For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూళికలని భద్రపరచడం ఎలా?

|

మీ తోటలో ఉండే మూళికలు ఎక్కువ కాలం వాడుకోవడానికి ఎండబెట్టి దాచడం ఎంతో ఉపయోగపడుతుంది. మూళికలు లేదా విత్తనాల్ని మీరే స్వయంగా భద్రపరచాలనుకున్నప్పుడు వాటి మొత్తం మీద మీకొక అవగాహన ఏర్పడుతుంది. తాజా మూలికలు ఉపయోగకరమైనవి అయినప్పటికీ మీకు శీతాకాలం మొత్తం అవి ఎండేవరకు సరఫరా ఉండదు. ములికలని ఎండబెట్టడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అవి వేలాడదీయడం, ఘనిభవించడం, నూనెలో నానబెట్టడం. ప్రతి మార్గంలో వాటి యొక్క లాభాలు ఉన్నాయి.

మూళికలని ఎండబెట్టే విధానం

1.తోటలోంచి మూళిక తీసుకోండి. మూళికలని కత్తిరించడానికి బలమైన కత్తెర లేదా వంటగది లో వాడే కత్తిని వాడండి. శీతాకాలం లో జీవించి ఉండగలిగే మూళికలైతే (అంటే శీతాకాలం లో చలిని తట్టుకుని ఉండగలిగేవి) వాటి కొమ్మలని మొక్క యొక్క స్థావరం నుండి కత్తిరించండి. మిగతా వాటినైతే పూర్తిగా లాగేసి వ్రేళ్ళని ఇంకా చెక్క భాగాలని తరువాత సవరించవచ్చు. ఎండబెట్టదలచిన మూళికలని పెద్ద కాడ వుండేలాగ కత్తిరించండి. హార్వెస్ట్ లేదా మూలికల కోతకు అనువైన సమయం కోసం క్రింద వివరించబడిన చిట్కాలని చదవండి.

2. మురికిగా ఉన్న ముళికలని జాగ్రత్తగా కడగండి. ఒక స్ప్రేతో మూళికల మీద సుతారంగా చల్లి కడిగి ఆరబెట్టండి. లేకపోతే నిల్వచేసినప్పుడు బూజు పట్టే ప్రమాదం ఉంది. పేపర్ టవల్ తో వీటిని తుడవండి.

How to Preserve Herbs

3. వేలాడదీయడం: కొమ్మలకి చివరనున్న ఆకులని తొలగించి మూళికలన్నింటిని ఒక కట్ట లాగ కలిపి కట్టాలి. ప్రతి కట్టలో అయిదు నుండి పది కొమ్మలు ఉండేలా జాగ్రత్తపడితే వెంటిలేషన్ కి ప్రాబ్లం ఉండదు. తేమ తగలని, పొడి ప్రదేశంలో వెచ్చగా ఉండే చోట చక్కని వెంటిలేషన్ ఉండే చోట, పాదచారుల రద్దీ ఉండని చోట ఈ మూళికలని ఎండబెట్టేందుకు భద్రపరచాలి. 68 డిగ్రీల ఫారీన్ గ్రేడ్ నుండి 20 డిగ్రీల సెల్సియస్ వరకు మూళికలని ఎండబెట్టేందుకు అనువైన ఉష్ణోగ్రత. ఒక వేళ మీ ఇంట్లో చీకటిగా ఉండే ప్రదేశం లేకపోతే ఈ మూళికల కట్టపై ఒక దాని పైన ఒకటి పేపర్ లంచ్ బాగ్స్ తో చుట్ట్టేయాలి. దీని వల్ల చీకటి ప్రదేశంలో ఉంచిన లాభంతో పాటు వీటి పైన దుమ్మూ ధూళి పడే అవకాశం కూడా ఉండదు. ఈ మూళికలని ఒకటి నుండి రెండు వారాల వరకు అలాగే ఉంచండి. వీలైనప్పుడల్లా ఆ మూళికలు ఎలా ఎండుతున్నాయో గమనించండి. మందంగా కాడలు కలిగిన మూలికలు ఎండడానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటాయి. వాటి ఆకులని మీ వేళ్ళ మధ్యకి తీసుకుని రుద్ది అవి ఎండాయో లేదో గమనించండి. ఒక వేళ ఆకు విరిగిపోయినట్లయితే వాటిని బయటకి తీసేయవచ్చు. ఆకులని తీసేసి గాలి చేరని సీసాలో భద్రపరచండి. ఆకులని తీసివేస్తున్నప్పుడు అనవసరమైన పదార్ధాలని అంటే చెక్క ముక్కలు వంటివి తొలగించండి. అకులన్నింటిని మీ చేతులతో నలిపి ఒక మిశ్రమం లాగ తయారు చేసి వంటలో వాడుకోవచ్చు. లేకపోతే వాటిని అలాగే ఆకుల ఆకారంలోనే ఉండనిచ్చి టీ, సూప్ ల పై అలంకరణ కోసం వాడుకోవచ్చు. విత్తనాల్ని పక్కన పెట్టుకుని వంటలలో వాడేటప్పుడు మాత్రమే నలిపివేయాలి. ఆ సిసాపై ఆ మూళిక ల పేరు రాసి తేదీ రాయండి. వీటిని ఒక సంవత్సరం పాటు వాడుకోవచ్చు.

4. ఘనీభవించడం: ఘనిభవించడం కోసం తగిన మూళికలని ఎంచుకోండి. తులసి, తరగోన్, లోవాజ్ మరియు పార్స్లీ వంటి ఆకులని భద్రపరిచేందుకు ఈ పద్దతిని పాటించాలి. చోవేస్ వంటి కొన్ని మూళికలు ఎండవు కాబట్టి ఈ పద్దతిని పాటించాలి.

తాజాగా తీసిన మూళిక లని తీసుకుని కడిగి పైన చెప్పిన విధంగా ఎండబెట్టండి. ఆకులని కాడల నుండి తొలగించి ఫ్రీజర్ బాగ్స్ లేదా ఫ్రీజర్ కంటైనెర్స్ లో భద్రపరచండి. వాటి మీద పేరు రాసి తేది రాయండి. వీటిని మూడు నెలల పాటు ఈ విధంగా భద్రపరచాలి. ఎక్కువ కాలం నిలవుంచాలి అనుకుంటే, వేడి నీళ్ళలో వీటిని ముంచి వెంటనే మళ్లీ వెంటనే వీటిని చల్లటి నీళ్ళలో తడిపి ఆ తరువాత బాగ్స్ లో సర్ది ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఈ మూలికలు ఆరు నెలల పాటు ఈ విధంగా ఉండాలి.

కొందరు వంటవాళ్లు ఈ మూళికలను ఐస్ ట్రేస్ లో భద్రపరుస్తారు. దీని వల్ల అవి చిన్న సైజు లో ఉండి వంట ల లో వాడుకునేందుకు అనువుగా ఉంటాయి. ఒక వేళ ఈ పద్దతిలో మూళికలని గడ్డ కట్టించాలనుకుంటే తరిగిన ఒక పావు మూళికలకి రెండు పావుల నీళ్ళు తీసుకుని ట్రే లో భద్రపరచండి. ఐస్ క్యూబ్ ల లో భద్రపరిచే ముందు తులసి ఆకులని ఆలివ్ నూనెలో ముంచండి. ఐస్ క్యూబ్ ల లో గడ్డ కట్టిన ములికాలని తీసి ప్లాస్టిక్ ఫ్రీజర్ బాగ్స్ ల లో భద్రపరచండి.

5. నూనే లో నానబెట్టడం

పైన చెప్పిన విధంగా ముళికలని కోసి శుభ్రపరచండి. ఆలివ్ నూనే లేదా మీరు సాధారణంగా వాడే నూనె లని తీసుకోండి. ఆకులని కాడ ల నుండి వేరుచేయవచ్చు లేదా కాడలకే ఆకులని ఉంచి అలాగే భద్రపరచవచ్చు. మూళికల సువాసనలు అంటిన ఈ నూనే ని మీరు మరలా వాడాలనుకుంటీ కొమ్మలతో కలిపి భద్రపరచవచ్చు. కాడలకి ఉన్న ఆకులతో సహా ఒక సీసాలో ఉన్న నూనెలో భద్రపరచండి. చూడడానికి అందంగా ఉండడమే కాకుండా వంటలలో వాడడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక వేళ మూళికల ఆకులని తొలగించి వంటలోకి వాడాలని అనుకుంటే విశాలమైన చిన్న సైజు కంటైనర్ ను ఎంచుకోండి. దాని వల్ల ఆకులని లేదా నూనె ని చెంచా తో అవసరానికి తగ్గట్టు తీసుకోవచ్చు.

చల్లని ప్రదేశంలో లేదా రెఫ్రిజేరేటర్ లో భద్రపరచండిల. ఆరునెలల లోపు వాడండి.

జాగ్రత్తలు:

ఒక వేళ మీ తోటలో రసాయనాలు వాడినట్లయితే, మూళికలని ఎండబెట్టే ముందు శుభ్రంగా కడగాలి. వాటి పైన ఉన్న రసాయినాలు తొలగి పోయే వరకు జాగ్రత్తగా కడగాలి. మీది మరియు మీ కుటుంబానిది ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి, రసాయనాలు తొలగిపోయేలాగా జాగ్రత్తగా శుభ్రపరచాలి. తేమగా ఉన్నప్పుడు మూళికలని తీయకూడదు. వాటిని భద్రపరిచినప్పుడు బూజు పట్టే అవకాశాలు కలవు. ఈ మూళికలని ఎక్కువ కాలం వేలాడదీయడం వల్ల వాటి లో ఉండే సువాసనలు తగ్గిపోయే అవకాశం కలదు.

English summary

How to Preserve Herbs | మూళికలని భద్రపరచడం ఎలా?

Drying herbs is a simple way of keeping your garden bounty for longer. Drying your own herbs allows you to have total control over the origin of the herbs and the amount. Even though fresh herbs may be better, herbs usually do not supply you through winter unless dried. There are three principal ways to dry herbs.
Story first published: Tuesday, January 15, 2013, 11:54 [IST]
Desktop Bottom Promotion