Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఇంటిని కాంతివంతంగా మార్చే ఈ దీపాల డిజైన్ గురించి తెలుసా..
ఇక ఈ దీపాల విషయానికొస్తే వీటి రూపకల్పన మరియు పెయింటింగ్ కళ కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.
దీపావళి అంటేనే దీపాల పండుగలా చాలా మంది భావిస్తారు. ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అలంకరించుకుంటారు. దీపావళి పండుగను మన దేశంలో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ ఇంటిని అందగా అలకరించి పూజలు చేయడం, చీకటి పడిన వేళ దీపాల కాంతితో వెలుగును ఇల్లంతా వ్యాపింపజేస్తారు. ఈ సందర్భంగా మట్టి పాత్రలతో తయారు చేసిన దీపాలను చాలా మంది వాడతారు. ఇక ఈ ఏడాది దీపావళి 27వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ పండుగ సమయంలో దీపాలను ప్రతి ఒక్కరూ చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఈ వేడుకలకు ఈ దీపాలు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.

కొన్ని ప్రాంతాల్లో రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు వచ్చిన సందర్భంగా ప్రజలు తమ విజయవంతమైన రాజు కోసం ఈ దీపాలను వెలిగించి స్వాగతం పలికారని పురాణాల్లో పేర్కొనబడింది. ఇంకొన్ని ప్రాంతాల్లో దుష్టశక్తుల నుండి బయటపడటానికి మరియు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు ప్రతి మూలలోనూ దీపాలను వెలిగిస్తారు.

ఇక ఈ దీపాల విషయానికొస్తే వీటి రూపకల్పన మరియు పెయింటింగ్ కళ కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. ప్రస్తుత ఆధునాతన కాలంలో ఎన్నో రకాల దీపాలు అందుబాటులో ఉన్నాయి. వీటి అలంకరణలకు కాంతులు తోడైతే ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీ ఇంట్లో సాధారణ దీపాలను కలిగి ఉంటే ఈ దీపావళి పండుకు ఇంట్లో ఉన్న పాత దీపాలకే కాస్త మంచి కలర్ వేసి అందంగా అలంకరించవచ్చు. మీకు అంత సమయం లేకపోతే మార్కెట్లో లభించే రంగు రంగుల దీపాలను కొనుగోలు చేసి మీ ఇంటి అలంకరణలకు బాగా ఉపయోగించుకోవచ్చు. వాటిలో కొన్ని రకాల దీపాల అలంకరణలు మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు ఏది నచ్చితే ఆ దీపాలంకరణను ప్రయత్నించండి. లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి స్వాగతించండి.

గ్రీన్ పెయింటెడ్ దీపాలు..
ఇవి ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి. దీనిపై పసుపు మరియు పింక్ పెయింట్ మరింత కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.

సాధారణ దీపాలు..
మీరు మీ పూజ గదిలో కలర్ ఫుల్ దీపాలను వాడకూడదు అనుకుంటే, మీరు సాధారణంగా ఉండే గోధుమ రంగులో దీపాలను ఎంచుకోవచ్చు.

ఆకు ఆకారంలో..
సాదా ముదురు గోధుమ రంగులో ఉండే ఈ దీపాలు ఆకు ఆకారంలో ఉంటాయి. ఇవి చాలా సరళంగా మరియు పవిత్రంగా కనిపిస్తాయి. ఆకులు పవిత్ర ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఈ డిజైన్ ను ప్రయత్నిస్తే కొంచెం కొత్తగా ఉంటుంది.

శంఖం ఆకారంలో..
ఈ శంఖం ఆకారంలో ఉన్న దీపాలు ఈ దీపావళి పండుగకు అందరినీ ఆకర్షించే డిజైన్ అని చెప్పొచ్చు. హిందూ మతంలో శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఈ దీపావళి పండుగకు పూజా గది అలంకరణలకు ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది.

జంట దీపాలు..
ఈ దీపాలు జంటగా రూపొందించబడతాయి. వీటి వల్ల ఎక్కువ కాంతి మరియు ప్రకాశవంతంగా అనిపిస్తుంది.

కలర్ ఫుల్ దీపాలు..
ఈ రకమైన దీపాలు కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. వీటిని వివిధ రంగులతో రూపొందించడం వల్ల వీటి నుండి కాంతి ప్రకాశవంతమై ఇవి ఏకంగా ఎల్ ఇడి ప్రభావాన్ని ఇస్తాయి.

లక్ష్మీ గణేశుడి ఆకారం..
ఈ ఆకారంలో గణేశుడిని, లక్ష్మీని ఆరాధించి వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది.

కమలం ఆకారంలో..
కమలం పువ్వు లాగా వికసించే ఆకారంలో ఈ దీపం రూపొందించబడి ఉంది. ఈ దీపంలో మధ్యలో ఒక చిన్న దీపం ఉంటుంది. దానిని నూనెతో నింపి వెలిగించవచ్చు.

బహుళ ముఖ దీపాలు..
ఈ దీపావళికి వినూత్న దీపాల డిజైన్లలో ఇది ఒకటి. మీరు ఒకే దీపంలో ఐదు పూల ఆకారంలో ఉన్న ప్రమిదలను వెలగించవచ్చు.

గణేశుడి రూపంలోనూ..
లేత గోధుమ రంగులో ఉండే ఈ దీపంలో గణేశుడి రూపం చాలా కాంతివంతంగా మరియు అందంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications