For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవుట్ డోర్ గ్యాస్ గ్రిల్ ను శుభ్రం చేయడం ఎలా?

|

ఇంట్లో సాధారణంగా మనం గ్యాస్ స్టౌ ను ఉపయోగిస్తుంటాం. చిన్న గ్యాస్ స్టౌ ను ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో స్టౌ ను శుభ్రం చేయడం చాలా సులభం కూడా. గ్యాస్ బేస్ మెంట్, గ్యాస్ స్టౌ ఎల్లప్పుడు క్లీన్ గా ఉంచుకోవడం వల్ల కుటుంబం సభ్యులందరూ మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. అందుకే మిగిలిన గదుల కంటే వంట గది శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. ఎందుకంటే ఎప్పడూ తడిగా ఉండే ప్రదేశం, ఆహారాలు నిల్వ ఉండే ప్రదేశం వంట గదే కాబట్టి బ్యాక్టీరియా అతి సులభంగా, త్వరగా ఏర్పడుతుంది. కాబట్టి గ్యాస్ స్టౌను శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. అదే విధంగా అవుట్ డోర్ (బహిరంగ)గ్యాస్ గ్రిల్స్ ను శుభ్రం ఉంచుకోవడం కూడా చాల ముఖ్యం. అందు కోసం, వాటిని ఉపయోగించిన ప్రతి సారి శుభ్రం చెయ్యడం చాలా అవసరం.

చర్యలు:

ఉపయోగించిన ప్రతి సారి:

క్లీన్ సెట్టింగ్ ( పరిశుభ్ర ఏర్పాటు) ఉపయోగించి గ్రిల్ ని ప్రీహీట్ (ముందస్తు వేడి) చెయ్యండి. పొరబాటు పడకండి - ఈ సెట్టింగ్ ( ఏర్పాటు) గ్రిల్ లోపల పడిపోయిన పదార్ధాలను కాల్చివేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, నిజంగా గ్రిల్ ని అయితే శుభ్రం చెయ్యదు. వంట చేసే చట్రాలను పైకి లేపండి. బర్నర్ల పైన ఉన్న కంచెని శుభ్రం చెయ్యండి ( ఇది లావా రాళ్ళు, దిమ్మెలు, ఒక విధమైన లోహ పళ్ళేలు అయిఉండవచ్చు). ఒక దృఢమైన వైర్ బ్రష్ ( తీగ కుంచె) ని ఉపయోగించి మొత్తం జిడ్డుని మరియు ఇతర ఆహార అణువులను నిర్మూలించండి.

How to Clean an Outdoor Gas Grill

సంవత్సరానికి ఒక సారి:

గ్యాస్ ని ఆపివేయండి. గ్రిల్ భాగాలను వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పైకి తియ్యండి.

బర్నర్లను క్షుణ్ణంగా తనిఖీ చెయ్యండి. సమమైన వంట కోసం ఏవైనా గ్యాస్ అడ్డంకులు ఉంటే అవి నిర్మూలించండి. అది వీలు కాకపోతే, బర్నర్లను మార్చివేయాలి.

లావా రాళ్ళు/దిమ్మెలు/లోహ పళ్ళేలను ఏదైనా ఆహర పదార్ధాలు లేకుండా శుభ్రం చెయ్యండి. ఈ పర్యాయాన్ని గతసారి తప్పిపోయిన కష్టతరమైన ప్రదేశాలను శుభ్రం చెయ్యడానికి ఉపయోగించండి. ఒకవేళ ఆహరం బాగా గట్టిగా అటుక్కుపోయినట్టు అయితే, దుర్వాసన భరితమైన పొగను నివారించేందుకు, లావా రాళ్ళు/దిమ్మెలు/లోహ పళ్ళేలను మార్చివేయండి.

గ్రిల్ ను సబ్బు నీళ్ళతో కడగండి. పాలిపోవడం, తుప్పు పట్టడం లాంటి జాడలు కనిపించినట్టు అయితే గ్రిల్ కి రంగు వేయండి. గ్రిల్ భాగాలన్నీ మళ్ళీ లోపల పెట్టెయ్యండి. అన్ని కనెక్షన్లు (అనుసంధానాలు) సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత ఆన్ చెయ్యండి. వంట కి మరో సారి ఉపయోగించే ముందు, సబ్బు అవశేషాలు మొత్తం కాలిపోయేటట్టు గ్రిల్ ని పూర్తిగా వేడి చెయ్యండి.

English summary

How to Clean an Outdoor Gas Grill | గ్యాస్ గ్రిల్ ను శుభ్రం చేయడం ఎలా?

Use the clean setting to preheat your grill. Do not be mislead—while this setting will burn up the things that have fallen down into the grill, it doesn't really clean the grill. Lift up the cooking grates. Clean the barrier above the burners (this may be lava rock, briquettes, or some sort of metal plate). Use a sturdy wire brush to remove all grease and food particles.
Story first published: Saturday, January 26, 2013, 10:10 [IST]
Desktop Bottom Promotion