For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీరు తక్కువైనా పచ్చదనం అధికమే!

By B N Sharma
|

Low
నగరాల్లో నీటి సమస్య. నీరు మనుషుల వాడకానికే చాలటం లేదు. ఇక ప్రేమగా పెంచే మొక్కలకు లేదంటే కష్టమే. అందుకని నీరు అధికంగా లేకపోయినా మీ అపార్టుమెంటుల్లో పచ్చగా పెరిగే మొక్కలు పరిశీలిద్దాం.

1. బ్రొమెలియాడ్ - మొక్క చాలా ఆకర్షణీయం. సూర్యరశ్మి పరోక్షంగా వుంటే చాలు. నీడలో పెంచితే నీరు ఆవిరికాదు. రెండువారాలకోసారి నీరు పెడితే చాలు బాగా ఎదుగుతూంటుంది.
2. కాక్టస్ - వీటిలో లివింగ్ రాక్, రేట్స్ టెయిల్, బిషప్ కేప్ మొక్కలు తక్కువ నీటితో పచ్చగా వుంటాయి. ఇంటిలోపల లేదా బయట పెంచవచ్చు. వారాల తరబడి నీరు లేకున్నా బాగానే ఎదుగుతాయి.
3. స్పైడర్ మొక్కలు - ఇవి వేలాడే మొక్కలు. తెలుపు, ఆకుపచ్చ గీతలతో వుంటాయి. నీరు అతి తక్కువ కోరతాయి. మట్టి కూడా పెద్దగా అవసరం లేదు. డబ్బాలలో పెంచవచ్చు. అతి తక్కువ ఎండ వుంటే చాలు.
4. మడగాస్కర్ డ్రాగన్ ట్రీ - ఇది కాక్టి మొక్కవలే వుంటుంది. వారాల తరబడి నీరు పోయకపోయినా బతుకుతుంది. అయితే మట్టి బాగా లూజుగా వుండాలి. నేలలో లేదా కుండీలలో పెంచవచ్చు.

English summary

Low Watering Plants For Apartment Garden

With water being the biggest threat in most of the metro cities, where to accommodate plants? But being the Eco friendly and pure air lovers, we need to some how have an indoor garden in our apartment or individual house. Take a look to the top 5 low watering plants.
Story first published:Monday, October 31, 2011, 17:44 [IST]
Desktop Bottom Promotion