For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటికి....ఇంటికీ...మేలు చేసే పెరటి కూరలు...!

|

Growing Vegetables in Terrace Garden.
పట్టణాలు, నగరాలల్లో ఇప్పుడు అమ్మబడుతున్న కూరగాయలు, ఆకుకూరల్లో రసాయనిక ఎరువు మోతాదు ఎక్కువగా కనిపిస్తుంది. రసాయనిక ఎరువులను వాటడం వల్ల కూరగాలయ రంగు, రుచి, ఆకారాల్లో చాలా మార్పులు సంతరించుకొంటున్నాయి. అందుకనే మనం ఇంటి దగ్గర చిన్న పెరడు ఏర్పాటు చేసుకొన్నట్లైతే కుంటుంబానికి అవసరమైయ్యే మొత్తం కూరగాయలను మనమే పండిచకోవచ్చు.. ఉన్నంతలో ఎవరికి వారు ఇంటి మేడమీద గానీ, పెరట్లో గానీ ఆకుకూరలు, కూరగాయలు పండించుకునే ప్రయత్నం చేయడం ఆరోగ్యకరం.

ఇంటి దగ్గర పంటల సాగును మొదలు పెట్టడానికి జూన్ నెల సరైన సమయం. పెరటి పెరట్లో, ఇంటి చుట్టూ ఉండే ఖాళీలో కుండీల్లో, మేడ మీద కుండీల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మడుల్లో పెద్ద శ్రమ లేకుండానే కూరగాయలు పెంచుకోవచ్చు. కొత్తగా కూరగాయలు, ఆకుకూరలు పెంపకం ప్రారంభించే వారు కొంచెం శ్రద్ధతో ప్రణాళిక ప్రకారం మొక్కలు వేసుకుంటే ఏడాది అంతా కూరగాయలు, ఆకుకూరలు అందుబాటులో ఉంటాయి.

ఇంటి దగ్గర పెంచుకొనే ఆకుకూరలు, కూరగాయల మొక్కలకు ఎరువుగా ఎర్రమట్టి, ఆకు ఎరువు లేదా వర్మీ కంపోస్టు సమపాళ్లలో కలుపుకొని వాడొచ్చు. జూన్ నెలలో వర్షాలకాలం ప్రారంభమౌతుంది కాబట్టి దాదాపు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పెంపకం మొదలు పెట్టవచ్చు. వర్షం పడటం వల్ల మొక్కలకు నీరు పట్టాల్సిన అవసరం ఉండదు.

వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, అలసందలు(బొబ్బర్లు), గోరుచిక్కుడు, పాలకూర, తోటకూర, గోంగూర... తదితర కూరగాయ మొక్కలు సాగుచేయవచ్చు. వంగ, టమాటా, మిరప రెండు నెలల్లో కాపుకొచ్చి మూడు నెలలు వరకూ కాపుకాస్తాయి. ఇవి వేసిన కుండీలు, మడుల్లో ఆ తర్వాత వేరే పంటలు వేసుకోవడం ఉత్తమం. క్రమం తప్పకుండా కూరగాయలు పొందాలంటే 45 రోజులకోసారి కొన్ని కొత్త మొక్కలు నాటుకుంటూ ఉండాలి. ముందు నాటిన మొక్కలు కాపు పూర్తయ్యేటప్పటికి ఈ మొక్కలు కాపుకొస్తాయి. ఆకుకూరలైతే నెలరోజులకు కోతకొస్తాయి. తర్వాత నెల రోజుల వరకూ ఆకులు కోసుకుంటూ ఉండొచ్చు. మెంతికూర వారం, పది రోజుల్లోనే కోతకొస్తుంది. కాబట్టి మొక్కలకు సరైన సమయంలో తగిన పోషకాలు ఇవ్వడం, తగుమాత్రంగా నీరు అందించడం అవసరం.

English summary

Growing Vegetables in Terrace Garden...! | తింటే వదలరు బాబోయ్....!

The set-up costs of terrace gardening depend on whether you want to start step-by-step or all at once. Now we have come out with another alternative that is growing in boxes, using only compost, wormi-compost and coir pith. It reduces the weight. This is sort of square-foot gardening taken to the roof tops.
Story first published:Tuesday, February 14, 2012, 16:36 [IST]
Desktop Bottom Promotion