For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సులభమైన డిఐవై హోమ్ డెకరేషన్ చిట్కాలు

|

మన మనస్సు ఎక్కడ ఉంటే అదే మన ఇల్లు అవుతుందన్నది నిజమే. మన ఆఫీసులు, ఉద్యోగాలు ఎలా ఉన్నా, ఆఖరికి అందరం రావాలనుకునేది మన ఇంటికే. అందుకే చాలామంది మనకి నచ్చినట్టుగా,ఇష్టంతో ఇల్లును అలంకరించుకోవటంలో దేనికీ వెనకాడరు.

ఇక మార్కెట్లో మనకి కావాల్సినది సరిగ్గా దొరుకుతుందనే నమ్మకం లేదు. చాలా కేసుల్లో షాపువాడికి మనకి సరిగ్గా ఏం కావాలో వివరించటం కూడా కష్టమే.

అలాంటి పరిస్థితిలో మీరు చేయగలిగిందల్లా కొన్ని ప్రత్యేక సొంతమైన డిఐవై హోమ్ డెకరేషన్ ఐడియాలను ప్రయత్నించడం. ఇలా మీ ఇల్లు కొత్తగా ప్రత్యేకంగా కన్పిస్తుంది, అలాగే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టనవసరం ఉండదు. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పది ప్రత్యేక అందమైన డిఐవై హోమ్ డెకరేషన్ ఆలోచనలను ప్రయత్నించండి.

రఫుల్ లాంప్ షేడ్

రఫుల్ లాంప్ షేడ్

దీని కోసం మీకు కావాల్సినది లినెన్ గుడ్డ, వేడి గమ్. పాత లాంప్ షేడ్ ను తీసుకుని లినెన్ గుడ్డతో వేలాడేలా రఫుల్స్ అతికించండి. మంచి ప్రభావం కోసం లైటు రంగులోనే లినెన్ గుడ్డ తీసుకోండి.దానివల్ల లాంప్ షేడ్ రంగు బాగా వస్తుంది. అదయ్యాక ఆ గుడ్డని వేడి గమ్ ను అతికించి రెండు గంటలపాటు ఆరనిచ్చాక ల్యాంప్ షేడ్ ను వాడుకోవచ్చు.

షట్టర్ ఉన్న సైడ్ టేబుల్

షట్టర్ ఉన్న సైడ్ టేబుల్

ఇల్లును మళ్ళీ మారుస్తున్నప్పుడు, పాత షట్టర్ కిటికీ తలుపులను స్టోర్ రూమ్ లో పడేస్తారు. ఇప్పుడు అందులోంచి నాలుగు తీసి క్యూబ్ ఆకారంలో అతికించండి (పై మూతలు వద్దు). అదయ్యాక గ్లాస్ స్లాబ్ ను దానిపై పెడితే, మీ సైడ్ టేబుల్ రెడీ. ఈ చిన్న టేబుల్ పై ఒక చిన్న కుండీ మొక్క లేదా పువ్వుల వాజ్ ను పెడితే అందంగా ఉంటుంది.

చేతులతో రంగులేసిన నాప్కిన్లు

చేతులతో రంగులేసిన నాప్కిన్లు

ఆరు నాప్కిన్ల సెట్ ను తీసుకుని, మీకు నచ్చిన రంగులు వేయండి. తర్వాత ఈ నాప్కిన్లను మడిచి అతిథులను ఇంటికి పిలిచినప్పుడల్లా తెల్లని పళ్ళేలపై పెట్టి అందివ్వండి. పాలిపోయిన నాప్కిన్లపై ఈ కొత్త రంగుల వలన అవి తాజాగా కొత్త నాప్కిన్లలాగానే కన్పిస్తాయి. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలని అన్పిస్తే , నాప్కిన్లను మ్యాట్లపై కూడా పెట్టడం గురించి ఆలోచించండి.

పాత కుర్చీలకి కొత్త అందం

పాత కుర్చీలకి కొత్త అందం

ఎవరైనా మొదట ఒక కుర్చీ గురించి గమనించేది కూర్చునే చట్రం గురించే. దురదృష్టమేమిటంటే,కుర్చీలో మొదటగా పాడయ్యే భాగం కూడా అదే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, సులభమైన పరిష్కారం గోడకేసిన పెయింట్లలో మిగిలిపోయినది పాత కుర్చీల ఫ్రేములకి కూడా వేయటం. ఇది కుర్చీలను గదులతో మ్యాచ్ అయ్యేలా చేయటమే కాదు, మొత్తం గది కూడా తాజా లుక్ తో మెరిసిపోతుంది.

కర్టెన్లకి కొత్త దశ

కర్టెన్లకి కొత్త దశ

మీ పాత కర్టెన్లను చూసి బోరు కొడుతున్నట్లయితే, చివర్లన వేలాడే గుండ్రటి పోంపోంలను అతికించవచ్చు. ఈ చిన్న మార్పు కర్టెన్ కు అదనపు అందాన్ని ఇచ్చి పూర్తిగా కొత్త లుక్ ను ఇస్తుంది.మీకు ఈ ఆలోచన నచ్చితే ఇలానే దిండ్లు,కుషన్లకి కూడా చేయవచ్చు. కర్టెన్లకి, దిండ్లకి లేదా కుషన్లకి మీరు వాడే పోంపోంలు ఒకటే లేదా వేర్వేరు రంగులవి కూడా అయివుండవచ్చు. ఎలా అయినా బానేఉంటాయి.

సూట్ కేసు టేబులు

సూట్ కేసు టేబులు

ఆధునిక ఇళ్ళలో స్టోరేజీ సమస్య ఎక్కువగా ఉంటోంది. అలాంటప్పుడు పాత సూట్ కేసులను కొత్తగా వాడవచ్చు. ఒక పాత పెద్ద సూట్ కేసును బెడ్ చివర బల్లలోపల పెట్టవచ్చు. దీన్ని పుస్తకాలు పెట్టుకోటానికో, దుప్పట్లు పెట్టుకోడానికో వాడుకోవచ్చు.

చిల్లర బ్యాంకు

చిల్లర బ్యాంకు

ఒక తడి వైప్స్ కి చెందిన గుండ్రటి డబ్బా తీసుకోండి, దాన్ని శుభ్రంగా కడగండి. ఆరాక, లేబుల్ తీసేయండి. ‘చిల్లర బ్యాంకు’ అనే కొత్త లేబుల్ ప్రింట్ తీసి అతికించండి. మరో విధంగా, మీ సృజనాత్మకతను వాడి మీరే దానిపై రంగు రంగులతో రాయండి. టేపుతో అతికించండి. మీ కాయిన్ బ్యాంకు తయారయిపోయింది. ఇందులో పై రంథ్రం ద్వారా చిల్లరను పడేయవచ్చు. మీ పిల్లలకి ప్రతి పైసా విలువైనదే అని తెలపటానికి, డబ్బు విలువ నేర్పించడానికి ఇది మంచి పరికరం.

English summary

Easy DIY Home Decor tricks

Home is one of the best places to relax and live the way you want to. There are certain personalized home decor ideas that could brighten up your home. Some of the best ones are having a shutter side table, renovating the old chairs, changing the old chairs, etc. This will give the entire home a fresh appeal.
Story first published: Thursday, May 3, 2018, 19:00 [IST]