For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో స్థలం ఆక్రమించని మల్టీ పర్పస్ ఫర్నీచర్

|

మన పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతుంటారు. అదేంటంటే, మంచి పొడవును బట్టి కాళ్ళు మడుచుకోవాలంటారు. అలాగే ఇల్లు చిన్నదిగా ఉంటే ఫర్నిచర్ ను కూడా అలాగే మలుచుకోవాలి. మనం అమర్చుకొనే ఫర్నిచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమించాలి. ఫర్నీచర్ మనకు రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాంటి మల్టీపర్పస్ ఫర్నీచర్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవక తప్పదు. తెలుసుకోవడం మాత్రమే కాదు మీ ఇంటికి మరియు మీకు రెండు విధాలుగా సహాయపడే ఈ ఫర్నీచర్ ను ఎంపిక చేసి మీ ఇంట్లో అమర్చు కోవచ్చు. కూడా. మరి ఆ ఫర్నీచర్ ఏంటో ఒక సారి చూద్దాం...

1. కన్వర్టబుల్ కాఫీ టేబుల్:

1. కన్వర్టబుల్ కాఫీ టేబుల్:

డైనింగ్ టేబుల్ కోసం తగినంత స్థలం లేకపోతే కన్వర్టిబుల్ కాఫీ టేబుల్ ను ఎంపి చేసుకోవాలి. ఇది భోజనం టేబుల్, కాఫీ టేబుల్ గా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. డైనింగ్ టేబుల్ ఎత్తుకు పైకి లేవటానికి, కాఫీ టేబుల్ లా కిందికి దిగడానికి దీనిలో హైడ్రాలిక్స్ ఉంటాయి. వీటి సహాయంతో పైకి కిందికీ వీలుండే, విడిగా విడిపోయే వివిధ సైజుల్లోని టేబుల్స్ ఒకటిగా కలిసి ఉంటాయి. ఈచిన్న సైజు కన్వర్టిబుల్ టేబుల్ ను ఎంచుకుంటే వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

2. ఫోల్డ్ చేయడానికి వీలు కలిగే డైనింగ్ టేబుల్ :

2. ఫోల్డ్ చేయడానికి వీలు కలిగే డైనింగ్ టేబుల్ :

మడతపెట్టడానికి వీలుండే డైనింగ్ టేబుల్స్ వల్ల రెండు రకాల ఉపయోగాలుంటాయి. గుండ్రంగా మలిచి భోజనం టేబుల్ గా వాడుకోవచ్చు. మడతపెట్టి వాల్ టేబుల్ గా వాడుకోవచ్చు. వాల్ టేబుల్ గా వాడేటప్పుడు దాని మీద ఫోటో ఫ్రేములు, ఫ్లవర్ వాజ్ లు, ఇతర అలంకరణ వస్తువులను ఉంచుకోవచ్చు.

3. డైనింగ్ టేబుల్ 2:

3. డైనింగ్ టేబుల్ 2:

డైనింగ్ టేబుల్ కంటే కుర్చీలే ఎక్కవు స్థలంను ఆక్రమిస్తున్నాయి. అందుకే తక్కువ స్థలం ఉండే ఇళ్ళల్లో డైనింగ్ టేబుళ్ళకు స్థానం కల్పించరు. కానీ అడుగున ఇమిడిపోయే స్టూల్స్ ఉండే డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. కేవలం టేబుల్ పట్టేంత స్థలం ఉంటే చాలు. ఆ టేబుల్ అడుగున నలుగురు కూర్చుండే వీలుండే స్టూల్స్ నాలుగు వైపులా ఇమిడిపోతాయి.

4. ఎండ్ టేబుల్ :

4. ఎండ్ టేబుల్ :

చాలా తక్కువ స్థలంలో నివసించే ప్రదేశానికి తగ్గ ఫర్నీచర్ కొనేటప్పుడు స్టోరేజి వీలుండే అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలి. లివింగ్ రూమ్ లో కోసం దొరికే ఎండ్ టేబుల్స్ లో సొరుగులుండేవీ ఉంటాయి . అలాంటి వాటిని ఎంపిక చేసుకుంటే బాగా కలిసి రావటంతోపాటు అనవసర వస్తువులను స్టోర్ చేసుకోవచ్చు. అడుగున షెల్ఫులు ఉండే ఎండ్ టేబుల్ ను ఎంపిక చేసుకుంటే బుక్ స్టోరేజ్ లేదా బుక్ షెల్ఫ్ గా ఉపయోగించుకోవచ్చు.

5.కంప్యూటర్ టేబుల్:

5.కంప్యూటర్ టేబుల్:

కంప్యూటర్ టేబుల్ కోసం విడిగా టేబుల్ ఉపయోగించేబదులు గోడకు బిగించే వీలుండే టేబుల్ ను కొంటే స్థలం కలిసొస్తుంది. అందుకోసం తయారైన వాల్ మౌంట్ కంప్యూటర్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్టో అందుబాటులోకొచ్చాయి. వాటిలో కంప్యూటర్ ను ఉంచటానికి టేబుల్ తో పాటు, షోకేస్, బుక్ కేస్ కూడా ఉంటాయి . కాబట్టి, డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్ వాజులు, కూడా ఈ టేబుల్ మీద అమర్చుకోవచ్చు.

6. సోఫా విత్ బెడ్ :

6. సోఫా విత్ బెడ్ :

సోఫా, మరియు బెడ్ విడివిడిగా కొనే బదులు రెండూ కలిపి ఉండే సోఫా కమ్ బెడ్ ను కొనాలి. చిన్న అపార్ట్ మెంట్స్ లో అతిథులు కోసం ప్రత్యేకంగా బెడ్ రూమ్ లేనప్పుడు ఇలాంటి సోఫా కమ్ బెడ్ లు అవసరం అవుతాయి . మిగిలని సమయాల్లో లివింగ్ రూమ్ లో సోఫాలా వాడుకున్నా అతిథుల నిద్రకోసం దీన్ని పరిచి బెడ్ గా ఉపయోగించుకోవచ్చు.

7. స్టోరేజ్ బెడ్ :

7. స్టోరేజ్ బెడ్ :

బెడ్ నిద్రకే కాదు, దిండ్లు, దుప్పట్లు, ఇతరత్రా ఉపయోగించని వస్తువులను దాచుకునే స్టోరేజ్ ప్లేస్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం మంచి అడుగున, పక్కల్లో, వెనుకవైపున సొరుగులుంటాయి. వీటిలో పిల్లలు వాడని ఆటబొమ్మలు, మొదలుకొని, పుస్తకాలు, అరుదుగా వాడే దుస్తులు కూడా స్టోర్ చేసుకోవచ్చు.

8.ఒటోమన్స్ విత్ స్టోరేజ్:

8.ఒటోమన్స్ విత్ స్టోరేజ్:

సోఫాలో కూర్చొని కాళ్ళను ఎత్తులో ఉంచుకోవడానికి ఉపయోగించే స్టూల్ లాంటి ఒటోమన్ లలో మల్టీ పర్ఫపస్ వీ అందుబాటులో ఉన్నాయి . కుషన్స్ ఉండే ఈ ఓటోమన్స్ ఎంపిక చేసుకుంటే ఎక్స్ ట్రా సీట్ గా ఉపయోగించుకోవచ్చు. వాటిలో స్టోరేజీ సౌకర్యం ఉండేవీ ఉన్నాయి. సీట్ పైకీ లేపితే అడుగున ఖాళీ జాగా ఉండే ఓటోమన్స్ ను ఎంపిక చేసుకుంటే వాటిలో బొమ్మలు, పుస్తకాలు, పెన్నులు లాంటి వస్తువులను నిల్వ చేసుకోవచ్చు.

English summary

Tips To Make Your Home Look Spacious

A spacious home is a reflection of a clutter-free environment. It also speaks of a well-planned & organised rules and also about circulating air & light. A spacious home is also believed to circulate positive energy. 
Story first published: Wednesday, April 15, 2015, 17:37 [IST]
Desktop Bottom Promotion