For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిటిలో పెంచే నాలుగు ఔషద మొక్కలు...

|

Four good Herbal plants in Kitchen Garden...
ఇంటి పట్టున కుండీల్లో, మడుల్లో, రకరకాల కంటెయినర్లలో కూరగాయలు, ఆకుకూరలను రసాయన ఎరువులు వాడకుండా సాగుచేసుకోవడం ద్వారా ఆరోగ్యదాయకంగా సమతుల ఆహారం తీసుకోచ్చు. అదేవిధంగా ‘ఇంటి పంట’లతో పాటు ‘ఇంటి వైద్యం’ కోసం.. కొన్ని ముఖ్యమైన ఔషధ మొక్కలను సైతం ఇంటిపట్టునే పెంచుకోవచ్చు.

మనదేశంలో వేలల్లో ఔషద మొక్కలు ఉన్నాయి. ప్రస్తుతం పల్లెలు..పట్టణాల్లోనే కాకా నగారల్లోనూ ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వైద్యులు 90 శాతం ఔషధ మొక్కలపైనే ఆధారపడుతున్నారు. అల్లోపతి, హోమియో వైద్యంలోనూ ఎక్కువగా ఔషధ మొక్కలను వినియోగిస్తున్నారు. ఆధునిక ఔషధాలు, సౌందర్య సాధనాలు, హెల్త్ సప్లిమెంట్స్‌లో రసాయనాలు, సింథటిక్స్‌ను వినియోగిస్తుండడం వల్ల కలుగుతున్న దుష్ర్పభావాలను గ్రహిస్తున్న పాశ్చాత్య దేశీయులు సైతం ఔషధ మొక్కల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు.

ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉండే మొక్కలను, పోపు డబ్బాలో అందుబాటులో ఉండే దినుసులను. సముచిత రీతిలో వినియోగించుకుంటే.. సాధారణ ఆరోగ్య సమస్యల్లో 90 శాతం మేరకు రాకుండా చూసుకోవచ్చు. ఔషద మొక్కలు పెరటి మొక్కలు గా పెంచడంవల్ల వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. తులసి, వేప, ఉసిరి, అల్లనేరేడు, కలబంధ, పసుపు, గన్నేరు, అల్లనేరేడు వివిధ రకాల ఔషద మొక్కలను ఇంట్లోనే పెంచుకోవచ్చు.

తులసి: పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని మన బామ్మలు చెప్పిన మాటలను అక్షర సత్యాలనవచ్చు. ఎందుకంటే తులసిలో ఉండే ఔషద గుణాలు సకల రోగాలను నివారిస్తాయి కాబట్టి. ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు.

మునక్కాయతో చేసిన ఏ వంటకమైన చాలా మందికి ఇష్టం. ఇవి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి మంచిది అందుకే ఎక్కువగా తింటుంటారు. అయితే మునగ కాయలతో పాటు ఆకుతో కూరలు చేస్తారన్నసంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు,మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. ఆహారంగానే కాకుండా అనేక రుగ్మతలకు దివ్యపధంగా పనికొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో మునగాకు శరీరానికి మేలుచేస్తుంది.

ఎన్నో ఔషద గుణాలు కలిగిన చామంతి పువ్వుకు పుట్టినిల్లు మన ఆసియా ఖండమేనట. తెలుగువారికి ఈ పువ్వు ‘చామంతి’గా పరిచయం. చామంతి ఆకులను జలుబు వంటి వ్యాధుల నివారణకు వినియోగిస్తూ వుంటారు. చామంతి పువ్వు రేకులతో చామంతి టీ తయారు చేస్తారు. ఇంకా రకరాకాల ఔషదాల్లో చామంతిని విరివిగా వినియోగిస్తున్నారు.

English summary

Four good Herbal plants in Kitchen Garden... | పెరటి మొక్కలతో ఆరోగ్యం...

Many herbs (and vegetables, and fruits, and even some decorative plants) that are commonly grown in kitchen gardens have useful medicinal properties. They can cure stomachaches and stress and everything in between, and you've probably got them growing already.
Story first published:Tuesday, March 13, 2012, 17:08 [IST]
Desktop Bottom Promotion