Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
కిచెన్ గార్డెన్ కు కుండీల ఎంపిక..నాణ్యమైన పంట...

మొక్కలు పెంచుకోవడం లో ఇంట్లో ఏ ఒక్కరికి శ్రద్ద ఉన్నా సరి పెరట్లో పచ్చదం అలరాడాల్సిందే.. ఇష్టమైన పని కష్టం తేలికగా చేసేసుకోవచ్చు. కిచెన్ గార్డెన్ పెంపకం కూడా అంతే..! ఇష్టం..సాధించాలన్న పట్టుదల ఉంటే.. పాత ప్లాస్టిక్ డబ్బానో కుండీగా మార్చేయవచ్చు.పెట్రోలు ధరలు, కూరగాయల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో తెలియనిది కాదు. భారీ ప్రణాళికలు, భారీ ఖర్చు అవసరం లేదు. ఏదో ఒక పాత డబ్బా, పాత బక్కెట్.. మట్టిదో సిమెంటుదో కుండీ చూసుకొని కొంచెం మట్టిలో కొంచెం కంపోస్టు, కొద్దిగా ఇసుక కలిపి పోసి నాలుగు విత్తనాలు చల్లండి.. చాలు.. మీ ఇంట్లో కిచెన్ గార్డెన్ ప్రారంభమైనట్టే..! ఇలా ఉన్నంతలో కిచెన్ గార్డెన్ ను ముందు ప్రారంభిస్తే.. ఆ రుచి తెలిస్తే.. తర్వాత కిచెన్ గార్డెన్ ను మరింత విస్తృతం చేసుకోవచ్చు.
గ్రిల్స్‌కు వేలాడుతూ పచ్చని మారాకులు వేస్తూ మొక్కలు ఎదుగుతుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. అయితే ఎండ బొత్తిగా తగలకపోతే ఆకు కూరలు, కూరగాయల మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. నీడగా ఉంటే క్యారట్, ఉల్లి, అల్లం వంటి దుంపజాతి మొక్కలు బాగానే పెరుగుతాయి.
కుండీల్లో..అనేక రకాల కుండీల్లో కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు. సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, అడుగు చిల్లు పడిన లేదా పగిలిన బక్కెట్, క్యాన్, ప్లాస్టిక్ జార్లు, డ్రమ్ములు.. వేటినైనా కుండీలుగా మార్చి విత్తనాలు వేసుకోవచ్చు...



Click it and Unblock the Notifications
