For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచడానికి వాస్తు చిట్కాలు

|

ప్రస్తుత ఆధునిక యుగంలో మన ఆరోగ్యం లేదా సంబంధాల వైఫల్యాలకు కారణాలు తెలుసుకోవడానికి వాటి గురించి విశ్లేషించడానికి మనకు సమయం ఉండదు. ఈ సమస్యలు చాలా వరకు వాస్తు మరియు ఫెంగ్షుయ్ లోపాలతో సంబంధం కలిగి ఉంటాయి.

సంపద, ఆరోగ్యం, కెరీర్, విద్య, వివాహం మరియు సంబంధాల విషయంలో ఇంటి యొక్క వాస్తు కీలక పాత్రను పోషిస్తుంది. మనం మన ఇంటిలో అత్యధిక సమయం గడుపుతాం, మరియు ఇంటిలో ఉండే సానుకూల శక్తి లేదా వ్యతిరేక శక్తి మీ దేహంలో ప్రతిధ్వనిస్తుంది, తద్వారా ఇది సానుకూల లేదా వ్యతిరేకమార్గంలో మీ దేహం మరియు ఆత్మపై ప్రభావం చూపుతుంది. ఇది మానసికంగా మరియు శారీరకంగా ప్రభావం చూపుతుంది మరియు సంవృద్ధికి లేదా సమస్యలకు దారితీయవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి వద్ద సానుకూల శక్తిని సృష్టించడం కొరకు ప్రతి ఒక్కరూ నిర్ధిష్ట విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి...

ఇంటి దిశ:

ఇంటి దిశ:

ఇంటి దిశను కనుగొనే ముందు దిక్సూచిని అరచేతిలో పట్టుకుని నట్టింట నిలబడండి. ఇంటి ముఖద్వారమే ఇంటికి నోరంట శక్తిని తీసుకొస్తుంది. లేదంటే చాలా కష్టాలను మరియు దురదృష్టాలను తెస్తుంది. అందువల్ల మీ ఇంటి ప్రధాన ద్వారం తలుపులు దక్షిణం లేదా పడమర దిక్కులో ఉంటే ఇంటి వెలిపలి భాగంలో హనుమంతుడి ఫోటోలు ఉంచడం ద్వారా మార్పులు మీరే చూడండి.

దేవుడి గది:

దేవుడి గది:

దేవుడి గది లేదా పూజా మందిరం అన్ని వాస్తు నియమాలకు రాజువంటిది. కాబట్టి ఈ గది ఈశాన్య దిక్కులో ఉండేట్లు చూసుకోండి. దాని వల్ల మీరు కొరుకున్న ప్రతీదీ నెరవేరుతుంది. కాబట్టి మీరు పూజించేటప్పుడు దేవుడికి పూర్వాభిముఖంగా కూర్చొని ప్రార్థించండి.

వంటగది:

వంటగది:

వంటగది శ్రేయస్సు మంచి చిహ్నం. కాబట్టి వంటగది ఆగ్నేయ దిక్కులో ఉండాలి. వంటగది ఉత్తరం లేదా ఈశాన్యంలో లేకపోతే, అది ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇటువంటి సందర్భంలో, మూడు వెండి గిన్నెలను తలక్రిందులుగా సీలింగ్ పైకప్పుపై వేలాడదీయండి. అయితే నేరుగా స్టవ్‌పై వేలాడదీయకండి.

బెడ్ రూమ్

బెడ్ రూమ్

పడకగది స్థిరత్వాన్ని కాపాడుతుంది, కాబట్టి ఆ గది తలుపులు నైరుతి దిక్కు ఉండాలి మరియు మీరు దక్షిణముఖంగా లేదా పడమరమ వైపు తల పెట్టి నిద్రించాలి. అయితే ఇంటి యజమాని ఏ కారణం చేతనైనా ఈశాన్యంగా తల పెట్టి పడుకోకూడదు.

స్నానపు గదులు మరియు టాయిలెట్స్

స్నానపు గదులు మరియు టాయిలెట్స్

స్నానాలు మరియు మరుగుదొడ్లు కష్టాలను తెచ్చే శక్తిని కలిగి ఉన్న ప్రదేశాలు కనుక ఇవి పడమర లేదా దక్షిణం వైపున ఉండాలి. ఇవి ఏ కారణం చేతనైనా ఉత్తర లేదా ఈశాన్య దిక్కులో ఎట్టిపరిస్థితితుల్లో ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల ఆర్థిక, ఆరోగ్యం మరియు విద్యా సమస్యలను తెస్తుంది.

జీరో వాట్ బ్లూ బల్బ్ ఉపయోగించాలి

జీరో వాట్ బ్లూ బల్బ్ ఉపయోగించాలి

మీ ఇంటి కేంద్ర స్థానం మీ శరీరంలోని ముక్కుతో సమానం. ఇది శ్వాసను సులభతరం చేయడానికి స్వేచ్ఛగా మరియు అయోమయ రహితంగా ఉండాలి. కేంద్రస్థలం గోడ కడుపు మరియు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి జీరోవాట్ బ్లూ బల్బును ఈ గోడకు ఉంచి 24X7అంతసేపు ఆరిపోకుండా అలాగే లైటు వేసి ఉంచాలి.

కొన్ని సాధారణ పరిష్కారాలు

కొన్ని సాధారణ పరిష్కారాలు

ముఖ్యంగా నైరుతి, ఈశాన్య మరియు ఆగ్నేయంలో, ఇంటి ఏదైనా దిశను తగ్గించినా లేదా అస్థిరపరిచినా ఇది తీవ్రమైన సమస్యను కలిగిస్తుంది. దాని పరిష్కారానికి చాలా రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు పరిష్కారాలను పరిశీలిద్దాం.

ఎరుపు మరియు ఊదా రంగులను ఉపయోగించవద్దు.

ఎరుపు మరియు ఊదా రంగులను ఉపయోగించవద్దు.

మీ ఇంటిని అలంకరించడానికి చాలా ప్రకాశవంతమైన ఎరుపు మరియు ఊదా రంగులను ఉపయోగించవద్దు. ఇది మీలో అనారోగ్యానికి కారణమయ్యే శక్తిని పెంచుతుంది. మీ పడకగదిలో నీటి చిత్రాలు లేదా ఫౌంటైన్లను ఉంచవద్దు. ఇది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

English summary

Ways to increase positivity in home

In the present complex scenario, we do not find time for ourselves to analyse the various reasons that lead us to failures in health, wealth or relationships. Most of these problems are connected to major Vastu and Feng Shui defects. Here are the lists some commandments which may help you to increase positive energy in your home:
Story first published: Tuesday, September 10, 2019, 17:49 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more