Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పెరటి మొక్కలకు ఎండ నుండి సంరక్షణ...

గ్రీన్ షేడ్ నెట్ తో ఇంట్లో పెరటి మొక్కలను ఎండ నుండి కాపాడుకోవచ్చు. ఒక కుటుంబం మేడపైనో, పెరట్లోనో కూరగాయలు, ఆకుకూరల వేసుకొన్న స్థలానికి నీడ కల్పించుకోవడానికి.. రెండు మూడు మీటర్ల గ్రీన్ షేడ్ నెట్ సరిపోవచ్చు. గార్డెనింగ్ మెటీరియల్ ను అమ్మే దుకాణాల్లో ఈ నెట్ దొరుకుతుంది. పంటలను ఎండ నుంచి రక్షించుకోవడానికి నెట్ ను వినియోగిస్తుండడం తెలిసిందే. తక్కువ ఉష్ణోగ్రతలోనే బాగా పెరిగే మొక్కలను పెంచుకోవడానికి ఏడాది పొడవునా నెట్ ను వినియోగించవచ్చు.
వేసవిలో మొక్కలు వాడిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సహజ ఎరువులను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ఇంట్లో వ్యర్థాలనే సహజ ఎరువులుగా వాడవచ్చు. మిగిలిపోయిన కాఫీపొడి మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగపడుతుంది. వాడిన కాఫీ పొడికి నాలుగు కప్పుల నీళ్లు చేర్చి, మొక్కలకి పోస్తే ఆరోగ్యంగా ఉంటాయి. నెలకొకసారి చల్లటి టీ డికాషన్‌కు ముప్పావుభాగం నీటిని కలిపి మొక్కల మొదళ్లలో పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
కోడిగుడ్డు డొల్ల కూడా ఎరువుగా వాడుకోవచ్చు. డొల్లను చిదిమి కుండీలలో వేయాలి. ఇలా చేస్తే గుడ్డు డొల్లలోని పొటాషియం, క్యాల్షియం మొక్కలకు పుష్కళంగా అందుతాయి. అలాగే గుప్పెడు డొల్లలను ఓ బకెట్ నీటిలో వేసి బాగా మరిగించి, ఎనిమిది గంటల తర్వాత బాగా చల్లబడ్డాక ఆ నీటిని మొక్కలకు పోస్తే, వాటికి చాలం బలం అందుతుంది.
విరిగి పోయిన పాలను వృధాగా పారబోయకుండా వాటికి నాలుగురెట్లు నీటిని కలిపి చెట్ల వేళ్లు తడిసేలా పోస్తే వాటికి మంచి పోషణ లభిస్తుంది. అయితే తరచుగా ఇలా చేయకుండా ఓ పదిరోజులకొకసారి చేస్తే మంచిది. న్యూస్ పేపర్ లో కాఫీ గింజలను ఉంచి, పొట్లంలా చుట్టి మొక్కల మొదళ్లవద్ద ఉంచాలి. కాఫీ గింజల్లోని రసాయనాలను వేర్లు పీల్చుకున్నాక పేపర్లు ఎండిపోతాయి. అప్పుడు వాటిని తీసేస్తే సరిపోతుంది. కాఫీ గింజలద్వారా మొక్కలకు మెగ్నీషియం, పొటాషియం మెండుగా లభిస్తాయి.
మొక్కలకే కాకుండా, మడులు / కుండీల్లో మట్టి మిశ్రమం ఎండ తీవ్రతకు మరీ పొడిబారిపోకుండా చూసుకోవడానికి సులువుగా పాటించదగిన పద్ధతి మల్చింగ్. ఇది ఆకురాలే కాలం కాబట్టి.. ఎండు ఆకులు ఎక్కడైనా అందుబాటులోనే ఉంటాయి. కుండీలు, మడుల్లో ఉన్న కూరగాయల మొక్కల చుట్టూ.. ఆకుకూర మొక్కలు పెంచడం ద్వారా కూడా మొక్కలకు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తపడొచ్చు(దీన్ని లైవ్ మల్చింగ్ అంటారు).



Click it and Unblock the Notifications