ఇంటిపంటకు చీడను తొలగించే సులభ చిట్కాలు

By Sindhu
Subscribe to Boldsky

ఇంటి దగ్గరే పెరటి తోటల్లో మొక్కలు పెంచుకునే వారిని ఆ మొక్కలకు పట్టే చీడపీడలు సతమతం చేస్తుంటాయి. పోషకాలను సమతుల్యంగా అందించడంపై అవగాహన పెంచుకుంటే నిరుత్సాహపడాల్సినపని ఉండదు. సమస్య మూలాలు తెలుసుకుంటే.. ఆ సమస్యను నివారించుకోవడం లేదా అధిగమించడం సులభమవుతుంది...సజీవమైన మట్టిలో లెక్కలేనన్ని సూక్ష్మ జీవులుంటాయి. సూక్ష్మజీవులు ఎక్కువగాలంగా ఉన్న మట్టిలో మొక్కలు ఆరోగ్యంగా ఎదగడంతోపాటు చక్కటి దిగుబడులిస్తాయి.

మొక్కలు చీడపీడలను తట్టుకుంటూ ఆరోగ్యంగా ఎదగడానికి సూక్ష్మపోషకాలు దోహదపడతాయి. మట్టి నుంచి మొక్క తీసుకునే సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందకపోవడం వల్ల మొక్కలు బలహీనపడతాయి. బలహీనంగా ఉన్న మొక్కలకే పురుగులు, తెగుళ్లు సోకుతాయి. రసాయనిక ఎరువులు వాడితే గంధకంతోపాటు ఐరన్, జింక్ వంటి సూక్ష్మపోషకాల లోపాలు మొక్కల్లో అధికంగా కనిపిస్తాయి. విషరసాయనాలు చల్లితే.. అవి పురుగులతోపాటు ఉపయోగపడే కీటకాలను, ఇతర జీవులను కూడా అంతం చేస్తాయి. ఈ కారణం వల్లే మట్టిని సజీవంగా ఉంచడం ద్వారా పోషకాల సమతుల్యతకు దోహదపడేందుకుగాను కంపోస్టు, పశువుల పేడ తదితరాలతో అనేక సహజ ఉత్పత్తులను తరచూ వాడుతూ మొక్కలను కాపాడు కోవచ్చు. అప్పటికీ చీడపీడలు సోకితే ఇంట్లోనే వివిధ ద్రావణాలు, కషాయాలు తయారుచేసుకొని చల్లడం ద్వారా నివారించుకోవచ్చు కుండీలు, మడుల్లో ఆకుకూరలు, కూరగాయలను ఇంటి పట్టున పెంచుకునే వారు నిపుణుల తోడ్పాటుతో అవగాహనను పరిపుష్టం చేసుకుంటూ.. సేంద్రియ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యదాయకమైన ఇంటి పంటలు పండించుకునే అవకాశం ఉంది.

Homemade Fertilizers for Your House Plants

సేంద్రియ ఇంటిపంటలు సాగుచేసే వారు దృష్టిలో ఉంచుకోదగిన ముఖ్యవిషయం: చీడపీడల నివారణ కాదు నియంత్రణే ప్రధానం. మొక్కలను చీడపట్టిన తరువాత, తెగుళ్లు సోకిన తరువాత నివారణ చర్యలను చేపట్టడం కాకుండా.. మొక్కలు వేసింది మొదలు క్రమానుగతంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి.

'జనరల్ పర్పస్ స్ప్రే'

'జనరల్ పర్పస్ స్ప్రే' తయారీకి కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయ 1 మిరపకాయ 1 వెల్లుల్లి గడ్డ 1

ఈ మూడింటినీ మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఒక రాత్రంతా కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి. వడకట్టి ద్రావణంలో 1:5 రెట్ల నీరు కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసే ముందు చిటికెడు సర్ఫ్ పొడి కలిపితే మొక్క ఆకులకు మందు అంటుకోవడానికి ఉపయోగపడుతుంది.

సబ్బు నీరు: సబ్బు నీరు పిచికారీతో పచ్చదోమ, తెల్లదోమ, పాకుడు పురుగులు, పిండి నల్లి, ఆకు దొలిచే పురుగు, ఎర్రనల్లి వంటి వాటిని పారదోలవచ్చు. తయారీ విధానం: 30 గ్రాముల బార్ సబ్బును సన్నగా తురుము కోవాలి. (డిటర్జెంట్ కాదు) దీనిని లీటర్ నీటిలో కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక చెంచాడు వంట నూనె లేదా కిరసనాయిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి.

వెల్లుల్లి రసం: గొంగళి పురుగు, క్యాబేజీ ఫ్లై, దోమలు, నత్తలు ఇతర రకాల పాకుడు పురుగులను నాశనం చేస్తుంది. దీనికి తోడు ఆకు ముడత, ఆకు మచ్చలు, తేనే మంచు, బూడిద తెగులును నిరోధిస్తుంది. తయారీ విధానం: 90 గ్రాముల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచాలి. దీనికి రెండు చెంచాల కిరోసిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 600 మిల్లీ లీటర్ల నీటిలో నానబెట్టాలి. రెండు రోజుల తరువాత వడకట్టి 25 గ్రాముల సబ్బుపొడిని కలిపి పిచికారీ చేసుకోవాలి.

వెల్లుల్లి-పచ్చిమిర్చి రసం: ఇది వెల్లుల్లి రసం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుంది. తయారీ విధానం: 10 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చి మిరపకాయలు, 3 ఓ మోస్తరు ఉల్లిపాయలు మెత్తగా రుబ్బుకొని మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి మరిగించాలి. రెండు, మూడు పొంగుల తరువాత దించి చల్లారనివ్వాలి. వడపోసుకున్న ద్రావణాన్ని ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. పిచికారీ మోతాదు: ఒక కప్పు ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి ఒక షాంపూ ప్యాకెట్ లేదా కుంకుడు రసం లేదా పచ్చి పాలు కొంచెం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత వచ్చిన మొక్కలకు వరుసగా వారం రోజుల పాటు పిచికారీ చేసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది.

పచ్చిపాల ద్రావణం: పచ్చిపాల ద్రావణం బూడిద తెగులుపై బాగా పనిచేస్తుంది. పచ్చి పాలను రెట్టింపు నీటితో కలిపి పిచికారీ చేస్తే వైరస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా మొజాయిక్ వైరస్‌పై ఇది బాగా పనిచేస్తుంది.

పుల్ల మజ్జిగ: నాలుగైదు రోజులు పులియబెట్టాలి. ఈ పుల్ల మజ్జిగను ఒకటికి తొమ్మిది పాళ్లు నీరు కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. పుల్ల మజ్జిగ వివిధ కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను నశింపజేస్తుంది.

కీటకాల రసం: పంట మీద ఏదైనా పురుగు ఉధృతంగా కనిపిస్తుంటే.. ఆ పురుగులు కొన్నిటిని ఏరి రెండు కప్పుల నీరు కలిపి రుబ్బాలి. ఆ రసాన్ని లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ పురుగులు పారిపోతాయి.దవనం ఆకుల కషాయం: ఒక లీటర్ నీటిలో గుప్పెడు దవనం ఆకులను కలిపి మరిగించాలి. ఈ కషాయానికి రెట్టింపు నీరు చేర్చి పిచికారీ చేస్తే దోమ, పెంకు పురుగు, నత్తలు, క్యాబేజీ తొలిచే పురుగులు వైదొలగుతాయి.

ఉప్పు నీళ్ల స్ప్రే: 60 గ్రాముల ఉప్పు, 2 చెంచాల సబ్బు పొడి, 4.5 లీటర్ల గోరు వెచ్చటి నీటిలో బాగా కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణం క్యాబేజీని తొలిచే పురుగులపై బాగా పనిచేస్తుంది.

ఎప్సమ్ సాల్ట్: వైరస్ ఆశించిన మొక్కల ఆకులు పచ్చగా మారి బలహీన పడతాయి. మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పండుటీగ నిరోధక ద్రావణం: 15 లీటర్ల నీటిలో ఒక కిలో పంచదార వేసి కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక లీటరు సముద్రపు నీరు లేదా సైంధవ లవణం కరిగించిన నీటితోపాటు.. ఒక లీటరు బెల్లం ద్రావణం లేదా డయటోమసియా ఎర్త్ లేదా పుట్టమన్నును కరిగించి.. వడకట్టి నీరు కలిపి పిచికారీ చేయాలి. పలుమార్లు పిచికారీ చేస్తే పండుటీగ హాని తొలగిపోతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Homemade Fertilizers for Your House Plants

    Garden plants need food to grow healthy. Whether to go organic or use commercial fertilizers is the beginning of the question. Different plants need different fertilizers and different feeding schedules. Here's info on feeding and growing healthy plants.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more