For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2020 : ఈ దీపావళికి మీ ఇంటిని ఎలా డెకరేట్ చేయాలో చూసెయ్యండి...

|

కరోనా వంటి మహమ్మారి కాలంలోనూ ఇటీవలే నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. మరికొద్ది గంటల్లో దీపావళి పండుగ కూడా ప్రారంభమవుతోంది. ఈ పండుగ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా దీపాల వెలుగుల్లో.. టపాకాయాలను కాలుస్తూ జరుపుకుంటారు. ప్రస్తుతం (కరోనా సమయంలోనూ) మన దేశంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ పండుగ సందర్భంగా చాలా మంది హిందువులు, తమ ఇళ్లను శుభ్రపరచుకుని.. ఇంటికి అవసరమైన అన్ని వస్తువుల కోసం షాపింగ్ చేస్తుంటారు. అలాగే కొత్త బట్టలను కొంటూ ఉంటారు. రకరకాల స్వీట్లను చేసి పంచుకుంటారు. ఈ దీపావళి 2020 సంవత్సరంలో నవంబర్ 14వ తేదీన వచ్చింది. ఇదే రోజున బాలల దినోత్సవం కూడా.

అయితే ఈ దీపావళికి సంబంధించి అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే డెకరేషన్. ఈ పండుగ సమయంలో చాలా మంది ఇళ్లు దీపాలతో, విద్యుత్ అలంకరణతో వెలిగిపోతుంటాయి. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకమైన డిజైన్ల డెకరేషన్లు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో మీ ఇంటికి ఎలాంటి డెకరేషన్ బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం కొన్ని డెకరేషన్లు ఐడియాలను తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని చూడండి.. మీ ఇంటికి అందరికంటే అద్భుతంగా అలంకరించుకోండి...

ధంతేరాస్ 2020 : ధనత్రయోదశి రోజున బంగారం కొనొచ్చా.. లేదా..?ధంతేరాస్ 2020 : ధనత్రయోదశి రోజున బంగారం కొనొచ్చా.. లేదా..?

టోరన్స్..

టోరన్స్..

దీపావళి సందర్భంగా ప్రసిద్ధ అలంకార వస్తువులు టోరన్స్. వీటినే బాంధన్వర్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ఇంటి ఎంట్రెన్స్ వద్ద ఉంచుతారు. వీటి నుండి వచ్చే వెలుగుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేందుకు ఆకర్షితురాలు అవుతుందని చాలా మంది నమ్ముతారు. చేతితో మరియు ఎంబ్రాయిడరీ వంటి విభిన్న రంగులు మరియు డిజైన్లలో మార్కెట్లో వివిధ రకాల టోరన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ డెకరేషన్ బట్టి ఒక్కోదాన్ని ఎంచుకోవచ్చు.

లాంతరు దీపాలు..

లాంతరు దీపాలు..

ఈ దీపావళికి మీ ఇల్లు మరింత వెలిగిపోవాలంటే.. మీరు లాంతరు దీపాలను ప్రయత్నించొచ్చు. ఇవి మీ ఇంటికి పండుగ సమయంలో మంచి లుక్ ఇస్తాయి. హై ఎండ్ స్టోర్స్ మరియు రోడ్ సైడ్ రెండింటిలో మీరు వాటిలో చాలా విభిన్నమైన డిజైన్లను సెలెక్ట్ చేసుకోండి. మీరు గార్డెన్ లేదా రూఫ్-టాప్ హౌస్ పార్టీని నిర్వహించాలని ఆలోచిస్తుంటే, ఇవి సరైన పండుగ వాతావరణాన్ని అందిస్తాయి.

దీపాల వెలుగులు..

దీపాల వెలుగులు..

దీపావళి సందర్భంగా అలంకరించే వస్తువులలో అతి ముఖ్యమైనవి దీపాలు. వీటి గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలాంటి దీపాలను వాడేటప్పుడు మట్టి దీపాలు చాలా మంచిగా ఉంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ లైట్లు, దీపాలు ఎన్ని వచ్చినప్పటికీ, చేతితో తయారు చేసిన దీపాల వెలుగు చాలా అందంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ దీపాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని, దీని వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చాలా మంది నమ్మకం.

దీపావళికి ముందే మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను పడేయండి...దీపావళికి ముందే మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను పడేయండి...

రంగోలి..

రంగోలి..

దీపావళి సందర్భంగా చాలా మంది తమ ఇళ్ల ముందు రంగోలి(రంగు రంగుల ముగ్గులు) వేస్తుంటారు. అయితే ఈ పండుగ సమయంలో సాయంకాలం సంధ్య వేళలో మంచి ముగ్గులను వేసి.. వాటి చుట్టూ దీపాలను పెట్టండి. ఇలా చేస్తే దేవళ్లు ఆకర్షితులవుతారట. ఇందుకోసం మీరు ఆన్ లైన్ లో కొన్ని రకాల డిజైన్లను అన్వేషించండి. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి.

పోట్ పౌరి..

పోట్ పౌరి..

ఈ పండుగ సమయంలో చాలా మంది దీన్ని ఎందుకు వాడతారనే ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది మన కళ్లకు ఆనందం కలిగించడమే కాదు.. మన ఇల్లు దైవిక వాసనకు కూడా సహాయపడతాయి. మీరు వ్యూహాత్మకంగా ఉంచిన పౌట్ పౌరి గిన్నెలు ఈ పండుగ కాలంలో మీ డెకరేషన్ కు ఆధునిక రూపాన్ని ఇస్తాయి.

ప్రధాన ద్వారం వద్ద..

ప్రధాన ద్వారం వద్ద..

ఈ దీపావళికి మీ ఇల్లు ఆకర్షణీయంగా కనబడాలంటే.. ముందుగా చేయాల్సింది ప్రధాన ద్వారం వద్ద అలంకరణ. ఈ పండుగ సందర్భంగా మీ ప్రధాన ద్వారం అందమైన ముగ్గును వేయండి. వాటి మధ్యలో మరియు వాటి చుట్టూ మట్టి దీపాలను వెలిగించి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది.

ప్రధాన ద్వారం వద్ద..

ప్రధాన ద్వారం వద్ద..

ఈ దీపావళి పండుగ సమయంలో మీ ఇంట్లో ఈ కరమైన దీపాలను అలంకరణకు ఉపయోగిస్తే మీ ఇంటికి అదనపు లుక్ వస్తుంది. మీ ఇంటికి పెద్ద కిటికీలు ఉంటే, మీ దీపాలను చిన్నగా ఉన్న వాటి నుండి పెద్ద వాటిని ఒక వరుస క్రమంలో అలంకరించండి. లేదా మీ ఈ రకమైన దీపాలను సమానంగా ఉండే వాటిని కొనుగోలు కూడా చేయొచ్చు. ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి.

English summary

Diwali decorations ideas in telugu

The most important part of the festival though is decorating the homes. Homes are cleaned prior to the Lakshmi pooja, as Goddess Lakshmi is said to enter the cleanest home first. Here are the amazing diwali decoration ideas to try at home.
Story first published: Tuesday, November 10, 2020, 16:23 [IST]