For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల వెంట్రుకల సమస్యలు తగ్గాలంటే!

By B N Sharma
|

Tips To Clean Hair Brush/Comb
హెయిర్ బ్రష్ లు, దువ్వెనలు త్వరగా మురికి పట్టేస్తాయి. శుభ్రం చేయటం కష్టం. శుభ్రం చేయకుంటే చుండ్రు లేదా ఇతర సమస్యలు వస్తాయి. కనుక వాటిని శుభ్ర పరచటం అవసరం. అందుకు కొన్ని చిట్కాలు చూడండి.

1. హెయిర్ బ్రష్ లేదా దువ్వెన శుభ్రపరచే ముందు, దానికున్న జుట్టు అంతా తీసేయండి.
2. దువ్వెనను వేడి లేదా సాధారణ నీటిలో కొద్దిసేపు నానపెట్టండి.
3. దువ్వెనలను వేడినీరు షాంపూ కలిపిన నీటిలో 5 నిమిషాలు నానపెట్టండి.
4. సన్నని పళ్ళు వున్న మరో దువ్వెనతో దానిలోని మురికిని, వెంట్రుకలను తీసివేయండి.
5. ఇపుడు టూత్ బ్రష్ ఉపయోగించి దాని పళ్ళను శుభ్రం చేయండి. దువ్వెన రెండువేపులా శుభ్రం చేయండి.
6. లేదా ఏదేని క్లీనింగ్ సొల్యూషన్ దానిపై వేసి ఒక చిన్న బ్రష్ సహాయంతో శుభ్రపరచండి.
7. సొల్యూషన్ తో శుభ్ర పరచిన తర్వాత మంచి నీటిలో బాగా కడిగి గుడ్డతో పొడిగా తుడిచేయండి.
8. ప్రతి రోజూ నిద్రించేముందు దువ్వెన శుభ్ర పరచుకుంటే చుండ్రు లేదా ఇతర సమస్యలు దూరమవుతాయి.

English summary

Tips To Clean Hair Brush/Comb | తల వెంట్రుకల సమస్యలు తగ్గాలంటే!

For proper hair care, clean the hair brush or comb whenever you find it dirty. A hair brush sets the hair style easily and it is very important to keep the hair brushes and combs clean for a clean hair and scalp.
Story first published:Monday, October 24, 2011, 13:04 [IST]
Desktop Bottom Promotion