Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మట్టి లేకుండా మొక్కలను పెంచటం ఎలా?

1. హైడ్రోపోనిక్ తోట పెంపకంలో మొదటగా మీరు ఏ రకమైన మొక్కలు పెంచదలచారు. ఎన్ని పెంచదలచారనేది నిర్ణయించుకోవాలి. మీ గార్డెన్ ను ఇంట్లోను లేదా బయట కూడా పెంచవచ్చు.
2. హైడ్రోపోనిక్ గార్డెనింగ్ లో అవసరమైన వస్తువులు, అంటే నీటి గొట్టాలు, గాలి, నీటి పంపులు, డ్రమ్ములు మొదలైనవి సేకరించండి.
3. మొక్కలకవసరమైన పోషకాలను నీటిలో కరిగించండి. వీటిని తయారీ దారులనుండి మీరు పొందవచ్చు.
4. మొక్క టైపును బట్టి గొట్టాలకు సమానంగా రంధ్రాలు వేయండి.
5. పాతేటటువంటి మొక్కలకు వున్న మట్టిని పూర్తిగా తీసేయండి.
6. మొక్కలను అతి జాగ్రత్తగా నీటిలో వుంచండి.
7. ఎపుడవసరమనుకుంటే అపుడు నీరు పెట్టండి. నీటిలోని పోషక ద్రవాన్ని పరీక్షించటానికి ఒక పిహెచ్ టెస్టర్ మరియు సిఎఫ్ మీటర్ కొనండి.
8. మీ మొక్కలకు మంచి సూర్యరశ్మి, ధారాళమైన గాలి తగిలేలా చూడండి. క్రమం తప్పకుండా మొక్కల వేళ్ళు గమనిస్తూండండి. పురుగులు దరిదాపులకు చేరకుండా చూడండి.
9. ఒక సారి కూరగాయలు పెరిగితే, వాటిని కోసేయండి.
10. తర్వాత కాపర్ మరియు పెరాక్సైడ్ ద్రావణాలు వేసి పూర్తిగా గొట్టాలను శుభ్రపరచండి. మరోమారు పైరీతిలో మొక్కలు పెంచేందుకు సిద్ధంకండి.
మీ హైడ్రోపోనిక్ గార్డెన్ మొదలుపెట్టేముందు, అందులోని మొక్కలను సంరక్షించచేందుకుగాను అవసరమైన శక్తి, సమయం మీలో వుండేలా చూసుకోండి. హైడ్రోపోనిక్ గార్డెన్ కు మీరు తీసుకునే జాగ్రత్తలే అత్యంత ప్రధానమైనవని గుర్తించండి.



Click it and Unblock the Notifications