ గోడకు అడ్డంగా లేదంటే పొడవుగా అమర్చుతుంటారు. దీని వల్ల అంత అందంగా కనిపించకపోవచ్చు. కాబట్టి ఫోటో ఫ్రేములన్నీ రెండు మూడు వరుసలు లేదంటే డైమండ్, చతురస్రం, దీర్ఘచతురస్రం..ఇలా పలు రకాల షేపుల్లో గోడలపై అమర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
3. మీరు అమర్చే ఫోటో ఫ్రేముల రంగులు మీ ఇంట్లోని గోడల రంగులకు సరిపోతుందో లేదో కూడా గమనించడం చాలా మఉక్యం. ఎందుకంటే గోడలకు వేసే అన్ని రంగుల పెయింట్లు ఫోటో ఫ్రేముల రంగులకు సరిపడకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే గోడ, ఫోటో ఫ్రేముల అందం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
4. మీరు తగిలించిన ఫోటో ఫ్రేములు పైపైన కాకుండా సరిగ్గా తగిలించడం మంచిది. లేదంటే కింద పడిపోయి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫోటో ఫ్రేములపై నుంచి విద్యుత్ తీగలు వేయడం మంచిది కాదు.
5. కొంత మంది వాళ్లు స్వయంగా గీసిన లేదంటే పెయింట్ వేసిన బొమ్మల్ని ఫోటో ఫ్రేముల్లో పెట్టుకుంటారు. అయితే ఇలాంటి బొమ్మల ఫ్రేముల్ని, ఫోటో ఫ్రేముల్ని ఒకే గోడపై అమర్చుకూడదు. ెందుకంటే ఇలా అమర్చడం వల్ల రెండింటి మధ్య వ్యత్యాసం తెలియకపోవచ్చు. అలాగే అందంగా కూడా కనబడకపోవచ్చు. కాబట్టి, వీటిని వేర్వేరు గోడలపై తగిలించడం మంచిది.

English summary

Decorating Walls With Different Types Of Photo Frames!

Interiors and home decoration is getting in trend these days. Everybody wants to have a different decoration theme for their houses. Everybody wants to use different house decor ideas using various accessories like frames, photos and wall decor pieces. In all these photos and photo frames have become very famous and everybody wants to decorate wall with photos of their family and friends and personalize the decoration theme.
Story first published: Thursday, January 22, 2015, 18:04 [IST]
Desktop Bottom Promotion