For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీజన్ బట్టీ మొక్కలు..మొక్కలు బట్టీ ఇంటి అలంకరణ..!

|

వేసవి కాలం వచ్చేస్తోంది. చాల మంది సమ్మర్ లో తమ తమ ఇల్లను చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంటిని అలా డెకరేషన్ చేసుకొంటారు. వేసవి కాలానికి అనుగునంగా కర్టెన్స్, ఫర్నీచర్ ను అమర్చుకొంటుంటారు. కాబట్టీ మీరూ రాబోయే సీజన్ కు అనుగుణంగా మీ ఇంట్లో మార్పులు చేయడానికి ఇష్టపడుతున్నారా.?

సీజన్ మారేకొద్ది ఆ కాలానికి అనుగుణంగా ఇంటిని డెకరేషన్ చేయడం వల్ల చూడటానికి అందంగా కనిపించడమే కాదు, ఎప్పుడూ తాజాగా ఏదో కొత్తదనం సంతరించుకుంటుంది. అయితే, ఇంటి అలంకరణ విషయానికి వస్తే కొత్తగా కనిపించేలా చేయలంటా కొద్దిగా కాదు..కాదు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంటి డెకరేషన్ లో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఒక మంచి ఎంపిక. ఇది అనుకూలమైన మార్పును తీసుకురావడమే కాదు, ఎకో ఫ్రెండ్లీ ఫీలింగ్ ను కలిగిస్తుంది. కర్చు కూడా తక్కువే అవుతుంది. కాబట్టి ఈ సమ్మర్ సీజన్ లో మీ ఇంటికి సరిపోయే ఇండోర్ ప్లాంట్స్ ను ఎంపిక చేసి తీసుకొచ్చి ఇంటిన అద్భుతంగా కలర్ ఫుల్ గా అలంకరించండి.

వేసవి ఆహ్లాదాన్నించే ఇండోర్ ప్లాంట్స్...!

ఆర్చిడ్స్: ఆర్చిడ్స్ ను ప్రపంచంలోని మొక్కల్లో అతి పెద్ద సమూహం అంటుంటారు. వాటి రంగులు మరియు ఆకారాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆర్చిడ్ ను ఇండోర్ మొక్కగా పెంచుకోవచ్చు . చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా అవి మొగ్గగా ఉన్నప్పుడు వికసించేటప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

వేసవి ఆహ్లాదాన్నించే ఇండోర్ ప్లాంట్స్...!

ఆఫ్రికన్ వయోలెట్స్: ఆఫ్రికన్ వయోలెట్స్ పువ్వులు వివిధ రంగులు మరియు వివిధ రకాల శ్రేణులగా పెరుగుతాయి. అయితే, మీరు ఈ మొక్కను ఇండోర్ మొక్కగా పెంచుకోవాలనుకున్నప్పుడు నీటిని పోయడంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అధిక తేమ మరియు వెలుగు ఎక్కువ ఉన్న ప్రదేశంలో వీటిని పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ వీటి మీద డైరెక్ట్ గా సూర్య రశ్మి పడకుండా జాగ్రత్త తీసుకోండి. ఈ ఇండోర్ మొక్క గురించి సరైన జాగ్రత్త తీసుకొన్నట్లైతే సంవత్సరం పొడవునా మొగ్గగా వస్తూనే ఉంటుంది.

వేసవి ఆహ్లాదాన్నించే ఇండోర్ ప్లాంట్స్...!

మందారం: ఈ మొక్క యొక్క ఆరోగ్య మరియు కేససంరక్షణకు ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మొక్క యొక్క పువ్వులు వివిధ రంగుల్లో ఉన్నాయి. ఈ మొక్కలకు వెచ్చదనం అవసరం అవుతుంది. అలాగా తగినంత తేమ మరియు కాంతి అవసరం అవుతుంది. అందంగా పుష్పించే ఈ మొక్కను ఇండోర్ ప్లాంట్ గా పెంచుకోవడం వల్ల ఇంట్లో చల్లదనంతో పాటు, ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది.

వేసవి ఆహ్లాదాన్నించే ఇండోర్ ప్లాంట్స్...!

పీస్ లిల్లీ: ఈ వేసవికి ఇండోర్ లో పెంచుకోగలిగిన ఉత్తమమైన మొక్క. ఈ పీస్ లిల్లీ మొక్కలను ఇంట్లోనే కాకుండా ఆఫీస్సుల్లో కూడా పెంచుకుంటుంటారు. తెల్లని పువ్వులు, ముదురు ఆకుపచ్చని నిగనిగలాడే ఆకులు కలిగిన ఈ మొక్కలు ఇంటిలోపల పెంచుకోవడం వల్ల ప్రత్యేక ఆకర్షణతో వేసవికాలం అంతా ఇల్లు కళకళలాడుతుంటుంది.

వేసవి ఆహ్లాదాన్నించే ఇండోర్ ప్లాంట్స్...!

బ్రొమేలియడ్స్: పూలనిచ్చే ఈ మొక్కలు ఇంట్లో, ఆఫీసు టేబిల్స్ పై కూడా పెట్టవచ్చు. పూలు అపుడపుడూ వచ్చినప్పటికి వచ్చిన తర్వాత చాలా రోజులే వుంటాయి. వేళ్లు కొద్దిపాటి మట్టిగల నీటిలో వుంచి పెంచవచ్చు. నాలుగు అంగుళాల కుండీ వుంటే చాలు ఈ మొక్కను పెంచవచ్చు.

English summary

Best Indoor Plants For Summer Season | వేసవి ఆహ్లాదాన్నించే ఇండోర్ ప్లాంట్స్...!


 Summer has arrived and most of us are planning to give a cool touch to our house decor. Be it furniture or curtains, we want to imbibe some or the other changes in our house depending on the coming season.
Story first published: Wednesday, March 6, 2013, 14:19 [IST]
Desktop Bottom Promotion