For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వానల కాలం... చెక్కకు ముప్పు..!!

|

How to Take Care of Your Wooden Furniture?
వానా కాలం వచ్చిందంటే.. చెక్క గృహోపకరణాల విషయంలో కాస్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటే మంచిది. చినుకుల కాలంలో తేమ వల్ల లోహ, చెక్క గృహోపకరణాలు త్వరగా పాడైపోతుంటాయి. నీటి చమ్మ కారణంగా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.. కార్పెట్‌లను శుభ్రపరిచి.. దాచి పెట్టకోండి.. వాటికి బదులు ప్లాస్టిక్ షీట్లను పరచండి.

తడిని త్వరగా పీల్చుకునే మందపాటి గోనే సంచులను గుమ్మం దగ్గర వేస్తే బురద, తేమతో ఇబ్బందులు ఉండవు. ఈ కాలంలో గుమ్మాలకు, కిటికీలకు పలచటి కర్టన్‌లను కడితే బాగుంటుంది. ఎందుకంటే ఎండ సమయంలో సూర్యకిరణాలు, వెలుతురు లోపలకు ప్రసరించటంతో గదిలో తేమ లేకుండా పొడిగా ఉంటుంది.

ప్రత్యేకించి వానా కాలంలో ఇంట్లో అలంకరణకు పచ్చటి మొక్కలను నాటేముందు ఆలోచిస్తే మేలు.. ఎందుకుంటే మొక్కలు ఎక్కువుగా తేమను విడుదల చేస్తాయి. కాబట్టి అలంకరణకు ప్లాస్టిక్ వస్తువులను ఎంచుకోవటం మేలు. ప్లాస్టిక్ అలంకరణల పై దుమ్ము కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరచుకుంటే బాగుంటుంది.

విలువైన పత్రాలతో పాటు డాక్యుమెంట్లను ప్రత్యేకించి ఈ కాలంలో వాటర్ ప్రూఫ్ సంచుల్లో భద్రపరుచుకోవాలి. ఈ వర్షాకాలంలో అల్మరాలకు రంగు వేయించటం అంత మంచిది కాదు. రంగు వేయటం వల్ల ఇనుప అల్మరాలకు తుప్పు పట్టే అవకాశ ముంది.

చెక్క అల్మరాల్లో కర్పూరాన్ని వేస్తే అది తేమను పీల్చుకుంటుంది. దస్తుల్లో లవంగాలు, వేపాకు వేస్తే అరోమా వాసనలు వస్తాయి.ఇంటికి వెంటిలేషన్ ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి. దాని వల్ల తేమ గాలి బయటకు వెళ్లి, తాజా గాలి లోపలికి వస్తుంది.

English summary

How to Take Care of Your Wooden Furniture? | వానల కాలం... చెక్కకు ముప్పు..!!

Wooden furniture is a costly thing and it can be regarded as your valuable asset like your valuable jewelry or bank balance. Once you have invested money in your wooden furniture, you should take proper care of it because good quality wooden furniture stays for generations after generations. Here are a few tips on the care and handling of your wooden furniture.
Story first published:Friday, August 12, 2011, 9:38 [IST]
Desktop Bottom Promotion