For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్లను ఉడకబెట్టడం ఎలా?

|

How to Boil Eggs
గుడ్లు మీ ఆరోగ్యానికి మంచివి - వాటిలో విటమిన్లు ఎ, డి, ఇ, అన్ని కొవ్వు పదార్ధాలు (ముఖ్యంగా లెసితిన్), ఇనుము, గంధకం ఇంకా మాంసకృత్తులు వుంటాయి. ఎటువంటి శ్రమ లేకుండా భోజనం తయారు చేసుకోవాలంటే గుడ్లు ఉడకపెట్టడం ఉత్తమ మార్గం - మీరు తేల్చుకోవలసి౦దల్లా మీకు గుడ్లు మెత్తగా వుండాలా, గట్టిగా ఉండాలా అనేదే.

గుడ్లు ఉడక పెట్టడంతో వచ్చిన చిక్కేమిటంటే అవి బయటకు తీసి కోసి చూసేదాకా అది సరిగ్గా ఉడికిందో లేదో మీకు తెలియదు. గుడ్లు ఉడక పెట్టె ప్రక్రియ మీరు ఊహించిన దానికన్నా మరింత సంక్లిష్టంగా వుంటుంది, ఎందుకంటే ఉడికిన గుడ్డు ఎలా వుంటుంది అనేది చాల విషయాల మీద ఆధారపడి వుంటుంది. కానీ శుభవార్తా ఏమిటంటే ప్రతి సారీ గుడ్డు సరిగ్గా ఉడికేలా చేసేందుకు కొన్ని మార్గాలున్నాయి, కేవలం ఇక్కడ చెప్పిన చర్యలు తీసుకుంటే మీరు ఎదురుచూస్తున్న ఫలితాలు వస్తాయి కూడా.

చర్యలు

1. ఉడక బెట్టిన గుడ్లు ఎలా కావాలో ఎంచుకోండి. మీకు మెత్తగా ఉడికింది కావాలా లేక గట్టిగా ఉడికినదా? కొన్నిసార్లు ఇంట్లో అందరికీ నచ్చేలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వుడికించాల్సి రావచ్చు. అన్ని సందర్భాల్లోను ఈ వ్యాసం లో చెప్పిన సమయాలు వ్యక్తిగత అభిరుచులను బట్టి వుంటాయి, కాబట్టి కొంత ప్రయోగం కూడా జరగాలి. ఉడికిన గుడ్లలో రకాలు ఇవి :

2. మీకు కావలసిన విధానం ఎంచుకోండి. ఈ క్రింద సూచించిన విధానాలను చూస్తె, గుడ్లు ఉడక బెట్టడం అనే ప్రక్రియ శతాబ్దాల నుంచి అనేక ప్రయత్నాల మీద అభివృద్ది చెందిన ఒక కళా రూపం అని మీరు గమనిస్తారు. ఇప్పటికే మీకు ఒక ఇష్టమైన పద్ధతి లేకపోతె, ఇందులోని ప్రతి పధ్ధతినీ ప్రయత్నించి చూసి మీరు బాగుందనుకున్న పద్ధతిని ఎంచుకోవచ్చు.

మెత్తగా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో మీరు గుర్తుంచుకోవలసినది తెల్ల సొన మెత్తగా వుండి కదులుతున్న పచ్చ సొన కావాలంటే తక్కువ సేపు ఉడకాలి, అలాగే కుదురుకున్న తెల్ల సొన, కొద్దిగా కుదురుకున్న పచ్చ సొన కావాలంటే ఎక్కువ సేపు ఉడకాలి.

గట్టిగా ఉడికిన గుడ్ల కోసం ఐతే, 12 నిమిషాలకు మించి గుడ్లను ఉడకబెట్టకూడదు ఎందుకంటే తెల్ల సొన రబ్బర్ లాగా ఐపోయి, పచ్చ సొన ముక్కలుగా విడిపోతుంది.

మెత్తగా ఉడకాల్సిన గుడ్ల విషయం లో మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే మీరు గుడ్ల లోని పచ్చ సొన మధ్యలోనే ఉండాలనుకుంటే (ఏదైనా ప్రత్యెక వంటకం కోసం బాయిల్డ్ ఎగ్ చేసేటప్పుడు ఇది మరీ ముఖ్యం) గుడ్లను ముందు నుంచే చల్లటి నీటి లో వేసి మెల్లిగా ఉడకనివ్వాలి. ఇలా జరుగుతుండగా ఒక చెక్క స్పూన్ తో దాన్ని పూర్తిగా ఉడికేదాకా మధ్య మధ్య లో కదపాలి, ఇలా చేస్తే పచ్చ సొన మధ్యలోనే వుండడం మీరు గమనిస్తారు.(4)(5)

అన్ని సందర్భాల్లో ఉడకబెట్ట డానికి ఒక విధానం చెప్తే అవి నీటి లో వుంది మరిగే దాకా ఉడకడం అని అర్ధం. తీవ్రమైన వేడి నీటి లో ఉడికిస్తే గుడ్లు రబ్బర్ లాగా సాగి, గట్టిగా మారిపోతాయి. తీవ్రంగా ఉడికిస్తే గుడ్లలోని మాంసకృత్తులు గట్టిగా అయిపోతాయి. వేడి మీద గుడ్లు గడ్డ కట్టుకు పోతాయి కనుక ఉడకబెట్టే అన్ని మంచి విధానాలు తక్కువ సెగ మీద మెల్లిగా వండడాన్నే సూచిస్తాయి.

3. గుడ్డును సిద్ధం చేయండి. ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లకు ఎక్కువ పి హెచ్ వుండి త్వరగా పగిలిపోతాయి, కానీ వాటి డొల్ల వొలిచి వేయడం తేలిక. పాక శాస్త్ర నిపుణురాలు రోజ్ ఎలియట్ గుడ్లను గుండ్రంగా వుండే వైపు ఉడకబెట్టే ముందు కొద్దిగా గుచ్చమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గాలి పోయి గుడ్డు పేలకుండా లేదా పగల కుండా వుంటుంది. ప్రత్యేకంగా తయారైన ఎగ్-ప్రికర్లు లేదా ఒక సూది కూడా ఇందుకోసం వాడవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు గుడ్లను సాధారణ ఉష్ణోగ్రతలోనే ఉంచారు కనుక లేదా అప్పుడే పొదిగిన గుడ్లు కాదం వల్ల ఇది మీకు ఇబ్బంది కాకపొతే, దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు.

ప్రతి సందర్భం లోను, మీరు ఒకే సారి ఒకటి కన్నా ఎక్కువ గుడ్లు ఉడక బెట్టవచ్చు, ఐతే సరిపడా స్థలం వుందో లేదో చూసుకోండి. ఎక్కువ గుడ్లు ఒకే సారి ఉడకబెట్టడానికి ప్రత్యెక ఎగ్ హోల్డర్ కొనవచ్చు - మరిన్ని వివరాల కోసం వంటగది సామగ్రి అమ్మే దుకాణంలో సంప్రదించండి.

గుడ్లు పగిలితే ఒక చుక్క వినేగార్ వేయండి, డొల్ల నుంచి కారడం ఆగిపోతుంది.

పగిలిన గుడ్లను అల్యూమిమియం ఫాయిల్ లో వుంచి ఉడికించవచ్చు.

4. వేడి గుడ్లను జాగ్రత్తగా బయటకు తీయండి. ఒక వెడల్పాటి స్పూన్ తో ఉడికే నీటి నుంచి తగిన సాధారణ జాగ్రత్తలతో గుడ్లను బయటకు తీయండి.

హెచ్చరికలు

నీరు ఉడుకున్నప్పుడు మీరు గిన్నెను సెగ మీద నుంచి దింపక పొతే గుడ్లు ఎక్కువ ఉడికి రబ్బర్ ళా సాగి పచ్చ సొన ఎండిపోతుంది.

మీరు గుడ్లను ఉడుకుతున్న నీటి లో 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉంచితే, సోనలు రంగు మారిపోయి, భరించలేని గంధకం వాసన కలిగి వుంటాయి. కొందరికి ఇదే రుచిగా వుంటుందనుకోండి!

వినేగార్ ఎక్కువ వేస్తె గుడ్లు చెడు వాసన వచ్చి, వినేగార్ రుచి లో వుంటాయి. కొద్ది చుక్కలు మాత్రమె చాలు.

గుడ్డు పెంకులను నీటి ప్రవాహం లో డ్రైన్ లోకి వదిలితే డ్రైన్లు పూడుకు పోయే ప్రమాదం కూడా వుంటుంది. మీ పైపుల నుంచి గుడ్ల పెంకులు తొలగించడం చాలా కష్టం ఎందుకంటే అవి బరువుగా ఉండి మునిగిపోతాయి, దాంతో మీ మురుగు గొట్టాల్లోపల అంటుకుపోతాయి. ఎప్పుడూ డ్రైన్ల మీద ఏదైనా రక్షణ ఉంచుకోవడం మంచిది.

English summary

How to Boil Eggs | గుడ్లను ఉడకబెట్టడం ఎలా?

Eggs are good for you – they contain vitamins A, D, and E, all the fats (especially lecithin), iron, sulfur, and proteins. Boiling eggs is a great way to create an instant meal without too much ado – all you need to do is choose whether you like them soft or hard.
Story first published:Tuesday, January 8, 2013, 19:26 [IST]
Desktop Bottom Promotion