For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంద్రాగస్టు పండుగ నాడు మీ ఇంట్లో మూడు రంగులతో అలంకరించండి..

ఇండిపెండెన్స్ డే కి మీ ఇంటిని ట్రై కలర్స్ లో మార్చేయండి..

By Staff
|

స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పండుగ. సాధారణంగా, ఆ రోజు ఇంటి బైట మూడురంగుల జండా ఎగురుతుండడం చూస్తాం. కానీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు, మీ ఇంట్లో వాళ్ళతో ఏదన్న ప్రత్యేకంగా చేయాలి. ప్రతిసంవత్సరం లాగా జండా ఎగురవేయడం కాకుండా, రంగుల జండాలతో మీ ఇంటిని అలంకరించండి. దీనికోసం మీ ఇంటిని పూర్తిగా మర్చేయాల్సిన అవసరం లేదు.

మూడురంగులలో ప్రత్యెక భారతీయ ఇంటిని అందరం కలిసి ఎలా అలంకరించాలో ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఇది ఈ సంవత్సరం మీ ఇంట్లో భారతదేశ ప్రత్యెక స్వాతంత్ర్య దినోత్సవం లో కేవలం ఆరంజ్, తెలుపు, ఆకుపచ్చ ల ఖచ్చితమైన కలపోతతో ఏర్పాటుచేసింది మాత్రమే.

Tri Coloured Home For Independence Day!

స్వాతంత్ర్య దినోత్సవం కొస౦ మూడురంగులకు సూచనలు:

పచ్చదనంతో నింపండి: అతితక్కువమంది వారి గోడలకు ఆకుపచ్చ రంగు వేస్తారు. వ్యక్తిగతంగా, నాకు ఆకుపచ్చ కర్టెన్లు లేదా కార్పెట్లు ఇష్టం లేదు. కానీ మూడురంగులలో ఆకుపచ్చ రంగు కూడా సమాన ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువల్ల బొమ్మలో ఆకుపచ్చరంగు ఎలా నింపాలి? చాలా తేలిక, ఆకుపచ్చతో లేదా మొక్కలతో. మీ ఇంటికి కొన్ని ఆకుపచ్చ మొక్కలు గల కుండీలను తీసుకురండి, వాటిని జండా లా కనిపించేట్టు సరైనరీతిలో అమర్చండి.

వైట్ వాష్ గోడలు: తెలుపు లేదా క్రీం రంగులను సాధారణంగా ఇంటి గోడలకు వేస్తారు. అందువల్ల, మీరు ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేకుండా జండా లో తెలుపు రంగును ఉంచవచ్చు. దీనికి అదనపు మెరుగు కోసం, మీ గోడలపై కొద్దిపాటి తాజా వైట్ వాష్ ను కూడా పూయండి.

ముదురు ఆరంజ్ సోఫా: ఈరోజుల్లో ఎక్కువగా ఇష్టపడేది ఏంటో మీకు తెలుసా? ముదురు ఆరంజ్ లెదర్ లేదా స్వేడ్ సోఫా. ఆరంజ్ చాలా శక్తివంతమైన రంగు, ఇది ఇపుడు అందరి ఇళ్ళల్లో మెరుస్తుంది, పత్రికలకు కూడా రూపాన్ని ఇస్తుంది. ఈ కాలంలో ఆరంజ్ రంగు వేస్తే, స్వాతంత్ర్య దినం రోజు మీరు మీ ఇంటిని ఆరంజ్ కచ్ లేదా సోఫా సెట్ తో అలంకరించవచ్చు. మీరు అలా చేయడం ఎక్కువ ఖర్చు అనుకుంటే, ఆరంజ్ బీన్ బాగ్ తీసుకోండి!

కర్టెన్లు & పరుపులు: కర్టెన్లు, పరుపు కవర్లు, టేబుల్ లెనిన్ లలో మార్పులు తేవడం ద్వారా మీ ఇంట్లో కొత్త అందాన్ని తీసుకురావడం చాలా తేలికైన మార్గం. అన్ని వస్తువులను తెలుపు లేదా ఆకుపచ్చ లేదా ఆరంజ్ తో మార్చకండి. తగిన రంగులను జతచేయండి. ఉదాహరణకు, తెలుపు మంచం మీద ఆరంజ్ పరుపు మంచి అందాన్ని ఇస్తుంది. అదేవిధంగా సాంప్రదాయ తెల్లని టేబుల్ క్లాత్ పై ఆకుపచ్చని టేబుల్ మ్యాట్ వేయండి.

ప్రాధాన్యతగల గోడ: మీ ఇంట్లో ముదురు రంగు వేసిన గోడ ఉంటే అది లేత రంగు గోడల ప్రాధాన్యతను పెంచడం ఈరోజుల్లో ఒక ఫాషన్ గా మారింది. అదృష్టవశాత్తూ మీకు, ఇప్పుడు అవసరమైన ముదురు ఆరంజ్ రంగు ఇప్పుడు చాలా ఫాషన్ అయిపొయింది. మీరు దీన్ని చాలా ఇళ్ళల్లో చూడొచ్చు. మీరు ఒక మంచి ఆకుపచ్చ రంగును ఎంచుకుంటే ఆకుపచ్చ రంగుతో నిండిన గోడ వల్ల ప్రమాదం లేదు. మీరు ఇష్టపడితే ఆకుపచ్చ హైలైట్స్ తో ఆరంజ్ గోడ ను కూడా పొందవచ్చు.

ఈ ఆలోచనలు స్వాతంత్ర్య దినోత్సవం రోజు మీ ఇంటికి మూడు రంగులను తీసుకురావడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఏ ఆలోచన మీరు ప్రయత్నించడానికి ఇష్టపడతారు?

English summary

Tri Colored Home For Independence Day!

Independence Day in India is a very special occasion. Usually, we see tricoloured flags hanging outside homes on this day. But this Independence Day, you could do something special with your home.
Desktop Bottom Promotion