For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గార్డెన్ లోని పచ్చటి లాన్ ఎండిపోతుంటే?

By B N Sharma
|

Lawn
గార్డెన్ అనే సరికి పచ్చటి మొక్కలు, రంగు రంగుల పూలు కలిగి చూసేందుకు ఆనందం కలిగిస్తాయి. రంగురంగుల పూల మొక్కలు, లేదా కిచెన్ గార్డెన్ వంటివి ఎన్ని వున్నప్పటికి, గార్డెన్ లో కొంత సమయం గడపాలంటే పచ్చటి లాన్ నిర్వహించాలి. మొక్కల కు మధ్య ఖాళీ స్ధలాలలో, కాలిబాటల కిరుపక్కలా పచ్చటి లాన్ మెయింటెయిన్ చేస్తే ఆహ్లాదంగా వుండి, కాలికి మెత్తగా కార్పెట్ లా తగులుతూ హాయి గొల్పుతుంది. అయితే, వేసవి వచ్చినా లేక, కొద్దిపాటి ఎండలు ముదిరినా, కొన్ని ప్రాంతాలలో పచ్చటి ఈ లాన్ ఎండిపోతూంటుంది.

లాన్ ఎండకుండా...వుండాలంటే...కనీసం వారానికొకసారి ఒక అంగుళం వరకు పారేటట్లు నీటిని పెట్టాలి. వర్షాకాలంలో అయితే, ఎప్పటికపుడు లాన్ లో తేమ వుందా లేదా అనేది పరిశీలిస్తూండండి. మీ లాన్ భాగంలో తేమ వుందా లేదా అని పరిశీలించటానికి ఆ భాగంపై ఒక సారి మీరు నడిస్తే తెలిసిపోతుంది.

మీరు నడిచిన తర్వాత లాన్ పై మీ పాదాల అడుగులు పడితే, ఆ ప్రాంతం నీరు లేక పొడిగా వుందని, దానికి నీరు అవసరమని భావించాలి. ఎప్పటికపుడు నేలలో తేమ వుండే రీతిలో తగిన నీరు పెడుతూ తగు మాత్రంగా కటింగ్ చేస్తూ వుంటే లాన్ పచ్చగా వుండి బాగుంటుంది.

English summary

Is Your Garden Lawn Dry?

Lawns need up to an inch of water each week to do well. If it doesn't rain a lot in your area, you'll have to water.If your lawn shows footprints after you walk across it, it's dry and needs water. A good way to see if you lawn needs water - walk across it.
Story first published:Saturday, November 26, 2011, 11:30 [IST]
Desktop Bottom Promotion