For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rangoli Designs for New Year 2022:కొత్త ఏడాది వేళ ఈ ముగ్గులు మీ ఇంటికి పండుగ శోభను తీసుకొస్తాయి...

హ్యాపీ న్యూ ఇయర్ 2022 సందర్భంగా ఈ సింపుల్ ముగ్గులను ట్రై చేయండి.. మీ ఇంటికి పండుగ శోభ తెచ్చుకోండి.

|

మన దేశంలో ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు బియ్యప్పిండితో ముగ్గులు వేయడం అనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొందరు ముందు రోజు రాత్రి వేళలోనే ఇంటి ముందు శుభ్రం చేసుకుని, ముగ్గులు వేయడం వంటివి చేస్తుంటారు.

Rangoli Designs for New Year 2022: Simple Happy New Year Rangoli Designs in Telugu

ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే ముగ్గు వేసేందుకు నిద్ర లేచి ఇంటిని, ఇంటి ముందు మొత్తాన్ని శుభ్రం చేసి, చీపురుతో మొత్తం ఊడ్చేసి, కల్లాపి చల్లిన తర్వాత ముగ్గులు వేయడం వల్ల మీ బాడీకి మంచి ఎక్సర్ సైజులా పని చేస్తుందని చెబుతున్నారు.

Rangoli Designs for New Year 2022: Simple Happy New Year Rangoli Designs in Telugu

అంతేకాదు పొద్దున్నే నిద్ర లేవడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల హెల్దీగా ఉండొచ్చు. ఇదిలా ఉండగా.. మరి కొద్ది గంటల్లో రాబోతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తుంటారు. దీంతో ఇంటి ముంగిట పండుగ శోభ సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా 'హ్యాపీ న్యూ ఇయర్' సందర్భంగా ఎలాంటి ముగ్గులు వేయాలి.. ముగ్గుల్లో ముఖ్యమైన రకాలెన్ని అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చుక్కల ముగ్గులు..

చుక్కల ముగ్గులు..

ముగ్గులు కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ ఇళ్ల ముందు ముగ్గులు వేస్తుంటారు. కర్నాటకలో ముగ్గును రంగవల్లి అంటారు.. తమిళనాడులో కోళం అని, కేరళలో విడల్ అని, గుజరాత్ లో సథియా అని, మధ్యప్రదేశ్ లో చౌక పూర్ణ అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఇంటి ముందు వేసే ముగ్గుల్లో చుక్కల ముగ్గులు చాలా ముఖ్యమైనవి. వీటిలో మూడు రకాలున్నాయి. అవి 1.ట్రెడిషనల్ 2.మెలిక ముగ్గు, 3. పిండితో వేసే ముగ్గు

ట్రెడిషనల్ ముగ్గు..

ట్రెడిషనల్ ముగ్గు..

ఈ రకమైన ముగ్గు పెట్టడానికి ముందుగా చుక్కలను వరుసగా పెట్టి వాటిని కలుపుకుంటూ పోతారు. వీటిలో పూలు, జంతువులు, రకరకాల వస్తువులు వచ్చేలా ముగ్గు వేస్తుంటారు. ముఖ్యంగా ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ‘హ్యాపీ న్యూ ఇయర్' అర్థం వచ్చేలా ముగ్గులు వేస్తుంటారు. మెలిక ముగ్గు అంటే ఈ ముగ్గును వంపులు తిప్పుతూ వేస్తారు. అదే సమయంలో మరికొన్ని చుక్కలను మధ్యలో వేస్తూ ఉంటారు. పండుగల సమయంలో పిండితోనే ముగ్గును వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ముగ్గులను చుక్కల నంబర్లను బట్టి వివరిస్తారు. 21 చుక్కల ముగ్గు, ఆరు చుక్కల ముగ్గు.. చుక్క విడి చుక్క.. మధ్య చుక్క అంటూ ఈ ముగ్గును వివరిస్తుంటారు.

నేరుగా డిజైన్లు..

నేరుగా డిజైన్లు..

మనలో చాలా మంది ముగ్గుల్లో చుక్కలను పెట్టి వాటిని కలుపుతూ వేస్తుంటారు. అయితే అవేవీ లేకుండా కేవలం డిజైన్ నేరుగా వేస్తూ వేసే ముగ్గునే డిజైన్ ముగ్గు అంటారు. ఇలాంటి డిజైన్ మధ్యలో కూడా వేసుకుని కలర్లు నింపుకోవచ్చు.

పండుగ ముగ్గులు..

పండుగ ముగ్గులు..

సాధారణంగా ప్రతిరోజూ వేసే ముగ్గులకు పండుగ వేళ వేసే ముగ్గులకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి వేళ అదిరపోయే డిజైన్లతో ముగ్గులు వేస్తారు. అలాగే దీపావళి వేళ దీపాల ముగ్గులతో, పూల ముగ్గులతో పాటు ధనుర్మాసంలో వేసే ముగ్గులు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

English summary

Rangoli Designs for New Year 2022: Simple 'Happy New Year' Rangoli Designs in Telugu

Here we are discussing about the rangoli designs for new year 2022:simple 'Happy New Year' Rangoli designs in Telugu. Have a look
Story first published:Thursday, December 30, 2021, 17:41 [IST]
Desktop Bottom Promotion