For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆనందించాలంటే....కడుక్కోవాల్సిందే మరి!

By B N Sharma
|

Keep Home & Pets Clean!
ఇంట్లో పిల్లలుంటే కన్నా కుక్కలుంటే పని పెరుగుతుంది. కాని పెంపుడు కుక్కపిల్లతో వున్న ఆనందమే వేరు. ఎంత ఆనందించినప్పటికి, మీరు అతి ప్రేమగా చూసుకునే కార్పెట్ ఖరాబు చేసిందంటే...దానికి దండనే. కాని అవి ఎంతో అమాయకంగా వుంటాయి. మూగ జీవాలు. కేకలు వేసి లేదా కొట్టి ప్రయోజనం లేదు. వాటిపని అవి చేస్తూ వుంటే, వాటితో ఆనందిస్తూనే, శుభ్రతలకై ఎప్పటికపుడు ఇంటిని, అవి పాడు చేసిన వస్తువులను కడుక్కుంటూ వుండాల్సిందేమరి. దానికి గాను కొన్ని చిట్కాలు చూడండి....!

1. ఇంటిలో పెంచేది కుక్కా లేక పిల్లి అయితే వీటికి ఏరకమైన శుభ్రత పాటించాలనేది ముందుగా ప్రణాళిక చేయండి.
2. చాలా పెంపుడు జీవాలతో బొచ్చు రాలటం సమస్య వుంటుంది. ఇవి రాల్చిన బొచ్చుతో అలర్జీలు తెచ్చుకునేవారు కూడా వున్నారు.
3. అటువంటపుడు వారాని కొక సారి లేదా రెండు సార్లు, వాక్యూమ్ క్లీనర్ తో పూర్తిగా శుభ్రం చేయాలి. వీటి బొచ్చు చాలా మెత్తన. ఒక్కోసారి ఆహార పదార్ధాలపై కూడా పడుతుంది. అందుకని వాక్యూమ్ క్లీనర్ తో ఇంటిలోవున్న ఫర్నిచర్ కూడా శుబ్రం చేయండి.
4. కుక్క ఖరాబు చేయటం చూస్తే అది తడివుండగానే వెంటనే శుభ్రం చేయండి. ఆలస్యం చేస్తే, శుభ్రత కష్టం. పై పెచ్చు దుర్వాసన.
5. మీకు కనపడని ప్రదేశాల్లో కూడా ఒక్కొక్కపుడు అది అల్లరిగా కావాలని ఖరాబు చేసి వస్తుంది. కనుక కనిపెట్టి ఆ ప్రదేశాలు చూస్తూ వుండండి.
6. కడగటానికి ఉపయోగించే ఫినాయిల్ వంటివి వాసనే కాదు ఇంటిలో మరకలు సైతం పోయేలా ఘాటుగా వుండాలి.

ఈ శుభ్రతా చర్యలతో మీ పెంపుడు జీవాలు ఎంత అల్లరివైనా ఆనందించవచ్చు.

English summary

Keep Home & Pets Clean! | ఆనందించాలంటే....కడుక్కోవాల్సిందే మరి!

The disinfectant that you use for cleaning pet stains should not be just as foul smelling as the stain itself. Most stain cleaners are ammonia based; avoid them and go for fresh natural cleaners with floral or antiseptic smells. With these housekeeping tips it is possible to keep your home clean despite pets that are messy and naughty too.
Story first published:Wednesday, November 9, 2011, 12:36 [IST]
Desktop Bottom Promotion