For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో వికశించిన పూలతోటమరింత అందంగా కనిపించాలంటే

|

చాలా వరకూ పూలమొక్కలు శీతాకాలంలో ఎక్కువగా విరభూస్తాయి. కొన్ని సందర్భాల్లో, అలా వికసించన పూలతోట క్లీన్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తేనే అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. అందుకు కొంత తెలివితో ప్లాన్ చేసుకోవాలి. శీతాకాలంలో వస్తోందంటే చాలు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.

చాలా మంది శీతాకాలంను నిరర్థకకాలంగా భావిస్తారు. కానీ, ఈ శీతాకాలం పరిమళాలను విరభూస్తూ, ఆహ్లాదపరిచే, ఒక అద్భుతమైన సీజన్ అని మీరు గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో విరభూసే పువ్వుల యొక్క పరిమళాలు మీ మనస్సులను మరింత తేలికపరుస్తుంది.

శీతాకాలంలో, మీ ఫ్లవర్ గార్డెన్ మీద కొంచెం శ్రద్ద మరియు మనస్సు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది. శీతాకాలం అని మీరు మీ గార్డెన్ ను అశ్రద్ద చేయడానికి లేదు. అందుకు మీరు చేయాల్సిందల్లా గార్డెన్ మొత్తం శుభ్రం చేయాలి, మరియు మొక్కల కాండం చివలర్ల, వద్ద మరియు మొక్కల చుట్టూ రాలిపోయే పువ్వలను తొలగించి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కల ప్యాథోజెన్స్ అనే వ్యాధులు సంక్రమించకుండా సహాయపడుతుంది. అలాగే మొక్కల మీద క్రిమి కీటకాల యొక్క గుడ్లు తొలగించేస్తుంది. ఈ సీజన్ లో వార్షిక పువ్వులు రాలిపోవడం మరియు ఆ ప్రాంతంలో తిరిగి కొత్తగా పువ్వులు రావడం ప్రారంభిస్తాయి.

వింటర్లో మీ ఫ్లవర్ గార్డెన్ అందంగా క్లీన్ గా ఉంచడం వల్ల ఈ చల్లని వాతావరణంలో ఫ్లవర్స్ అందంగా పూస్తాయి. ఇంకా మీరు పూలమొక్కల అడుగన పాదులు తియ్యడం మరియు సాధరంగా మొక్కల పెరుగుదలకు చేయాల్సిన సదుపాయాలన్ని చేయాల్సి ఉంటుంది . సాధారణంగా చలికాలంలో పొడిగాలుల వల్ల మొక్కల యొక్క పెరుగుదల తగ్గుతుంది మరియు పువ్వులు పెరగకుండా చేస్తుంది . జోరుగా వీచే గాలుల వల్ల ఫ్లవర్ మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోవడం, లేదా నల్లగా మారిపోవడం, లేదా వంగిపోవడం జరుగుతుంటుంది.

Simple Gardening Tips For Looking After Flowers In Winter

చిన్న మొక్కలు మాత్రమే కాదు, పెద్దపెద్ద మొక్కలు కూడా ఇలాంటి సమస్యలకు గురి అవుతుంది. కాబట్టి, సరైన టైమ్ కు నీళ్ళు పట్టడం ద్వారా కాండం నీరు గ్రహించకపోవచ్చు. అంతో హైడ్రేషన్ వల్ల ప్లవర్స్ రాలిపోతుంది. కాబట్టి, ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాలి. అందుకోసం...

శుభ్రం చేయాలి: శీతాకాలంలో గార్డెన్ లో ఎక్కుగా పేరుకుపోయిన చెత్తా చెదారం మరియు ఎరువును తొలగించాలి. మొక్కలకు సరిగా నీరు అందేలా జాగ్రత్తలు తీసుకవాలి. ఎరువులు సక్రమంగా వేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. వివిధ రకాల వ్యాధులు సోకుండా మరియు క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా చేస్తుంది. శీతాకాలంలో ఫంగస్ ఎక్కువగా ఏర్పడుతుంది. దాంతో స్టెమ్ క్రాకర్స్ కు కారణం అవుతుంది.

లేయర్ గా ఎరువును ఎక్కువగా వేయాలి. ఇలా వేయడం వల్ల మొక్క యొక్క కాండంను కాపాడుతుంది. అంతే కాదు, సూర్య రశ్మి మరియు చలి నుండి మొక్కను రక్షిస్తుంది.

బ్లాకెట్ లేదా షీట్: మీరు ఎక్కువ ఈదురుగాలల నుండి మొక్కలను రక్షించడానికి , చలికాలంలో సూర్య రశ్మి నుండి మొక్కలను కాపాడుటకు బ్లాకెట్ ను వాటి మీద కప్పాల్సి ఉంటుంది.

సరిపడా నీళ్ళు పోయడం: చలికాలంలో వాతావరణం చల్లగా ఉందని వదిలేయకుండా మొక్కకు సరిపడా నీరు పోయాలి అప్పుడే మొక్కలు పెరగ గలవు.

ఫెర్టిలైజ్: మరో ముఖ్యమైన గార్డెన్ చిట్కా మీ మొక్కలకు సరిపడా ఫెర్టిలైజర్స్ ను అందివ్వాలి . నెలలో ఒకటి లేదా రెండు సార్లు ఎరువులు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్లవర్ ఫ్లాంట్స్ కు ఇవి చాలా అవసం.

English summary

Simple Gardening Tips For Looking After Flowers In Winter

Most flowers need attention during winter. Sometimes, the inclement weather can make your garden tattered and weather-worn. But with clever planning, you can keep your garden ready for winter. 
Story first published: Wednesday, January 7, 2015, 15:18 [IST]
Desktop Bottom Promotion