For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దీపావళికి మీ ఇంటి అలంకరణకు బెస్ట్ ఐడియాస్.!

|

భారతదేశం అంటే పండగల దేశం. వివిధ సంస్కృతులు,మతాలకి చెందిన ప్రజలతో మనదేశపు అందం, అందరూ కలిసి పండగలను జరుపుకోటంతో ఇనుమడిస్తుంది. దేశంలో ఏ మూలకి చెందినవారైనా, మీరు ఏ భారత పండగన్నా ఒకేలా ఉత్సాహపడతారు.

నవరాత్రి పండగ ఉత్సవాలు ఇప్పుడే అయ్యాయి అప్పుడే ప్రజలు దీపావళి సన్నాహాలు మొదలు పెట్టేశారు. కొత్త బట్టలు, పిండివంటలే కాక, దీపావళికి మరో ప్రత్యేకత అలంకరణ.

<strong>దీపావళి తర్వాత ఇల్లు శుభ్రపరచడానికి సులభ చిట్కాలు...</strong>దీపావళి తర్వాత ఇల్లు శుభ్రపరచడానికి సులభ చిట్కాలు...

మీ ఇల్లు అలంకరించకపోతే దీపావళి పూర్తయినట్టు కాదు. మన దేశంలో దీపావళి పండగకి వారాల ముందుగానే ఇల్లంతా కడిగి శుభ్రపరిచి, గుమ్మాలకి తోరణాలు, లైట్లు, కొవ్వొత్తులతో అలంకరిస్తారు.

ఈ దీపావళికి మీ సృజనాత్మకత అందరికీ తెలియాలంటే, ఈ కింది అలంకరణ ఐడియాలను పాటించి 2017 దీపావళిని అందంగా మార్చుకోండి.

<strong>ఇల్లు కళకళలాడించే ప్రమిదలు పలురకాలు... దీపావళి స్పెషల్</strong>ఇల్లు కళకళలాడించే ప్రమిదలు పలురకాలు... దీపావళి స్పెషల్

వేలాడే లాంతర్లు

వేలాడే లాంతర్లు

ఈ దీపావళికి మీ ఇల్లును మెరిసే రంగుల వేలాడే లాంతర్లతో అలంకరించండి. వీటిని మీరే కాగితం లేదా పారేసిన ప్లాస్టిక్ సీసాలు, పాత న్యూస్ పేపర్లు, రంగుల కాగితాల వంటి వాటితో తయారుచేసుకోవచ్చు. కొంచెం సృజనాత్మకత వాడి ప్రత్యేకంగా నిలవండి.

లైట్ల వరుసలు

లైట్ల వరుసలు

ఇవి అందరికీ సులభంగా దొరికే, చవకైన వస్తువులు. ఈ లైట్ల తాళ్లను రకరకాలుగా వాడి మీ అలంకరణను పూర్తిచేయవచ్చు. ఏదన్నా మూలకి కొత్త రూపం ఇవ్వాలనుకుంటే అక్కడ చాలా ఎక్కువగా వీటిని పెట్టండి.

స్వంతంగా మీరే చేసుకోండి

స్వంతంగా మీరే చేసుకోండి

మీ ఇంటిని అలంకరించే విధానాలు చాలారకాలుగా ఉంటాయి. ఉదాహరణకి, మీ డ్రెస్సింగ్ టేబుల్ లో వాడేసిన కొన్ని గాజుల కోసం చూడండి. వీటితో ఏం చేయొచ్చని మిమ్మల్ని మీరు అడగండి. నిజమే, పాత రంగురాళ్ల గాజులతో అందమైన కొవ్వొత్తి తయారుచేయవచ్చు.

ప్రమిదలతో షాండ్లియర్

ప్రమిదలతో షాండ్లియర్

చాలా ప్రమిదలను కలిపి కొన్ని రంగురంగుల రాళ్ళు లేదా పూసలతో వేలాడదీయవచ్చు. ఇది అందమైన ప్రమిదల షాండ్లియర్ లాగా కన్పిస్తుంది.

కమలాల దీపాలు

కమలాల దీపాలు

వీటిని మీ తోట లేదా ఇంటి ముందుభాగంలో అలంకరించటానికి ఉపయోగించవచ్చు. నీటిమీద తేలేలా చేయవచ్చు. ఈ అందమైన లైట్లు పండగ ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి.వీటిని ఇంటి ముందైనా లేదా ఇంటి లోపల మీ పూజగది వద్దనైనా అలంకరించవచ్చు.

ముగ్గు

ముగ్గు

మీరు రంగురంగుల ముగ్గుల డిజైన్లలో నిపుణులైతే, ఈ ఐడియా మీకు దీపావళికి చాలా పనికొస్తుంది. మీ ఇల్లంతా, వీధిగుమ్మం మొదలుకొని, పెరటి గుమ్మం వరకూ అన్నిచోట్లా అందమైన ముగ్గులు తీర్చిదిద్దండి. పూలు, గీతలు కలిసిన స్టైల్స్ లో కొత్తరకాల ముగ్గులను రంగురంగుల రాళ్లతో అలంకరిస్తూ ప్రయత్నించండి. ఇది దీపావళికి మీ ఇంటిని ప్రత్యేకంగా అందరి కళ్లలో పడేలా చేస్తుంది.

ప్రతి గుమ్మం వద్ద రంగుల ముగ్గుతో స్వాగతం

ప్రతి గుమ్మం వద్ద రంగుల ముగ్గుతో స్వాగతం

ఇది దీపావళి యొక్క మరొక ముఖ్యప్రత్యేకత. ప్రతి గుమ్మం దగ్గర అందమైన అన్నిరంగులున్న ముగ్గులతో స్వాగతం పలకండి. వాటిల్లో ప్రమిదలుంచి వాటి అందాన్ని మరింత పెంచవచ్చు.

కోలగా ఉన్న లైట్లు

కోలగా ఉన్న లైట్లు

ఈ రకపు లైట్లు కూడా దీపావళి అలంకరణకి మరింత వన్నె తీసుకొస్తాయి. మీకు పెద్ద కిటికీ ఉన్నట్లయితే, వీటిని ఆరోహణక్రమంలో వాటి సైజు ప్రకారం అమర్చవచ్చు. ఒకే సైజులో ఉన్న దీపాలను కూడా కొని అమర్చినా అందంగానే ఉంటుంది.

పైన తెలిపిన అన్ని అలంకరణ ఐడియాలు ప్రత్యేకమైనవే. ఇవి మిమ్మల్ని అందరికన్నా భిన్నంగా,కొత్తగా కన్పించేట్లు చేస్తాయి. ప్రతిసారి మీరు సృజనాత్మకంగా, ప్రత్యేకంగా ఉండటమే ఈ వ్యాసం ఉద్దేశం. దీపావళి మీ సృజనాత్మకతను అందరికీ చూపే మంచి అవకాశం. అందుకని, మీ సమయం వృధా చేయకుండా దీపావళిని మీ మేటి అలంకరణ ఐడియాలతో మరింత అందంగా మార్చుకోండి.

ALL IMAGE SOURCE

English summary

Best Diwali Decoration Ideas

Diwali is incomplete without the decoration of your house. Each and every household in India is cleaned a few weeks ahead of the festival and the doorways are adorned with candles and lamps.
Desktop Bottom Promotion