ఈ అద్భుతమైన ఆలోచనలతో ఇంటిని స్వర్గంలా మార్చుకోవచ్చు

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ ఆలోచనలను ప్రతిబింభించే విధంగా మీరు గనుక ఒక ఇంటిని నిర్మించుకోవాలని ప్రణాళిక రచించినట్లైతే, అందుకు చేయవల్సిన పని మీ చేతుల్లోనే ఉంది. మీరు కొత్త ఇల్లు కట్టాలి అని అనుకొని ఉండవచ్చు లేదా పాత ఇంటిని బాగు చేయాలని భావించి ఉండవచ్చు. ఇలా ఏమి చేయదలచినా కూడా విభిన్నమైన నిర్మాణ శైలి లు మరియు లోపలి అలంకరణకు సంబంధించి వివిధ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి మరియు కొన్ని కొత్త నిర్మాణాలు చేయడం ద్వారా మీరు కోరుకుంటున్న ఆ అదనపు ఆకర్షణ వస్తుంది. ఈ సవాళ్ళని మీరు సులువుగానే చేధించగలరు మరియు ప్రకాశంగా మీ కలను సాకారం చేసుకోగలరు. ఇప్పుడు మీరు వినబోయే ఆలోచనలు ఇంతకముందు వినకపోయి ఉండవచ్చు. ఇవి మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.

"ఇల్లు ఎంత పెద్దగా ఉంది అనేది ముఖ్యం కాదు, ఇల్లు ఎంత ఆనందంగా ఉంది అనేది ముఖ్యం" అని చాలామంది చెప్పే సామెత. ఇల్లు కేవలం నివసించడానికి మాత్రమే ఉండే స్థలం కాదు. అస్తవ్యస్తంగా ఉండి మరియు నాలుగు మొండి గోడలు ఉన్న ఇంట్లోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి.

మీ ఇంటిని నివసించే స్వర్గంలా మార్చుకోవాలి అనుకుంటే, అందుకు అవసరమయ్యే అద్భుతమైన ఆలోచనలు :

కొంతమందికి కొన్ని ఇళ్లల్లో నివసించాలని ఉండదు. అటువంటి వాటిల్లో ఎవరు కూడా నివసించడానికి సాహసించరు. కేవలం మనుష్యులు ఉన్న నివాస ప్రాంతం మాత్రమే ఇల్లు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ, ఆ ఇంటిని సరైన విధంగా రూపకల్పన చేయడం ద్వారా మరియు పద్దతులను అవలంభించడం ద్వారా ఇంటిని స్వర్గంలా మార్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆ ఇల్లు మరింత వాడుకలోకి వస్తుంది. అంతేకాకుండా ఇలా చేయడాన్ని మీకు నచ్చినట్లుగా, మీ వ్యక్తిత్వానికి మెచ్చినట్లుగా మరియు మీకు కావాల్సినంత విశ్రాంతి మరియు సౌకర్యం ఇలా అన్ని సమకూరేలా చాలా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ వ్యాసంలో ఏడు అద్భుతమైన ఆలోచనలను తెలుసుకోబోతున్నారు. వీటి ద్వారా మీ ఇంటిని అద్భుతంగా మలుచుకోవచ్చు మరియు ఒక అందమైన స్వర్గంలా మార్చుకోవచ్చు.

మీకు నచ్చిన విధంగా వెలిగించండి :

మీకు నచ్చిన విధంగా వెలిగించండి :

Image Courtesy

సరైన పద్దతిలో ప్రకృతి సహజమైన మరియు కృత్రిమమైన వెలుతురు యొక్క సమ్మేళనం ఇంటికి చాలా అవసరం. ఇది ఎంతో ముఖ్య పాత్రను కూడా పోషిస్తుంది. వెలుతురు గనుక బాగా ఉన్నట్లైతే మీ ఆలోచనలు కూడా ఎప్పుడు కొత్తవిగా మరియు ఉత్సాహ పరిచే విధంగా ఉంటాయి. మీ కిటికీల పరిమాణం మరియు కొలతలు అందుకు వాడే అద్దాలు లాంటి వాటి ఆధారంగా, మీ ఇంట్లో కి ఎంత వెలుతురూ వస్తుంది అనే విషయాన్ని చెప్పవచ్చు.

వంట గదులను రూపకల్పన చేసేటప్పుడు అవసరమైన మేర వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే, అక్కడ పని చేస్తారు. కాబట్టి మీకు అక్కడ సౌకర్యవంతంగా ఉండాలి. మంచి అనుభూతి కలగడానికి మీకు నచ్చిన చోట లైట్లను అమర్చుకోండి.

పనికిరాని వస్తువులను భద్రపరచడానికి

పనికిరాని వస్తువులను భద్రపరచడానికి

Image Courtesy

అవసరంలేని, ప్రస్తుతానికి పనికిరాని వస్తువులను భద్రపరచడానికి తగినంత స్థలం ఉండాలి. ఇందుకోసం ఇంట్లో ఉన్న మూలలన్నింటిని కళాత్మకంగా ఉపయోగించుకోండి. చక్కనైన మరియు వ్యవస్థీకృత విధానంలో ఎప్పుడైతే ఇల్లు అలంకరించబడుతుందో అటువంటి సమయంలో మీ మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు నిర్మలమైన ఆలోచనలు మీకు కలుగుతాయి. ఎక్కడైనా బుట్టలను లేదా బాక్స్ లను అమర్చండి. ఇలా చేయడం వల్ల త్వరగా మీరు సర్దడానికి వీలవుతుంది.

మృదువైన ప్రవాహం :

మృదువైన ప్రవాహం :

Image Courtesy

మీ ఇంట్లో ఉన్న స్థలాలన్నింటిని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా, మంచి అనుభూతిని పొందే విధంగా పరిసరాలన్నింటిని ప్రణాళికా బద్దంగా ఉంచుకోండి. నిర్వహణ గనుక బాగా అమలుపరిచినట్లైతే మరియు ఉన్న స్థలాన్ని చక్కగా విభజించి వినియోగించుకున్నట్లైతే, ఖచ్చితమైన పవిత్రమైన స్థలానికి ఉండాల్సిన లక్షణాలు మీ ఇంటికి ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఇంటి ముందు ఖాళీ స్థలం ఉండాలని కోరుకుంటున్నారు మరియు మంచి గాలిని ఆస్వాదించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా గాలి వెలుతురు ఇంటి లోపలకి బాగా ప్రసరించాలని ముఖ్యంగా కోరుకుంటున్నారు. సరిగ్గా గనుక ప్రణాళిక రచించినట్లైతే ఇంట్లో ఉన్న చిన్న స్థలం కూడా చక్కగా ఉపయోగపడేలా చేసుకోవచ్చు.

ఏదైనా కొత్త శైలిని తీసుకురండి :

ఏదైనా కొత్త శైలిని తీసుకురండి :

Image Courtesy

మీ ఇంటి యొక్క వాతావరణాన్ని మరియు మీ వ్యక్తిత్వాన్ని వివరించడానికి వీలుగా ఒక మంచి శైలి ని మీరు ఎంచుకోండి. ఇందుకోసం చాలా తక్కువ ఖర్చుతో కూడిన సమకాలీన లేదా సంప్రదాయబద్ధమైన విధంగా ఆ శైలి ఉండేలా చూసుకోండి. ఒక మంచి భావన కలగడానికి రకరకాల వస్తువులు మరియు గృహోపకరణాలను అందంగా మీకు నచ్చిన చోట పెట్టండి. పాతకాలం నమూనాలను ప్రతిబింబించేలా ఎక్కడైనా చొప్పించండి. లేదా రంగు రంగులుగా ఉండే వాటిని ఎక్కడైనా అలంకరించండి. ఇలా ఏదైనా సృజనాత్మకంగా ఉండేలా చూసుకోండి. ఇలాంటివి అన్ని మీ ఇంట్లో ఉండటం వల్ల మీరు రోజంతా ఎదుర్కొనే ఒత్తిళ్లు వీటిని చూసినప్పుడు దూరమవుతాయి.

ఉత్సాహపూర్తితమైన గృహోపకరనాలను వాడండి:

ఉత్సాహపూర్తితమైన గృహోపకరనాలను వాడండి:

Image Courtesy

చాలా మంది రోజు మొత్తం అలసిపోయిన తరువాత సోఫా పైన నిద్రపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సామాను మరియు గృహోపకరనాలు మన ఇంటికి వచ్చే అతిధులకు ఆహ్వానం పలికే విధంగా ఉండాలి. మరియు అవి ఇలా ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనికివస్తాయో అనే విషయం కూడా చాలా ముఖ్యం. మీ గది సరిగా సరిపోయే సామానును మరియు అవి అక్కడ అమర్చగానే ఒక కొత్త అనుభూతిని ఇచ్చే సామానును ఉంచు కోవడం ద్వారా మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది మరియు మీరు విశ్రాంతిని కూడా పొందుతారు.

పచ్చగా ఉండేలా చూసుకోండి :

పచ్చగా ఉండేలా చూసుకోండి :

Image Courtesy

మీరు ఉంటున్న ప్రదేశంలో పచ్చదనాన్ని పెంచడం వల్ల మీకు ఎంతో హాయిగా ఉంటుంది. మీ హాల్లో గాని లేదా భోజనం చేసే స్థలంలో గాని కుండలో ఏమైనా మొక్కలు పెంచండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, అలసట రెండు దూరం అవుతాయి. ఇంటిలోపలనే ఏదైనా ఒక చిన్న తోట లేదా నీళ్లు విరజిమ్మే యంత్రం లేదా పెద్ద కిటికీలు పెట్టడం లేదా ఫ్రెంచ్ తలుపులను పెట్టి తెరచి ఉంచడం ద్వారా మీరు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

మీ స్థలం లో మీకు నచ్చిన ఉపకరణాలను పెట్టుకోండి :

మీ స్థలం లో మీకు నచ్చిన ఉపకరణాలను పెట్టుకోండి :

Image Courtesy

చివరిది, అతి ముఖ్యమైనది ఏమిటంటే, మీ అలమరాలో మరియు గోడల పైన ఒక ప్రత్యేక శైలి ప్రతిబింభించేలా చూసుకోండి. పురాతన ఆభరణాలు, వస్తువులు, గోడకు అతికించడానికి మంచి సామెతలు లేదా వ్యాఖ్యలు లేదా మంచి చిత్రాలను పెట్టండి. నిస్సందేహంగా ఇలా చేయడం వల్ల ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది మరియు మీ ఇంటికి కూడా ఒక ప్రత్యేకమైన అస్తిత్వం జోడించినట్లు అవుతుంది. ఇలా అన్ని చేయడం ద్వారా మీ ఇల్లు స్వర్గం అవుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Amazing Ideas To Make Your Home A Living Heaven

    Amazing Ideas To Make Your Home A Living Heaven,A house can be converted into a home with its occupants and a home into a living haven with the right design and techniques used that will make it more functional, cost effective, suit your style and personality and provide the relaxation and comfort that is required.Chec
    Story first published: Friday, February 23, 2018, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more