For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదృష్టాన్ని అందించే జంతుసంపద.... !

By B N Sharma
|
Animals that can kill evil eye!
నాగరికత ఏర్పడినది మొదలు మనిషి జీవితంతో పాటు అతని ఇంటిని ఆశ్రయించుకొని అనేక జంతువులు కూడా జీవిస్తున్నాయి. ఇప్పటికి కొన్ని నాగరికతలలో కొన్ని జంతువులను శుభసూచకంగా భావిస్తూ వాటిని ఆదరిస్తున్నారు. అవేమిటో పరిశీలిద్దాం!

కప్పలు - కప్పలు ఇంట్లో వుంటే, ఐశ్వర్యం, సంతానం, ఆనందం కలుగుతాయని చాలామంది భావిస్తారు. కప్ప అనేక గుడ్లు ఒకే సారి పెడుతుంది. అందుకని సంతానానికి చిహ్నంగా చెపుతారు. ఇటలీ, ఈజిప్టు దేశాలలో కప్పలకు మ్యాజికల్ పవర్స్ ఇచ్చే జీవాలుగా ప్రాధాన్యత చూపుతారు.

పులులు - మన దేశంలో పులుల సంతతి మాయమైపోతోంది. వీటికి మన దేశంలోనే కాక, చైనాలో కూడా ఎంతో ఆదరణ. ఇంటి ఆస్తులు, విలువైన వస్తువులు కాపాడుతుందని నమ్ముతారు. మాత దుర్గాదేవికి పులి వాహనం. చెడు శక్తులనుండి రక్షణ పొందటానికి పిల్లల చెప్పులకు పులి గుర్తు కూడా వేస్తారు.

హార్స్ లేదా గుర్రం - తెల్లటి అశ్వాన్ని అన్ని నాగరికతలలోను సంపదకు చిహ్నంగా భావించారు. ప్రేమానురాగాలకు ప్రతి రూపంగా అశ్వాన్ని గుర్తిస్తారు. విజయానికి, విశ్వాసానికి, ధైర్యానికి, వేగానికి, జీవితంలో అభివృద్ధికి సంకేతంగా హార్స్ ని గుర్తిస్తారు.

పిల్లి - జపాన్ ప్రజలు చేయి ఊపుతున్న పిల్లి సంపదనిచ్చే చిహ్నంగా భావిస్తారు. పిల్లిని వారి కార్యాలయాలలో, గిడ్డంగులలో తూర్పు దిశగా వుంచుతారు. మనీ ఇస్తుందన్న భావనతో మనీ కేట్ గా దీనిని వారు పిలుస్తారు. పిల్లులు కూడా చెడు శక్తులను పారద్రోలుతాయని నమ్ముతారు. పిల్లిలేకుండా జపాన్ లో రెస్టారెంటు లేదా బార్ వంటివాటికి ప్రారంభోత్సవాలే జరగవట.

English summary

Animals that can kill evil eye! | అదృష్టాన్ని అందించే జంతుసంపద.... !

The Japanese golden cat, waving her arm is believed to be bringing in good fortune and is often kept at the entrance of stores or offices in the East. Often called the Money Cat it brings money luck, prosperity and opportunities. Cats are also said to have the ability to frighten away evil spirits that can hamper your success.
Story first published:Tuesday, November 15, 2011, 15:37 [IST]
Desktop Bottom Promotion