Latest Updates
-
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం
మీ మూడును తెలికపరిచే మీ తోటలోని పూలు!
మీ మూడును తెలికపరిచే మీ తోటలోని పూలు!
మన మూడ్ బాలేకపోవడానికి, ఆధునిక జీవనశైలి వలన కలిగే ఒత్తిడి మరియు టెన్షన్ ముఖ్య కారణాలు. ఇతర మానసిక కారణాలు కూడా దీనికి దోహదపడతాయి. కొన్నిసార్లు మన ఆరోగ్యం క్షీణించడం వల్ల కూడా మూడ్ పాడవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, మన శరీరంలో ఉండే హార్మోన్లు చేసే మాయాజాలం ఇంకొక ఎత్తు. మీ మూడ్ బాగులేకపోవడానికి కారణం ఏమైఉంటుందో అని ఆలోచిస్తూ బాధపడటం వలన కూడా మూడ్ ఇంకా పాడవుతుంది.
ఇటువంటి సమయంలో మీరు ఆలోచించవలసినదల్లా, తిరిగి మీరు ఉత్సాహంగా మారడానికి ఎలా ప్రయత్నించాలి అనే! ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే, మీకు నచ్చినపని ఏదైనా చేయాలి.

ప్రకృతితో మమేకమై ఉన్నవారి ఆరోగ్యసామర్ధ్యాలు అత్యుత్తమంగా ఉంటాయని నిరూపితమైనదే!కనుక మనచుట్టూ పశుపక్షులు మరియు పూలు, మొక్కలు ఉంటే వాటి సానుకూల ప్రభావం మనపై పడి మన మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ వ్యాసం ద్వారా మేము మీ మూడును తెలికపరిచే కొన్ని పూల విశిష్టతను గురించి తెలియజేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చదివేయండి!

• గులాబీలు:
ఈ పువ్వును ప్రేమాభిమానాలకు చిహ్నంగా చెబుతారు. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతాయి. ప్రతి రంగుకు ఒక విశిష్టత ఉన్నప్పటికీ, మీ మూడ్ బాగుచేయడానికి ఇవన్నీ సమాన సహకారాన్ని అందిస్తాయి. గులాబీని చూడటం, దాని వాసన పీల్చడం వలన, మనలో మన గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మంచి భావనలు కలుగుతాయి.

చామంతి
ఈ పువు చూపుకు అందంగా ఉండటమే కాక, మన నేరాలను శాంతపరుస్తుంది. మనలో చాలమంది చక్కనైన రుచి మరియు సువాసన కలిగిన కేమోమైల్ టీని గురించి తెలిసినవారే! ఈ టీని సేవించినంతనే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఈ పూల నుండి వెలికితీసిన సారంతో, నిద్రకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా పెద్దవారిలో పరిష్కారమవుతాయి. మీ మూడ్ ని తేలికపరచి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచే శక్తి వీటికి ఉంది.

• తులసి:
తులసిలో ఉండే లినోలోల్ దాని గొప్పదనానికి కారణం. మన అభిజ్ఞ శక్తి దెబ్బతినకుండా చేస్తూ, ఒత్తిడితో పోరాడుతూ, మనలో సానుకూల భావనలు ఏర్పడటానికి ఇది తోడ్పడుతుంది. మనం ముందు చెప్పుకున్న మొక్క వలే, దీని పూలు చూపుకు, వాసనకు అంత ఇంపుగా ఉండవు. కానీ మన నాలుకతో రుచి చూసినప్పుడు, దేరని రుచిలోని ఘాటుదనం మన మూడ్ ను ఉత్సాహపరుస్తుంది.

• ఉల్లి
మనలో చాలామంది ఉల్లిని ఉపయోగించకుండా ఆహారాన్ని తయారుచేయడాన్ని ఊహించను కూడా లేరు. ఉల్లిపాయలు కోసేటప్పుడు మీకు కన్నీరు తెప్పించినప్పటికి, ఇవి హృదయారోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలతో నిండి ఉంటాయి. మెదడులోని హైపోథలామస్ నందు డోపమైన్ క్రియను పెంచి, యాంటీడిప్రెసెంట్ గా పనిచేస్తుంది.

తులసి
తులసికి మల్లే ఉల్లిలో మూడ్ ను తేలికపరిచే గుణం, అవి మానవుని నాలుకపై ఉండే రుచిమొగ్గలను ప్రేరేపించడం వలన కలుగుతుంది. ఉల్లి మొక్కలను పెంచడం, సంరక్షించడం, మిగిలిన మొక్కలతో పోలిస్తే చాలా సులువైనది కనుక ఈ జాబితాలో మా ఫెవరేట్ ఇదే!

• సోంపు
ఎక్కువ పోషణ అవసరం లేకుండా తేలికగా పెంచుకోగలిగే మొక్కలలో ఇది ఒకటి. ఈ పూలు తేనెటీగలు మకారందాన్ని అందుస్తాయి. దీని పచ్చని ఆకులు మరియు పసుపు రంగు పూలతో కూడిన పుష్పగుచ్ఛం చూపుకు కన్నులపండువగా ఉంటుంది. దీనిలోని ఔషధ గుణాలు మీ మూడ్ ను ఉత్తేజ పరచడమే కాక, మీలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

• సూర్యకాంతి పువ్వు
ఈ పువ్వును కళ్లారా చూసినా, దీని సువాసన పీల్చినా, మీ మూడ్ ఉత్సాహంగా మారుతుంది.
ఇంకా చెప్పాలంటే, ఈ పువ్వులోని ప్రకృతి సహజ సుగుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫినైల్ ఎలనిన్, మీ హార్మోన్లపై ప్రభావం చూపించి మిమ్మల్ని ఆనందపరుస్తుంది.
చేలో మనను చూసి తలలాడిస్తూ, పలుకరిస్తున్నట్లుగా వరసలలో ఉండే ఈ పూలను చూడగానే మన మనసు అనుకూల భావనాలతో నిండిపోతుంది. మనలో ఉత్సాహం వెల్లువెత్తుతుంది.

• యారో
ఈ పూలు కొండప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి తెలుపు రంగులో ఉంటూ, సమయం గడుస్తున్నకొద్దీ పూల అంచులు గులాబీ రంగులోకి మారతాయి. ఈ పూల సౌందర్యానికి ముగ్ధులైన శాస్త్రవేత్తలు, ఇవి మూడును తెలికపరచేందుకు ఉపయోగపడతాయని తేల్చారు. ఈరోజుల్లో వీటిని ఆందోళనకు చికిత్సలో భాగంగా ఉపశమనకారిగా వాడుతున్నారు. రక్తపోటుతో కూడిన ఆందోళన ఉన్నవారిలో, ఇది అద్భుతంగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications