For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

West Facing House: ఇంటి ప్రధాన ద్వారం పడమర వైపు ఉందా.. అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి

ఇల్లు నిర్మించేటప్పుడు చాలా మంది వాస్తు పాటిస్తారు. తూర్పు లేదా ఉత్తరం దిక్కున ద్వారం ఉండేలా చూసుకుంటారు. దక్షిణం, పడమర వైపు ద్వారం ఉండకుండదని, ఉంటే ఇంట్లో మంచి జరగదని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ప

|

West Facing House: ఇల్లు నిర్మించేటప్పుడు చాలా మంది వాస్తు పాటిస్తారు. తూర్పు లేదా ఉత్తరం దిక్కున ద్వారం ఉండేలా చూసుకుంటారు. దక్షిణం, పడమర వైపు ద్వారం ఉండకుండదని, ఉంటే ఇంట్లో మంచి జరగదని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకు దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది.

West Facing House

స్థలం ప్రకారం కొన్ని సార్లు తూర్పు, ఉత్తరం వైపుకు ద్వారం ఉంచడం సాధ్యం కాదు. ఇంటి ప్రధాన ద్వారం పడమర వైపుకు పెట్టేలా అనివార్య కారణం ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇంటి ద్వారా పశ్చిమం వైపు ఉండే వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనే తేడా లేకుండా సమానంగా ముఖ్యమైనవే. ఇంటి ప్రధాన ద్వారం ఉన్న ప్రదేశం, ఇంటి వైపు ఎంతో ముఖ్యమైనది.

పడమర వైపు ద్వారం ఉంటే..
జపనీయులు ఇంటి ప్రధాన ద్వారం పడమర ముఖంగా ఉండటాన్ని శుభప్రదంగా భావిస్తారు. పడమర దిక్కున ఉంటే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని విశ్వసిస్తారు. వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, గురువులు, మతపరమైన వ్యక్తులు పడమర దిశలో ఉన్న ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం.

West Facing House

వాటర్ ట్యాంకులు
ఓవర్ హెడ్ ట్యాంక్ లేదా అండర్ గ్రౌండ్ ట్యాంక్ లేదా సాధారణ అక్వేరియం ఏదైనా నీటి ట్యాంక్ సరైన స్థలంలో ఉంచాలి. ఇంటికి నైరుతి వైపు ఎప్పుడూ ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టాలి. ఇది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది.

ఫౌంటెన్లు
నీటి ఫౌంటెన్లు ఏర్పాటు ఎప్పుడూ చేయకూడని వ్యవహారంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి కొందరు నిపుణులు మరోలా సలహా ఇస్తారు. పడమర ముఖంగా ఉన్న ఇళ్లలోని ఈశాన్య భాగంలో లేదా మూలలో వాటర్ ఫౌంటైన్లు, అక్వేరియాలు ఉంచాలి.

వంటగది
పడమర ముఖంగా ఉన్న ఇంటికి వంట గదిని ఈశాన్య భాగంలో నిర్మించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. పడమర వైపు ఉండటం వల్ల వచ్చే ప్రతికూల శక్తులను బ్యాలెన్స్ చేయడానికి ఈ చిట్కా పాటించాలి.

ఉప్పు నీటితో నింపిన గ్లాసు
పడమర వైపు ద్వారం ఉంటే.. ఇంటి నైరుతి భాగంలో ఉప్పు, లవంగాలతో నింపిన గ్లాసు ఉంచాలి.

English summary

Vastu tips for a west facing house in Telugu

read on to know Vastu tips for a west facing house in Telugu
Story first published:Friday, December 9, 2022, 17:48 [IST]
Desktop Bottom Promotion