TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
భారతీయ గృహాలకు ఏడు సొగసైన ఫర్నిచర్ డిజైన్లు !!
భారతీయ గృహాలు గొప్ప సాంప్రదాయ, సాంస్కృతిక వారసత్వాలకు తార్కాణం. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, కళల్లో వైవిధ్యాల కారణంగా, ఆధునిక ధోరణులతో పురాతనకాల అద్భుతమైన మిశ్రమాలతో కూడిన అసాధారణమైన, ఆశ్చర్యపరిచే డెకార్ శైలిలను మీరు సాధారణ భారతీయ గృహాలలో చూడవచ్చు.
మరింత ఆశక్తికరమైన విషయం ఏమిటంటే, వారు ఎటువంటి శైలి లేదా అంశాన్నైనా స్వీకరించగలరు, భారతీయ సంప్రదాయ రూపంతో 'వారి రకాలలో ఒకటి' గా అనుకోని దాని రూపాన్ని మార్చుకుంటారు. శక్తివంతమైన రంగులు, గట్టి చెక్క, కష్టమైన నమూనాలు కలిగిన మరిన్ని సాధారణ లక్షణాలు.
ఇక్కడ కొన్ని సొగసైన ఫర్నిచర్ డిజైన్లు ఉన్నాయి, వీటిలో కొన్ని పరిశీలనాత్మకమైనవి, ఆధునాతనమైనవి, ఇంకా భారతీయ గృహాలకు అనువుగా ఉంటాయి.
జపనీస్ బెడ్
చదునుగా, చిన్నదిగా ఉండే జపనీస్ బెడ్ సున్నితంగా, తక్కువ ఎత్తులో ఉండే ప్లాట్ఫామ్ ని కలిగి ఉంటుంది. గొప్ప ఆకృతి, ప్రతిమలు, ఉపకరణాలు వంటి భారతీయ టచ్ తో కూడుకుని ఇవి చాలా ఆధునికంగా, సున్నితంగా, ఒక వైఖరిని కలిగి ఉంటాయి, ఈ సాలిడ్ వుడ్ ప్లాట్ఫార్మ్స్ ఆధునిక భారతీయ పడకగదికి అదనపు అద్భుతాన్ని అందిస్తాయి.
Image courtesy: జపనీస్ బెడ్
చెస్ట్ తో కాఫీ టేబుల్
కాఫీ టేబుల్స్ ఆకారం, శైలిలో అద్భుతమైన వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది బహుళ ప్రయోజనాలు కలిగిన కాఫీ టేబుల్ కం ట్రెజర్ చెస్ట్.
గ్రామీణ లక్షణాలు, కష్టమైన చెక్కడాలతో కూడిన ఈ చెక్క, సాంప్రదాయ భారతీయ పడకగది లేదా లివింగ్ రూమ్ కు ఖచ్చితమైన, గొప్ప ఎంపిక. ఇది ఆధునిక స్పేస్ తో పరిశీలనాత్మక అనుభూతిని కూడా తెస్తుంది.
చిత్ర సౌజన్యం: చెస్ట్ తో కాఫీ టేబుల్
సాంప్రదాయ ప్రాముఖ్యత కలిగిన కుర్చీలు
ముడి కలపతో, చిన్న చక్రాలతో చేసిన, చెక్కిన, ఖరీదైన పరుపుతో కూడిన ఈ సాంప్రదాయ ప్రాముఖ్యత కల చేతి కుర్చీలు ఏ ప్రదేశంలోనైనా విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తాయి.
వంపులతో కూడిన దీని రూపం, ఒక ప్రదేశం నుండి ముందుకు కదిలిన భావనను కలిగిస్తుంది. మీరు అందమైన సాంప్రదాయ లేదా సమకాలీన అనుభూతిని జోడించాలి అనుకుంటే, ఇది మీ లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లేదా హాల్ కి ఒక ప్రత్యేకమైన ఎంపిక.
Image courtesy: సాంప్రదాయ ప్రాముఖ్యత కలిగిన కుర్చీలు
ఓరియెంటల్ ప్లాట్ఫామ్ బెడ్
ఎవరైతే వారి పడకగది ఖరీదైన, కళాత్మక౦గా ఉండాలి అనుకుంటారో వారికి ఈ ఓరియెంటల్ స్టైల్, డబుల్ ప్లాట్ఫార్మ్ బెడ్, దిండ్లతో కూడిన ఉపకరణాలు, రంగురంగుల ప్రింట్లు, గొప్ప ఆకృతి కలిగిన రెండు పందిళ్ళు వంటివి సరిగా సరిపోతాయి.
వీటిని పందిళ్ళు లేని, మన సొగసైన భారతీయ నివాస గదులకు మధ్యభాగంలో సీటింగ్ అమరికగా కూడా ఉపయోగించవచ్చు.
Image courtesy: ఓరియెంటల్ ప్లాట్ఫామ్ బెడ్
తక్కువ స్థలంలో వంటగది ద్వీపం
యాక్రిలిక్ బార్ బల్లలతో ఈ పచ్చి కలపతో చేసిన వంటగది ద్వీపం ప్రత్యామ్నాయ కాంబినేషన్ ను ఇష్టపడతాము. గ్రామీణ, తక్కువ స్ధలంతో కూడిన ఈ అద్భుతమైన, అసాధారణమైన కలయికను మేము గమనించాము.
ఇది ఒక భారతీయ వంటగదిలో చూడడం చాలా ఆశక్తికరంగా ఉంది, ఇది దాని పరిసరాలతో వ్యతిరేక ప్రభావాన్ని, సమతుల్యాన్ని సృష్టించగలదు.
Image courtesy: తక్కువ స్ధలంలో వంటగది ద్వీపం
స్టోరేజ్ తో లాఫ్ట్ బెడ్
ఇబ్బందికరమైన స్ధలంతో కూడిన అపార్ట్మెంట్లు, మన చిన్న చిన్న గృహాలకు పుష్కలమైన స్టోరేజ్ కలిగిన లాఫ్ట్ బెడ్ అదనపు ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ బహుళ ప్రయోజనాలు కలిగిన ఫర్నిచర్ పీస్ ఎటువంటి లోపం లేనిదని మేము కనుగొన్నాము.
ఆ స్ధలం అస్తవ్యస్తంగా లేకుండా ఉండడానికి, అరలను పుస్తకాల అర లేదా బట్టలు, ఇతర వస్తువుల కోసం చిన్నచిన్న అరలుగా మార్చండి; పై భాగాన్ని ఓపెన్ గా వదిలేయండి. ఇది మీ పిల్లల బెడ్ రూమ్ లేదా స్టూడియో అపార్ట్ మెంట్ కి ఖచ్చితమైన జోడింపు.
Image courtesy: స్టోరేజ్ తో లాఫ్ట్ బెడ్
నిలువు వార్డ్రోబ్
స్ధలాన్ని రూపొందించేటపుడు మేము ఎదుర్కునే అత్యంత సాధారణ సమస్య స్టోరేజ్. ఇది చాలా క్లిష్టమైన, సవాలుతో కూడిన పనులలో ఒకటి, ముఖ్యంగా స్ధలం కొద్దిగా ఉన్నపుడు.
ఇరుకు స్టోరేజ్ లు, నేల నుండి సీలింగ్ చేసిన వార్డ్రోబ్ లు, క్యాబినేట్లు ప్రస్తుత ట్రెండ్. వాటిని దృష్టిలో పెట్టుకుని, బిజీగా ఉండే మా రోజువారీ జీవితానికి తగినట్లుగా ఈ ఆధునిక, రిఫైండ్, చెక్కతో చేసిన నిలువుగా ఉండే క్యాబినేట్లు ఓపెన్ షెల్వ్స్ తో కలిగిఉండడం మేము ఇష్టపడతాము.
స్టూడియో అపార్ట్ మెంట్ లో వాటిని చేర్చడం అనేది మంచి ఎంపిక. ఇవి ఖచ్చితంగా ఆ ప్రదేశానికి తక్కువ స్ధలంలో, సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి.
Image courtesy: నిలువు వార్డ్రోబ్