For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్ బాల్స్ యొక్క అద్భుత ఉపయోగాలు

By Super
|

మన రోజువారీ పనులకి ఇంట్లో ఉండే వస్తువులని ఉపయోగించుకోవడాన్ని మనందరం ఇష్టపడతాము కదా. మార్కెట్లో బోలెడు ఖరీదు పెట్టి కొనేకన్నా ఇంట్లో ఉండే వస్తువులనే విభిన్న రకాలుగా వాడుకోవచ్చు. ఈ రోజు టెన్నిస్ బాల్స్ ని ఇంట్లో పనులకి ఎలా ఉపయోగించవచ్చో చూద్దాము.

ఈ టెన్నిస్ బాల్ చిట్కాల వల్ల మన పనులు సులభం అవుతాయి. క్రీడా మైదానంలోనే కాకుండా టెన్నిస్ బాల్స్ ఇంట్లో కూడా వీటి వినియొగంతో మ్యాజిక్ చెయ్యవచ్చు. టెన్నిస్ బాల్ ఉపయోగించి మీరు మీ కార్ ని పార్క్ చెయ్యవచ్చు లేదా మీ బట్టలని శుభ్రపరచవచ్చు. ఈ సులభమైన చిట్కాలు ఉపయోగించి మీ ఇంట్లో మ్యాజిక్ చెయ్యండి మరి. వీటి వల్ల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. ఇక మన నిత్య జీవితంలో టెన్నిస్ బాల్స్ ని ఎలా ఉపయోగించవచ్చో చదవండీ మరి.

ఫర్నీచర్ శుభ్రపరచడం:

ఫర్నీచర్ శుభ్రపరచడం:

మీ ఫర్నీచర్ అంచులని సాండ్ పేపర్‌తో శుభ్రపరుద్దామనుకుంటున్నారా?? అయితే ఒక టెన్నిస్ బాల్ కి సాండ్ పేపర్ కి చుట్టి ఫర్నీచర్ అంచులమీద రుద్ది చూడండి. దీని వల్ల మీ ఫర్నీచర్ కి మంచి ఫినిష్ వస్తుంది కూడా.

బాటిల్స్ మూత తీయడం:

బాటిల్స్ మూత తీయడం:

బాటిల్ ఓపెన్ చెయ్యడానికి ఓపెనర్ లేదని కంగారుగా ఉందా?? అయితే మీ టెన్నిస్ బాల్ ని సగానికి కట్ చేసి బాటిల్ యొక్క కార్క్ మీద పెట్టి తిప్పండి. అంతే, బాటిల్ కార్క్ సులభం గా ఊడి వస్తుంది.

టూల్ బాక్స్:

టూల్ బాక్స్:

మీ టూల్ బాక్స్ లో మేకులు కదలకుండా ఉండాలంటే టెన్నిస్ బాల్ ని సగానికి కట్ చేసి దానిని మేకులున్న పెట్టెలో వేసి వదిలెయ్యండి. ఒకవేళ బాల్ ని సగానికి కట్ చెయ్యడం ఇష్టం లేకపోతే బాల్ చుట్టూ మేకులు గుచ్చి పెట్టవచ్చు. టెన్నిస్ బాల్ ని ఇంట్లో వివిధ రకాలుగా వాడే పద్దతుల్లో ఇదిం ఒక అధ్భుతమైన పద్ధతి.

మసాజ్:

మసాజ్:

టెన్నిస్ బాల్ ఉపయోగించి మీరే ఒక మసాజర్ ని తయారు చేసుకోండి. కొన్ని టెన్నిస్ బాల్స్ తీసుకుని సాక్స్ లేదా స్టాకింగ్ లో వేసి బిగించండి. దీనిని మీ వీపు మీద మసాజర్ లాగ కదిలిస్తూ వాడుకుంటే మీకు వెన్ను నెప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

అలసిన పాదాలకి:

అలసిన పాదాలకి:

మీ పాదాలు అలసిపోయాయా?? అయితే టెన్నిస్ బాల్‌తో ఈ చిన్న ట్రిక్ చెయ్యండి. మీ పాదాల కింద టెన్నిస్ బాల్ పెట్టుకుని అటూ ఇటూ పాదాలని కదపండి. ఇలా చేసేటప్పుడు మీరు కూర్చునే ఉండాలి సుమా లేదంటే జారి పడే ప్రమాదం ఉంది. టెన్నిస్ బాల్ చిట్కాలలో ఇది కూడ ఒక అధ్భుతమైన చిట్కా.

టవల్స్ లేదా దుప్పట్ల మృదుత్వం:

టవల్స్ లేదా దుప్పట్ల మృదుత్వం:

మీ కంఫర్టర్ లేదా టవల్స్ మెత్తదనాన్ని కోల్పోకూడదనుకుంటే డ్రయ్యర్లో ఓ రెండు మూడు టెన్నిస్ బాల్స్ వెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల మీ దుప్పట్లు మృదుత్వం కోల్పోకుండా ఉంటాయి.

English summary

Amazing Uses Of Tennis Balls

Amazing Uses Of Tennis Balls. We all love to make the best use of household items in our daily chores. Instead of spending a lot of money in buying products from markets one can make the best use of house items.
Story first published: Wednesday, February 17, 2016, 17:22 [IST]
Desktop Bottom Promotion