మీకిష్టమైన పాత చీరలతో మీ ఇంటికి న్యూ అండ్ ఎట్రాక్టివ్ లుక్..!

Posted By:
Subscribe to Boldsky

మన ఇంట్లో మనకు ఇష్టమైన, అమ్మకు ఇష్టమైన చీరలు చాలానే ఉంటాయి. వాటిని కొని చాలా రోజులు అయినా..చూడ్డానికి మాత్రం కొత్తవాటిలా, షైనీగా, ఎట్రాక్టివ్ గా ఉంటాయి. అలాంటి శారీలను పడేయాలి అనిపించదు, ఎవరికీ ఇవ్వాలి అనిపించదు.

ఇష్టమైన చీరలు కాస్త రంధ్రం పడటం, బార్డర్ లో చిరిగిపోవడం వంటి కారణాల వల్ల వాటిని పక్కనపెట్టేసి ఉంటాం. వాటిని కట్టుకోకూడదన్న రూల్ వల్ల ఏమీ చేయలేక అలానే అలమరాలో పెట్టేస్తారు. కానీ.. అలాంటి కలర్ ఫుల్ శారీ.. మీ ఇంటికి న్యూ లుక్ తీసుకురావడానికి ఉపయోగించవచ్చు.

అయితే అలాంటి ఇష్టమైన, అందమైన పాత చీరలను.. ఇంటి అలంకరణలో ఉపయోగిస్తే.. మీ ఇంటి అందం రెట్టింపు అవుతుంది. పాత కలర్ ఫుల్ చీరలను ఇంటి అలంకరణలో ఉపయోగిస్తే.. ఇంటికి వచ్చిన అతిథులంతా.. ఎట్రాక్ట్ అయిపోతారు. మరి మీ బడ్జెట్ లో.. మీకు ఇష్టమైన చీరలను ఇంటి డెకరేషన్ కి ఎలా ఉపయోగించాలి.

కుషన్ కవర్స్

కుషన్ కవర్స్

మీ పాత సిల్క్ లేదా హ్యాండ్లూమ్ శారీ.. కొద్దిగా చిరిగిపోయిందా ? అయితే ఫీలవకండి. అలాంటి చీరలను కుషన్ కవర్స్ గా ఉపయోగిస్తే.. మీ లివింగ్ రూమ్ అందం రెట్టింపు అవుతుంది. చాలా బ్రైట్ గా ఉండే కలర్స్ మరింత అందంగా ఉంటాయి. లోపల కాటన్ క్లాత్ ఉపయోగించి కుట్టిస్తే.. చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తాయి.

శారీ కర్టన్స్

శారీ కర్టన్స్

సిల్క్ శారీస్ ఉపయోగించి.. కొత్త కర్టన్స్ క్రియేట్ చేయవచ్చు. కాంట్రాస్ట్ కలర్స్ రెండింటిని కలిపి కర్టెన్స్ గా ఉపయోగించవచ్చు లేదా ప్యాచ్ వర్క్ శారీలను కర్టెన్లుగా ఉపయోగిస్తే.. మీ ఇంటికి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది.

శారీ ఫ్రేమ్స్

శారీ ఫ్రేమ్స్

శారీ పల్లూలను లేదా డార్క్ గా, మంచి డిజైన్ ఉన్న భాగం తీసుకుని ఫ్రేమ్ చేయించి పెడితే.. అందరూ వావ్ అనాల్సిందే. వాటిని వాల్ ఆర్ట్ గా ఉపయోగించవచ్చు.

జరీ

జరీ

పాత చీర లేదా ఖరీదైన చీరల జరీని కుషన్ కవర్స్ కి ఉపయోగించవచ్చు. టేబుల్ పై క్లాత్ గా లేదా పిల్లో కవర్స్ లా ప్లెయిన్ క్లాత్ కి జరీ జత చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది.

క్విల్ట్

క్విల్ట్

క్విల్ట్ అంటే..బొంత. కొన్ని సిల్క్ లేదా కాటన్ శారీస్ ని.. కలిపి.. ప్యాచ్ వర్క్ లా కుట్టిస్తే.. క్విల్ట్ రెడీ అయిపోతుంది. దీన్ని మీ బెడ్ రూంలో ఉపయోగిస్తే.. మీరు మూడవుట్ అవకుండా.. హ్యాపీగా ఉంటారు.

English summary

Amazing Ways to Reuse your Favorite old sarees!

Amazing Ways to Reuse your Favorite old sarees! We all have that vintage saree tucked inside our mother's closet which we totally adore but wonder if they can be used somehow if not be draped again.
Story first published: Tuesday, September 20, 2016, 18:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter